BigTV English

Jailer Movie Review: జైలర్ రివ్యూ.. సినిమా ఎలాగుంది రాజా?

Jailer Movie Review: జైలర్ రివ్యూ.. సినిమా ఎలాగుంది రాజా?
Rajinikanth's Jailer Movie Review Telugu

Rajinikanth’s Jailer Movie Review Telugu(Latest Tollywood News):

రిలీజ్‌కు ముందే జైలర్ రాజకీయంగా దుమ్ము రేపింది. ప్రీరిలీజ్ ఈవెంట్లో అర్థమయిందా రాజా? అంటూ రజినీ పంచ్ డైలాగ్ వదలడంతో.. ఏపీలో కాక రేగింది. సినిమాకు ఫుల్‌గా ఫ్రీ పబ్లిసిటీ వచ్చేసింది. మరి, మూవీ ఎలా ఉంది? రజినీ స్టైల్ ఎలా ఉంది? జైలర్‌గా మెప్పించారా? రమ్యకృష్ణతో నరసింహ కాంబినేషన్ రిపీట్ అయిందా? తమన్నా, మోహన్‌లాల్, జాకీష్రాఫ్, సునీల్ లాంటి స్టార్స్‌ రోల్ ఏంటి?


కథ: రజినీకాంత్ క్యారెక్టర్ నేమ్.. ముత్తు అలియాస్ ముత్తువేల్ పాండ్య‌న్. ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. డిపార్ట్‌మెంట్‌లో టైగర్. ఆయన భార్య ర‌మ్య‌కృష్ణ‌. కొడుకు అర్జున్ ఏసీపీ. మ‌న‌వ‌డు కూడా ఉంటాడు. విగ్ర‌హాలు దొంగిలించే ముఠా నాయకుడు వ‌ర్మ (వినాయ‌క‌న్‌). అతను ముత్తు ఫ్యామిలీని టార్గెట్ చేస్తాడు. త‌న కుటుంబాన్ని కాపాడుకోటానికి ముత్తు ఏం చేశాడనేది సినిమా స్టోరీ.

పక్కా కమర్షియల్ హంగులు అద్దారు. పోలీస్ ఆఫీసర్, మాఫియా, రివేంజ్, ఫ్యామిలీ డ్రామాలను రంగరించారు. సినిమా అంతా ర‌జినీ మార్క్ స్టైలిష్‌నెస్ కనిపిస్తుంది. మాస్‌ను ఫుల్‌గా వెలివేట్ చేశారు. సినిమా అంతా రజినీకాంత్ వన్ మ్యాన్ షోగా నడుస్తుంది.


స్లోగా క్యారెక్టర్స్‌ను ఇంట్రడ్యూస్ చేస్తాడు డైరెక్టర్. హీరో, విలన్, మాఫియాను హైలైట్ చేశాక.. అప్పుడు మెళ్లిగా స్టోరీ మొదలవుతుంది. ఫ్యామిలీమ్యాన్‌గా రజినీని సింపుల్‌గా, కామెడీగా చూపిస్తారు. అలా ఫస్ట్ హాఫ్ కాస్త ఫన్నీగా సాగిపోతుంది. ముత్తు కొడుకు అర్జున్ మిస్సింగ్‌తో కథలో సీరియస్‌నెస్ పెరుగుతుంది. రజినీకాంత్ రంగంలోకి దిగాక.. ఇంటెన్సిటీ పెరుగుతుంది. ఇంటర్వెల్ ముందు.. ఇంట్లోనే జరిగే యాక్షన్ ఎపిసోడ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. సెకండాఫ్‌పై క్యూరియాసిటీ పెంచుతుంది.

అయితే, బ్రేక్ తర్వాత కథ అడ్డదిడ్డంగా మలుపులు తిరుగుతుంది. విలన్ కండిషన్‌కు ఒప్పుకోవడం.. కిరీటం దొంగిలించి తీసుకురావడం.. ఇలా కథకు అతకని విధంగా స్టోరీ నడుస్తుంది. ముత్తు ఫ్లాష్‌బ్యాక్ కూడా బాషాలా ఏమీ మెప్పించదు. చివర్లో మళ్లీ కథ ట్రాక్‌లోకి వస్తుంది. మోహ‌న్‌లాల్‌, జాకీష్రాఫ్‌, శివరాజ్‌కుమార్‌ల గెస్ట్ రోల్స్ పాత్రలకు న్యాయం చేశాయి. తమన్నా, రమ్యకృష్ణలకు పెద్దగా ప్రాధాన్యం లేదు.

పాత సినిమాల కథల్లానే అనిపించినా.. రజినీ స్టైల్‌కు తగ్గట్టు మేకోవర్ చేసి.. మాసిజం దట్టించి.. క్లాసీగా ప్రజెంట్ చేశారు. విలన్ క్యారెక్టర్ అదిరిపోద్ది. సినిమాను రజినీకాంత్ తన భుజాల మీద మోశారు. మ్యూజిక్ మెప్పిస్తుంది. టెక్నికల్‌గా రిచ్‌గా ఉంది. ఫస్ట్ హాఫ్ బాగున్నా.. సెకండాఫ్ ఇంకా బాగుంటే.. జైలర్ మరింత బాగుండేది. అర్థమయిందా రాజా!

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×