Pawan Kalyan: జనసేన పార్టీకి దుష్టశక్తుల ముప్పు ఉందా?.. తనను కాపు కాస్తున్న జన సైనికులకు, వీర మహిళలకు పవన్ ఎందుకు కృతజ్ఞతలు చెప్పారు? జనసేన చుట్టూ కుయుక్తులు పన్నుతుంది ఎవరు? ఇంతకు ముందున్నడు లేని విధంగా పవన్ వైఖరిలో మార్పులకి కారణాలేంటి? నిజంగా జనసేన పార్టీకి ముప్పు ఉందా? పవన్ వ్యాఖ్యలు అంతరార్థం ఏంటి?
ఇప్పటి వరకు తనదైన శైలిలో రాజకీయాలు చేస్తూ ముందుకు వెళుతున్న జనసేన అధ్యక్షుడుపవన్ కళ్యాణ్… తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి తెర లేపుతున్నారు. ఇప్పటివరకు ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విరుచుకుపడిన పవన్ కళ్యాణ్ , కూటమి జోలికి వస్తే తాటతీస్తామంటూ హెచ్చరిస్తూ వచ్చారు. ఇక జనసేన బలోపేతం, విస్తరణలపై తనకు స్పష్టమైన విధానాలు ఉన్నాయని… పార్టీని ఏ విధంగా ముందుకు నడిపించాలో ప్రణాళికలు ఉన్నాయని చాలా సార్లు వెల్లడించారు.
అలాంటి జనసేనాని, డిప్యూటీ సీఎం హోదాలో ఉంటూ కూడా సడన్ గా దుష్టశక్తుల నుండి జనసేన పార్టీని కాపాడాలంటూ మాట్లాడడం వెనుక అంతరార్థం ఏంటనే చర్చ నడుస్తోంది. ఇంతకీ పవన్ కళ్యాణ్‌ను, ఆ పార్టీని వెంటపడుతున్న దుష్టశక్తులు ఏవి ? అన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్దఎత్తున సాగుతోంది. ఆ క్రమంలో తాజాగా పార్టీ కార్యకర్తల టెలికాన్ఫరెన్స్‌లో పవన్‌కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఎవరికి అంతుపట్టకుండా తయారయ్యాయి.
పవన్ ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక జనసేనలో చోటు చేసుకుంటున్న పరిణామాలే కారణమన్న వాదన కూడా వినిపిస్తోంది… పార్టీలోని కొంతమంది వ్యక్తుల మధ్య జరుగుతున్న వివాదాలు, ఆర్థిక లావాదేవీలు, వివాహేతర సంబంధాలు వంటి విషయాలు పార్టీకి ఆపాదించి… డామేజ్ చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడుతున్నారంట. అందుకే పవన్ కళ్యాణ్ ఆ విధంగా స్పందించారని టాక్ వినబడుతోంది. రాష్ట్రంలో ఏ చిన్న ఇష్యూ జరిగినా .. దాన్ని పవన్ కళ్యాణ్‌తో లింక్ పెడుతూ సోషల్ మీడియాలో కొంతమంది ఉద్దేశపూర్వకంగానే నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని…అలాంటి వాళ్ళి వల్ల పార్టీకి డామేజ్ జరిగే అవకాశం ఉంది కాబట్టే పవన్ కళ్యాణ్ ఈ విధంగా దుష్టశక్తులతో జాగ్రత్తగా ఉండాలని చెప్పారంటున్నారు.
ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన దళితల ఇష్యూ, కైకలూరు లో జరిగిన దళితుల దాడి కేసులో.. వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ విపరీతమైన ట్రోలింగ్ చేసింది. ఇలా పార్టీకి సంబంధం లేకపోయినా, వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ కి సంబంధం లేకపోయినా…. రాష్ట్రంలో జరిగే ప్రతి సెన్సిటివ్ ఇష్యూ ని పార్టీకి అంట కట్టాలని చూస్తున్నారని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు కనబడుతుంది… అందుకే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు జనసైనికలు అభిప్రాయపడుతున్నారు.
ఇక వీటితో పాటు.. ఇటీవల హైదరాబాదులో రేణు దేశాయ్ కుక్కల గురించి మాట్లాడినప్పుడు రేగిన వివాదం… చినికి చినికి గాలి వాన లాగా మారింది. అయితేజరిగిన వ్యవహారాన్ని పక్కనపెట్టి రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ పెళ్లి ఇష్యూ తెర మీదకి తెస్తూ పవన్ టార్గెట్‌గా నెగిటివ్ ప్రచారాలు తీసుకు రావడాన్ని ఉద్దేశించి.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని మరో టాక్ కూడా పొలిటికల్ సర్కిల్స్‌లో నడుస్తోంది. ఎప్పుడో ముగిసిన అధ్యాయాన్ని, ఇప్పుడు కావాలనే రాజకీయ ఉద్దేశంతో బయటకు తీస్తున్నారని…అలాంటి వాటిని కట్టడి చేయాలనే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు ప్రచారం నడుస్తోంది. సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న వారి గురించి, సోషల్ మీడియా గురించి జాగ్రత్తగా ఉండాలని పవన్ కళ్యాణ్ నేతలను అలర్ట్ చేసే ప్రయత్నం చేసారనే టాక్ వినపడుతుందట.
మరోవైపు పవన్ కళ్యాణ్ దుష్టశక్తులతో పోల్చింది కేవలం సోషల్ మీడియా నా…లేక బలమైన నాయకులు ఎవరైనా కుట్ర కోణంలో జనసేన పార్టీని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.. అధికారంలోకి వచ్చిన 18 నెలల పాటు ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడని పవన్ కళ్యాణ్ సడెన్ గా దుష్టశక్తులు అంటూ సంబోధించడం వెనుక బలమైన కారణాలు ఉండి ఉంటాయన్న అనుమానం కూడా ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.. ఏది ఏమైనా జనసేన పార్టీలో జరుగుతున్న పరిణామాలు, జనసేన పార్టీ చుట్టూ జరుగుతున్న పరిణామాలపై ఆ పార్టీ నేతలో ఆందోళన రేగుతోందంట.. ఆ క్రమంలో పవన్‌కళ్యాణ్‌ని పొలిటికల్‌గా డామేజ్ చేయడానికి జరిగే కుట్రలను సమర్ధవంతంగా తిప్పికొట్టాలని జనసైనికలు ఫిక్స్ అయ్యారంట.
Story by: Apparao, Big Tv