BigTV English

Kaikala: 777 సినిమాలు.. వెండితెర యముడు.. కైకాలకు సాటిలేరెవ్వరూ..

Kaikala: 777 సినిమాలు.. వెండితెర యముడు.. కైకాలకు సాటిలేరెవ్వరూ..

Kaikala: తెలుగు ప్రజలెవరైనా కళ్లు మూసుకొని ఓసారి యముడి రూపాన్ని గుర్తు చేసుకోండి.. మీకు ఎవరు గుర్తుకొచ్చారు? డౌటేముంది.. ఇంకెవరు? యముడిగా ఆజానుబాహుడు, గంభీర రూపుడు.. కైకాల సత్యనారాయణ స్వరూపమే మదిలో మెదులుతుంది. అలా, యముడు అంటే కైకాలనే అనేంతలా.. కుదిరిపోయారు ఆ పాత్రలో. ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘యమగోల’లో మొదటిసారి యముడి పాత్రలో నటించారు. ఇద్దరూ పోటాపోటీగా చేశారు. తర్వాత చిరంజీవితో ‘యముడికి మొగుడు’ చేశారు. ‘పిట్టలదొర’, ‘యమలీల’, ఇలా ఏ సినిమాలోనైనా యముడి పాత్ర వేయాలంటే కైకాలనే.


కంచు కంఠం.. ఉగ్ర రూపం.. అద్భుత నటనతో.. ఒక్క యముడనే కాదు.. వెండితెరపై నవరసాలూ పండించిన ఏకైకా నటుడు. హీరోగా, విలన్ గా మెప్పించారు. అంతటి గంభీరమైన మనిషి.. కామెడీని సైతం బాగా పండించారు. సెంటిమెంట్ పాత్రలో ఒదిగిపోయారు. అందుకే ఆయనకు నవరస నటనా సార్వభౌమ.. అనే బిరుదు.

1935లో కృష్ణాజిల్లా కౌతవరంలో సత్యనారాయణ జన్మించారు. గుడివాడ కాలేజీలో గ్రాడ్యూయేషన్‌ పూర్తి చేశారు. నటనపై ఉన్న ఆసక్తితో కాలేజీ రోజుల్లోనే ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. సత్యనారాయణలోని టాలెంట్‌ను గుర్తించి ప్రముఖ నిర్మాత డీఎల్‌ నారాయణ ‘సిపాయి కూతురు’లో అవకాశం ఇచ్చారు. అలా వెండితెర అరంగేట్రం చేశారు. ఆ తర్వాత వరుస చిత్రాలతో వెండితెరపై మరింతగా మెరిసారు.


పౌరాణికం, జానపదం, కమర్షియల్‌.. ఇలా అనేక జోనర్లో నటించారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబుతో పాటు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌ తదితరుల చిత్రాల్లోనూ కీలక పాత్రల్లో సత్యనారాయణ నటించారు. మొత్తం 777 సినిమాలు. అందులో 28 పౌరాణికాలు. 51 జానపద చిత్రాలు. 9 చారిత్రక సినిమాలు.

దాదాపు 200 మంది దర్శకులతో కలిసి పనిచేశారు. 223 సినిమాలు 100 రోజులు ఆడాయి. 59 సినిమాలు అర్ధశతదినోత్సవాలు జరుపుకున్నాయి. 10 సినిమాలు శతదినోత్సవాలు.. 10 సినిమాలు ఏడాది లేదా అంతకన్నా ఎక్కువ ఆడాయి. ఇదీ కైకాల స్టామినా. ఎనీ డౌట్?

యమధర్మరాజు, దుర్యోధనుడు, ఘటోత్కచుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, భరతుడు, రావణాసురుడి.. ఇలా పౌరాణిక పాత్రలు కైకాలకు అచ్చుగుద్దినట్టు సరిపోయాయి. కృష్ణార్జున యుద్ధం, లవకుశ, నర్తనశాల, పాండవ వనవాసం, శ్రీ కృష్ణ పాండవీయం, శ్రీకృష్ణావతారం, పాపం పసివాడు, మానవుడు దానవుడు, యమగోల, సోగ్గాడు, అడివి రాముడు, దానవీరశూర కర్ణ, కురుక్షేత్రం. డ్రైవర్‌ రాముడు, అగ్నిపర్వతం, విజేత, కొండవీటి దొంగ, కొదమసింహాం, యమలీల, మురారి, అరుంధతి లాంటి కమర్షియల్ చిత్రాల్లో మెప్పించారు. ‘మహర్షి’ ఆయన చివరి సినిమా.

రాజకీయాల్లోనూ రాణించారు కైకాల సత్యనారాయణ. లోక్‌సభ ఎంపీగా సేవలు అందించారు. 87 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. కళామతల్లికి ఆయన చేసిన సేవలు సదా స్మరామి.

Tags

Related News

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

Big Stories

×