Big Stories

Kakani Govardhan Reddy VS Somi Reddy : పాత పగలు.. కొత్త సెగలు

Bangalore Rave Party latest news(Telugu breaking news): నెల్లూరు పొలిటికల్ గ్రౌండ్ లో విమర్శల బౌలింగ్ కొనసాగుతుంది. అధికార, ప్రతిపక్ష నేతలు కౌంటర్లతో బౌర్సర్లు విసురుకుంటున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఆ దూకుడు కొనాగుతూనే ఉంది. బెంగుళూరు రేవ్ పార్టీతో మంత్రి కాకాణి పేరు ఫోకస్ అయి జిల్లా రాజకీయం మరోసారి వేడెక్కింది. మామూలుగానే మంత్రి కాకాణి, మాజీ మంత్రి సోమిరెడ్డిల మధ్య వ్యవహారం పందెం కోడిపుంజుల్లా ఉంటుంది. ప్రస్తుతం రేవ్ పార్టీకి సంబంధించి ఆ ఇద్దరు నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఇప్పుడా మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరింది. బెంగుళూరులో ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే స్టిక్కర్‌తో ఉన్న కారు దొరకడం జిల్లాలో దుమారం రేపుతోంది.

- Advertisement -

బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీ ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతుంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో పెద్ద రచ్చకు కారణమైంది. పోలింగ్ పూర్తై నేతలంతా గెలుపోటముల లెక్కలతో సైలెంట్ అయిన తరుణంలో ఎక్కడో కర్ణాటకలో జరిగిన రేవ్ పార్టీతో సంబంధాలు ఉన్నట్లు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బురద అంటుకోవడం రాజకీయ రగడకు తెరలేపింది. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పదునైన విమర్శలు, ఆరోపణలో కాకాణి గోవర్ధనరెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. దీంతో జిల్లా రాజకీయం హాట్ హాట్‌గా తయారైంది.

- Advertisement -

ఎన్నికలయ్యాక బెట్టింగులపై దృష్టి పెట్టిన బెట్టింగ్ రాయుళ్లు కూడా వాటిని పక్కన పెట్టి రేవ్ పార్టీ గురించి అందులో కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రమేయం గురించి మాట్లాడుకుంటున్నారంటే అది ఎంత హాట్ టాపిక్‌గా మారిందో అర్థం చేసుకోవచ్చు. మంత్రి కాకాణి , మాజీ మంత్రి సోమిరెడ్డిల మధ్య మాటల యుద్ధం ఆ రేంజ్‌లో నడుస్తుంది. బెంగళూరు శివారు ప్రాంతంలో జరిగిన రేవ్ పార్టీకి, కాకాణి గోవర్ధన్ రెడ్డికి సంబంధం ఉందని కాకాణి కనుసన్నల్లోనే అది జరిగిందంటున్నారు సోమిరెడ్డి.. రేవ్ పార్టీలో కాకాణి కారు, పాస్ పోర్ట్ దొరికాయని.. అయినా తనకు నకే సంబంధం లేదని కాకాణి అనడం సరికాదని నేరం చేసినవాడు ఒప్పుకుంటాడా? అంటూ ప్రశ్నిస్తున్నారు

కేంద్రం జోక్యం చేసుకొని కాకాణిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సోమిరెడ్డి డిమాండ్‌ చేశారు. కల్తీ మద్యం, నకిలీ డాక్యుమెంట్స్ కేసుల్లో కాకాణి గోవర్ధన్ రెడ్డి సూత్రధారి అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు రేవ్ పార్టీతో మరింతగా అవినీతి ఊబిలో కూరుకుపోయిన కాకాణిపై జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించారు. నేరాలు చేసి ఎప్పుడు అడ్డంగా దొరికిపోయినా.. తాను చేయలేదని బుకాయించడం కాకాణికి మొదటి నుంచి అలవాటేనని ఘాటుగా విమర్శించారు. కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణలోని 518 మంది ఎమ్మెల్యేలు ఉండగా వారిలో ఎవరి స్టిక్కర్ తోనూ దొరకని కారు ఒక్క కాకాణి గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్‌తో ఉన్న కారు మాత్నమే దొరకడాన్ని అందరూ గమనిస్తున్నారన్నారు.

Also Read: చెవిరెడ్డి కొడుక్కి వెన్నుపోటు.. అందుకే ఆ వేటు?

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేసిన ఆరోపణలకు మంత్రి కాకాణి అదే రేంజ్‌లో కౌంటర్ ఇస్తున్నారు … తనకు సంబంధించిన వాళ్ళు, లేదా పార్టీ నిర్వాహకుడితోనూ తనకు సంబంధం ఉందని నిరూపించగలరా? అని సోమిరెడ్డికి ప్రతి సవాల్ విసిరారు.  తన పేరుతో ఉన్న ఎమ్మెల్యే పాస్ జిరాక్స్ కాపీనీ కారుకు అంటించుకుంటే తన తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. రేవ్ పార్టీతో పాటు రేప్ పార్టీల గురించి సోమిరెడ్డికి బాగా తెలుసునని ఎద్దేవా చేశారు. గతంలో ఎంతో మంది మహిళలను వేధించిన చరిత్ర సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దేనని ఆరోపించారు. సోమిరెడ్డిని ప్రత్యర్థిగా చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉందని ఎద్దేవా చేశారు.

తన పాస్‌పోర్ట్ కూడా నెల్లూరులోని తన ఇంట్లోనే ఉందని వివరణ ఇచ్చుకున్నారు. తన పాస్‌పోర్ట్ రేవ్ పార్టీలో దొరికినట్లు జరుగుతున్న ప్రచారంపై కర్ణాటక డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్లు కాకాణి వెల్లడించారు. గతంలో ఇలాంటి ఆరోపణలు అనేకం చేసి వాటిపై సీపీఐ విచారణ చేయించినా తనకు క్లీన్ చిట్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆధారాలు చూపకుండా బురద చల్లితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మరోసారి సిబిఐ విచారణకు తాను సిద్ధమని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా సిద్ధమా అని సవాల్ విసిరారు.

సోమిరెడ్డి, కాకాణిల మధ్య సుదీర్ఘకాలంగా రాజకీయ వైరం కొనసాగుతుంది.. 1994లో సర్వేపల్లి నుంచి తొలి సారి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు సోమిరెడ్డి.. మొదటి టర్మ్‌లోనే చంద్రబాబు కేబినెట్లో బెర్త దక్కించుకున్నారు. తర్వాత 1999లో సర్వేపల్లి నుంచి రెండో సారి గెలిచి మంత్రి అయి జిల్లాలో తన రాజకీయ పునాదులు పటిష్టం చేసుకున్నారు .. 2004 నుంచి సర్వేపల్లిలో సోమిరెడ్డికి ఎదురుగాలి వీస్తూనే వస్తుంది .. రెండు సార్లు కాంగ్రెస్ నుంచి పోటీచేసిన ఆదాల ప్రభాకరరెడ్డి చేతిలో ఓడిపోయారు. తర్వాత 2014, 19 ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలోకి దిగిన కాకాణి గోవర్ధనరెడ్డి ఆయన్ని ఓడించారు.

ఈ ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి వారిద్దరే తలపడ్డారు. ఆ క్రమంలో వారిద్దరి మధ్య సర్వేపల్లిలో రోజుకో యుద్దం అన్నట్లు తయారైంది పరిస్థితి..  ప్రస్తుతం రేవ్ పార్టీ ఎపిసోడ్‌తో నెల్లూరు జిల్లా రాజకీయం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. పోలింగ్ ముగిసాక ఓటర్ల తీర్పుపై లెక్కలు వేసుకుంటున్న రాజకీయ శ్రేణుల్లో సోమిరెడ్డి, కాకాణిల మధ్య నడుస్తున్న డైలాగ్ వార్ ఆసక్తి రేపుతోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News