Travel bus accident in Kurnool(AP latest news): కర్నూలు జిల్లాలో దారుణమైన రోడ్డు యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, మరో 40 మంది గాయపడ్డారు. మృతులు ఇద్దరు హైదరాబాద్‌కు చెందినవారుగా గుర్తించారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.
అసలు ఎలా జరిగింది. లోతుల్లోకి వెళ్తే.. ప్రైవేటు ట్రావెల్‌కు చెందిన ఓ బస్సు హైదరాబాద్ నుంచి ఆదోనికి వెళ్తోంది. గురువారం తెల్లవారుజామున కోడుమూరు సమీపంలోకి బస్సు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా వెళ్తున్న ట్రావెల్ బస్సు, రోడ్డుపై వాహనాలను ఓవర్ టేక్ చేసే క్రమంలో బోల్తా పడింది.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 40 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. చనిపోయిన ఇద్దరు చిన్నారులు హైదరాబాద్‌కి చెందినవారుగా గుర్తించారు. ఒకరు 13 ఏళ్ల లక్ష్మి కాగా, మరొకరు 8 ఏళ్ల గోవర్థన్. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. అందులో ఒకరిద్దరి పరిస్థితి ఆందోళనగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈలోగా భారీ క్రేన్‌ను తీసుకొచ్చారు. దాని సాయంతో బస్సును పైకి లేపారు. ఆ రూట్లో వెళ్లే వాహనాలకు ఆటంకాలు లేకుండా బస్సును పక్కన పెట్టారు. ఘటన తర్వాత బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన ప్రయాణికుల నుంచి వివరాలు తీసుకుంటున్నారు పోలీసులు.
కోడుమూరు దగ్గర బస్సు బోల్తా. ఇద్దరు చిన్నారులు మృతి
కోడుమూరు సమీపంలో ప్రైవేట్ ట్రావెల్ వోల్వో బస్సు బోల్తా.. ఇద్దరు పిల్లలు మృతి 35 మందికి పైగా ప్రయాణీకులకు తీవ్ర గాయాలు బస్సులోపల చిక్కుకున్న ప్రయాణీకులు కాపాడిన స్థానికులు హైదరాబాద్ నుండి ఆదోనికి వెళ్తుండగా ఘటన..ప్రమాదానికి… pic.twitter.com/zrB61OMK37
— BIG TV Breaking News (@bigtvtelugu) May 23, 2024