BigTV English

Shock to Manjummel Boys: ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ యూనిట్‌కు షాక్.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ నోటీసులు

Shock to Manjummel Boys: ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ యూనిట్‌కు షాక్.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ నోటీసులు

Music Director Ilayaraja Sent Notice to Manjummel Boys Movie Unit: మలయాళ మూవీ ‘మంజుమ్మల్ బాయ్స్’. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా ఈ సినిమా పేరే వినిపిస్తోంది. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, షేర్ చాట్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్‌లలో ఈ మూవీకి సంబంధించిన వీడియోలే వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఈ మూవీ రిలీజ్ తర్వాత గుణ కేవ్స్‌ను చూసేందుకు వెళ్లినవారి సంఖ్య ఎక్కువైంది. అయితే మరి అక్కడికి వెళ్లి సైలెంట్‌గా ఉంటారా అంటే అదీ లేకపోలేదు.. ‘సుభాసు.. సుభాసు’ అంటూ అరుపులు కేకలతో వీడియోలు చేస్తూ పోస్టులు పెడుతున్నారు. అంతటి క్రేజ్ ఏర్పడింది ఈ మూవీపై.


ఈ ఏడాది విడుదలైన అన్ని మలయాళ మూవీల్లోకెళ్ల అత్యంత భారీ హిట్‌ను సొంతం చేసుకుంది మంజుమ్మల్ బాయ్స్. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎవరూ ఊహించని బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకుంది. ఒక చిన్న సినిమాగా.. దీన్ని ఎవరు చూస్తారులే అనేంత సాధారణ మూవీగా రిలీజ్ అయింది. ఇక రిలీజ్ అయ్యాక మూవీకి వచ్చిన రెస్పాన్స్‌తో థియేటర్ దద్దరిల్లిపోయింది.

బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు మామూలుగా రాలేదు. అందరినీ ఆశ్చర్యపరచే విధంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి నిర్మాతల పంట పండించింది. ఇక మలయాళ సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ సినిమా.. తెలుగు కూడా రిలీజ్.. తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా సూపర్ డూపర్ రెస్పాన్స్ రాబట్టింది. తెలుగులో కూడా మంచి కలెక్షన్లను అందుకున్న ఈ సినిమా ఇటీవలే ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చింది.


Also Read: మరో వివాదంలో మలయాళ హిట్ సినిమా.. చీటింగ్ కేసు నమోదు!

ఓటీటీలో కూడా ఈ మూవీని ఎంతో మంది ప్రేక్షకులు వీక్షించారు. ఓటీటీలో కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్‌తో అదరగొట్టేసింది. ఇలా థియేటర్, ఓటీటీలో తనదైన శైలిలో అద్భుతమైన టాక్‌తో దూసుకుపోతున్న ఈ మూవీ యూనిట్‌కి తాజాగా ఊహించని షాక్ తగిలింది. ఓ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమా చిత్రబృందానికి నోటీసులు పంపించారు.

ఇంతకీ ఏమైంది.. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు.. ఎందుకు నోటీసులు పంపించారు అనే విషయానికొస్తే.. ఈ మూవీకి ముందు గతంలో కమల్ హాసన్ హీరోగా ‘గుణ’ పేరుతో ఓ మూవీ వచ్చింది. ఈ మూవీలో కన్మణి అన్బోడు పాటను ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయారాజా కంపోజ్ చేశాడు. అయితే ఇప్పుడు ఆ పాటను మంజుమ్మల్ బాయ్స్ మూవీలో తమ అనుమతి లేకుండా వాడుకున్నందుకు మూవీ నిర్మాణ సంస్థకు ఇళయారాజా తరపు లాయర్ నోటీసులు పంపించారు.

Also Read: Actress Kavitha: పెళ్లి తరువాత ఆ కండీషన్ పెట్టా.. పిల్లలు పుట్టి చనిపోవడం.. ఎమోషనల్ అయిన కవిత

తాను కంపోజ్ చేసిన పాటను తమ అనుమతి లేకుండా మంజుమ్మల్ బాయ్స్ మూవీలో వాడుకున్నందుకు ఈ నోటీసులు పంపించారు. ఈ మేరకు కాపీరైట్ చట్టం ప్రకారం.. ఈ సాంగ్‌కు సంబంధించిన హక్కులు ఇళయారాజాకు చెందినవని.. తమ సినిమాలో ఈ సాంగ్‌ను ఉపయోగించాలంటే ఆ హక్కులు పొందిన వ్యక్తికి కొంత మొత్తాన్ని చెల్లించాలని ఆ నోటీసులో తెలిపారు. అలా కాదంటే కాపీరైట్ ఉల్లంఘించినట్లు భావించి చట్టపరంగా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో చాలా మంది రకరకాలు స్పందిస్తున్నారు.

Tags

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Big Stories

×