E-Paper
Advertisement

Urban Bank Elections: ఢిల్లీలో నిప్పు.. గల్లీలో భాయీ భాయీ..

Urban Bank Elections: ఢిల్లీలో నిప్పు.. గల్లీలో భాయీ భాయీ..

Urban Bank Elections:  కాంగ్రెస్, బీజేపీ ఒకటేని బీఆర్ఎస్ ఆరోపించడం… బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని కాంగ్రెస్ ఆరోపించడం.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటేనని బీజేపీ ఆరోపించడం ఇలా మనం రోజూ ఈ ఆరోపణల పర్వాన్ని విని విని బోరై పోతున్నాం. గదా….అయితే, ఏకంగా ఇప్పుడు కాంగ్రెస్ నేతల విజయం వెనుక… తామే ఉన్నామని బీజేపీ కుండబద్ధలు కొట్టడమే కరీంనగర్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఏంటా విజయం.. లెట్స్ వాచ్ దిస్ స్టోరీ.

12 సీట్ల ఆటలో కాంగ్రెస్ సెల్ఫ్ గోల్

ఢిల్లీ లెవల్లో ఉప్పునిప్పులా పూర్తిగా భిన్న సిద్ధాంతాలతో కొట్టుకునే బీజేపీ, కాంగ్రెస్.. గల్లీ కొచ్చే సరికి భాయి భాయీ అంటున్నాయి. కరీంగనర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలే ఇప్పుడు అందుకు వేదికగా మారింది. అర్బన్ బ్యాంక్‌లో జరిగిన 12 సీట్ల ఆటలో.. కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ వేసుకుందట. తనను తాను మూడు ముక్కలుగా నరికేసుకుని, ప్రతిపక్షానికి రెడ్ కార్పెట్ వేసిందట. అధికారంలో ఉండి కూడా ఇంత దారుణమైన ఫెయిల్యూర్ ను ప్రదర్శించడం ఎలాగో ఈ ఎన్నికలు చూపించాయంటున్నారు.

రాజశేఖర్‌ ప్యానెల్‌ నుంచి 9 మంది డైరెక్టర్లు

కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు గతంలో ఎన్నడూలేనివిధంగా జరిగాయి. అధికారంలో ఉండి కూడా తనలో తాను చీలిపోయింది కాంగ్రెస్ పార్టీ. తాను చీలిపోతూ కూడా.. ప్రత్యర్థికి బంగారు బాట వేసింది. అందుకే కాంగ్రెస్ అసమర్థతకు… ఈ ఎన్నికలు సజీవ సాక్ష్యంగా చెబుతున్నారు. 12 డైరెక్టర్ స్థానాల కోసం జరిగిన ఈ యుద్ధంలో… కాంగ్రెస్ మూడు ముక్కలుగా చీలిపోయింది. ఈ ఎన్నికల్లో మూడు ప్యానల్స్ పోటీ పడ్డాయి. ఒకటి కర్ర రాజశేఖర్ ప్యానెల్ కాగా.. మరొకటి అర్బన్ బ్యాంక్ తాజా మాజీ చైర్మన్ గా పనిచేసిన గడ్డం విలాస్ రెడ్డి ప్యానెల్ తో పాటు.. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలైన వెలిచాల రాజేందర్ రావు ప్యానెల్.. ఈ మూడు ప్యానెల్స్ ఢీ అంటే ఢీ అన్నాయి. వెలిచాల వర్గం పెద్దఎత్తున ప్రచారం కూడా చేసింది. అయితే, ఆ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో ఫలితాలు ప్రచారానికి భిన్నంగా వచ్చాయి. కర్ర రాజశేఖర్ ప్యానెల్ లో 9 మంది డైరెక్టర్స్ గా గెలిచారు.

అందులో ఏడుగురు కాంగ్రెస్ కార్యకర్తలు కాగా.. ఇద్దరు బీజేపీ నాయకులు. ఇక మరో ముగ్గురు డైరెక్టర్లలో ఒకరు ప్రో బీజేపీ నాయకుడైన ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి గెలవగా… మరో ఇద్దరు వెలిచాల రాజేందర్ రావు వర్గీయులు డైరెక్టర్లుగా గెలిచారు. తనకంటే ముందు అర్బన్ బ్యాంక్ చైర్మన్ గా పనిచేసిన కర్ర రాజశేఖర్ ప్యానెల్ పై అవినీతి ఆరోపణలు చేసి కోర్టు మెట్లెక్కిన గడ్డం విలాస్ రెడ్డి ప్యానెల్ అసలు ఒక్క డైరెక్టర్ స్థానాన్ని కూడా గెల్చుకోలేకపోయింది.

రాజశేఖర్ వర్గానికి బండి సంజయ్‌ అభినందనలు

ఇదిలా ఉంటే కర్ర రాజశేఖర్ ప్యానెల్ మొత్తం 9 మందిలో ఏడుగురు కాంగ్రెస్ నేతలు కాగా, ఇద్దరు బీజేపీ నేతలున్నారు. అయితే, కర్ర రాజశేఖర్ ప్యానెల్ గెలుపు తర్వాత కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి రావాల్సిన అభినందనలు.. బీజేపీ నేతల నుంచి రావడమే ఇప్పుడు ఈ మొత్తం చర్చకు కారణం అయ్యింది. కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో గెల్చిన కర్ర రాజశేఖర్ వర్గానికి అభినందనలంటూ ఏకంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో… ఈ చర్చకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

కర్ర రాజశేఖర్ అండ్ టీంలో ఏడుగురు కాంగ్రెస్ నాయకులు డైరెక్టర్లుగా గెలిస్తే.. దాన్ని బీజేపీ కేంద్ర మంత్రి ఓన్ చేసుకున్నారు. అంతేకాదు బండిసంజయ్ ఈ ఎన్నికలకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ కర్ర రాజశేఖర్ ప్యానెల్ కు పూర్తి సయహా సహకారమందించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కర్ర రాజశేఖర్ మరోసారి చైర్మన్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉండగా.. ఆ కాంగ్రెస్ నాయకులందరినీ ఈ అర్బన్ బ్యాంక్ ఎన్నిక తర్వాత బీజేపీలోకి ఆహ్వానించి, కాషాయ కండువాలు కప్పి అఫిషీయల్ బీజేపి నేతలుగా మార్చే తంతు ఇక తర్వాత ఉండనుంది. ఈ క్రమంలో.. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ కొట్టుకుంటూ… మంత్రుల నుంచి స్థానిక నాయకుల వరకూ గిల్లికజ్జాలు పెట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీ తనకు తానే భస్మాసుర హస్తాన్ని తయారుచేసుకుంటోందన్న వాదన వినిపిస్తోంది. అందుకు ఈ అర్బన్ బ్యాంక్ ఫలితాలనే ఓ ఉదాహరణగా జిల్లాలో చర్చించుకుంటున్నారు.

ఒకే ప్యానెల్ బరిలోకి దించితే సరిపోయేది

కాంగ్రెస్ పార్టీ నాయకులు సమష్టిగా ఒకే ప్యానెల్‌ను బరిలోకి దించడంలో పూర్తిగా విఫలమయ్యారు. పార్టీలోని వర్గాలు మూడు ప్యానెళ్లుగా చీలిపోయి పోటీ పడ్డాయి. ఒకే ప్యానెల్‌ కింద పోటీచేసి ఉంటే విజయం వేరేలా ఉండేది. అంతే కాదు అర్బన్ బ్యాంక్ ఎన్నికలను కాంగ్రెస్ హైకమాండ్ లేదా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు సీరియస్‌గా తీసుకోలేదట. అందుకే ఎవరికి వాళ్లు ప్యానెళ్లు ఏర్పాటుచేసుకున్నారు. తమలో తామే కొట్టుకుని, ప్రత్యర్థికి ఎర్ర తివాచీ పరిచింది హస్తం పార్టీ. గెలిస్తే బీజేపీకి క్రెడిట్, ఓడితే కాంగ్రెస్‌కు డ్యామేజ్. ఇది కరీంనగర్‌ అర్బన్‌ బ్యాంకు ఎన్నికల సమ్మరీ అని చెప్పొచ్చు. బలమైన ప్రత్యర్థితో పోరాటం చేయడం సిసలైన పోటీ. కానీ, తమలో తామే కొట్లాడుకుని.. ప్రత్యర్థికి పోటీ లేకుండా చేయడం చేతగానితనం, ఐకమత్య లోపం. ఇవన్నీ హస్తం పార్టీ జిల్లాలో పెంచి పోషిస్తూ.. తమ పార్టీ నుంచి గెలిచిన డైరెక్టర్లను కూడా ఓన్ చేసుకోలేకపోయింది. ఆ పోటీలోనూ మూడుముక్కలాటకు తెరతీసి… ప్రత్యర్థి పార్టీ అయిన బీజేపీకి ఆ క్రెడిట్ ను హస్తగతం చేయడం ఇప్పుడు పెద్ద చర్చకు తెరతీసింది.

Story by Venkatesh,  Big Tv

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×