Kavitha vs BRS: తెలంగాణ రాష్ట్ర సమితి నుండి ఎమ్మెల్సీ సస్పెండ్ అయ్యాక బీఆర్ఎస్ నేతలపై కవిత పర్సనల్ ఎటాక్ స్టార్ట్ చేశారు. అప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు అభివృద్ధి జరిగిన సందర్భంలో ప్రాజెక్టుల విషయాల్లో ఆయా మంత్రులను ఉద్దేశించి బాగానే పని చేశారని చెప్పుకొచ్చిన ఆమె ఇప్పుడు ఎందుకు మాజీలను టార్గెట్ చేస్తున్నారు? దాంతో అప్పుడు మంచి అనిపించుకున్న వారు ఇప్పుడు చెడు ఎందుకు అవుతున్నారంటూ టిఆర్ఎస్ నేతలు కవితపై పర్సనల్ అటాచ్ చేస్తున్నారు. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ వర్సెస్ జాగృతి అన్నట్లు ఫైట్ నడుస్తోంది. జాగృతి జనంబాటలో భాగంగా అప్పటి మంత్రులు, మాజీ, తాజా ఎమ్మెల్యేల అవినీతిపై నేరుగా టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నా . ఆ క్రమంలో అసలేం జరుగుతుందో అంతుపట్టక గులాబీశ్రేణుల్లో టెన్షన్ పెరిగిపోతుందంట .
ఇటీవల జాగృతి జనంబాటలో భాగంగా కామారెడ్డికి వచ్చిన ఎమ్మెల్సీ కవిత కాలేశ్వరంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ద్వారా కామారెడ్డిలో ఒక్క ఎకారానికి కూడా నీళ్లు రాలేదని, ఈ విషయం చెబితే బీఆర్ఎస్ వాళ్లు తనపై నోరు వేసుకొని పడిపోతారంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. కామారెడ్డిలో జాగృతి జనంబాటలో భాగంగా కవిత మాట్లాడుతూ.. తమ కుటుంబం ఉద్యమం, రాజకీయం అనే కమిట్ మెంట్ ఉన్న కుటుంబం అని, ప్రజలను, కుటుంబాన్ని వేర్వేరుగా చూసే పరిస్థితి లేదని, అయితే కుటుంబం నుంచి దూరం చేసే కుట్రలో సస్పెండ్ చేయించారని ఆమె బాధ వ్యక్తం చేశారు సస్పెండ్ చేయించిన వారు శునకానందం పొందవచ్చని, కానీ తాను మరో కుటుంబం అనుకునే తెలంగాణ కోసం పనిచేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.
తాను జైల్లో ఉన్నప్పుడు తన పిల్లల కన్నా కూడా మా అమ్మ ఆరోగ్యం గురించే ఎక్కువ బాధపడ్డానని, తెలంగాణ అనే మరో కుటుంబం తనకు ఉందని, వారి కోసం ధైర్యంగా పనిచేస్తానని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు కాలేశ్వరం పై చేసిన వ్యాఖ్యలకి బిఆర్ఎస్ నేతలు కవితపై పర్సనల్ అటాక్ చేస్తున్నారు. దీంతో జాగృతి నాయకులు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పై అవినీతి జరిగిందని మాట్లాడిన మాటలకు ప్రశాంత్ రెడ్డి అనుచర వర్గం కవితపై పర్సనల్ అటాక్ చేస్తూ మాటల తూటాలు పేల్చారు.
జనం బాట కార్యక్రమం ద్వారా బీఆర్ ఎస్పథకాల్లో, ప్రాజెక్టుల్లో కవిత పదే, పదే అప్పటి మాజీ మంత్రులు చేసిన అవినీతి పై ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉంది అంటున్నారు ఇటు బీఆర్ఎస్ పై జాగృతి నేతలు సైతం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇక జిల్లాల్లో బీఆర్ఎస్ వర్సెస్ జాగృతి మధ్య కొనసాగుతున్న వార్ ఎక్కడికి దారి తీసిందో వేచి చూడాలి.
Story by Kishan, Big Tv