BigTV English

KCR Master Plan: ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌ను సాగనంపేందుకే.. గులాబీ బాస్ కొత్త స్కెచ్

KCR Master Plan: ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌ను సాగనంపేందుకే.. గులాబీ బాస్ కొత్త  స్కెచ్

సిర్పూర్ టీ బీఆర్ఎస్ ఇన్చార్జ్ పదవి కోసం పోటాపోటీ

కొమురం భీమ్ జిల్లా సిర్పూర్ టీ నియోజకవర్గం ఇన్చార్జ్ పదవి కోసం గులాబీ పార్టీలో మళ్లీ యుద్దం మొదలైంది. ఈ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తిరిగి బీఅర్‌ఎస్ వైపు చూస్తుండటంతో అక్కడ రాజకీయం రసకందాయంలో పడింది .. కాంగ్రెస్‌తో తన రాజకీయ జీవితం ప్రారంభించిన కోనప్ప 2004లో కాంగ్రెస్ పార్టీ తరపున సిర్పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచార. 2009 ఎన్నికలతో పాటు 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో పరాజయం పాలైన ఆయన తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు.


2014లో బీఎస్పీ టికెట్‌తో గెలిచి టీఆర్ఎస్ లో చేరిక

రాష్ట్ర విభజన సమయంలో కోనప్ప కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీఎస్పీలో చేరారు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీ టికెట్ పై పోటీ చేసి రెండు సార్లు తనను ఓడించిన కావేటి సమ్మయ్యపై విజయం సాధించారు. గెలిచాక గులాబీ కండువా కప్పుకున్న ఆయన 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికలలో టీఆర్ఎస్ టికెట్ పై పోటీచేసి సిర్పూర్ నుంచి మూడో సారి విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కోనప్ప తిరిగి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి హరీష్ బాబు చేతిలో పరాజయం పాలయ్యారు.

లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకున్న బీఆర్ఎస్

2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుని అప్పట్లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు ప్రాధాన్యత ఇవ్వడం రుచించని కోనప్ప కారు పార్టీకి గుడ్ బై చెప్పి హస్తం నీడకు చేరారు. అయితే కాంగ్రెస్‌లో తనకు సరైన ప్రాధాన్యత లభించడం లేదన్న అసంతృప్తితో ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తిరిగి కారు ఎక్కడానికి రెడీ అయిన ఆయన ఇటీవల ఫాంహౌస్‌కు కేసీఆర్‌ను కలిసి వచ్చారంట. ఆ సందర్భంగా కేసీఆర్ పార్టీలోకి తిరిగి రావాలని కోనప్పను ఆహ్వనించారని తెలిసింది. అయితే బీఆర్ఎస్ బాస్ కోనప్పకి ఒక షరతు పెట్టారని ప్రచారం జరుగుతోంది.

స్థానికి సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని షరతు

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో సిర్పూర్ టీ నియోజకవర్గంలో సత్తాచాటాలని పెట్టిన షరతుని కోనప్ప కూడా సవాలుగా తీసుకున్నారంట. అయితే కోనప్ప రాకను మాజీ ఐపీఎస్ అధికారి అర్ఎస్ ప్రవీణ్‌కుమార్ వ్యతిరేకిస్తున్నారని చెప్తున్నారు. ప్రస్తుతం సిర్పూర్ నియోజకవర్గం లో అర్ఎస్ ప్రవీణ్‌కుమార్ బీఆర్ఎస్ ఇన్చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ప్రవీణ్‌కుమార్ సిర్పూర్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారంట. అందుకే కోనప్ప రాకను అర్ఎస్పీ తీవ్రంగా వ్యతరేకిస్తున్నారంట.

కేటీఆర్‌ను కలిసి అభ్యర్ధించిన ప్రవీణ్ కుమార్

ఆ మాజీ ఐపీఎస్ అధికారి తన అనుచరగణంతో హైదారాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు కేటిఅర్‌తో భేటీ అయ్యారంట. కోనప్పను పార్టీలోకి తీసుకోవద్దని కేటీఅర్ ను అభ్యర్ధించినట్లు చెప్తున్నారు .. అయితే కేటీఆర్‌ కూడా ఆయనకు అదే టాస్క్ పెట్టారంట. స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చాటండి‌. మెజారిటీ సీట్లు సాధించుకు రమ్మని ఆర్ఎస్పీకి టార్గెట్ ఇచ్చారంట.లోకల్‌బాడీ ఎలక్షన్స్‌లో సత్తా చాటుకుంటే ఎవరినీ పార్టీలోకి తీసుకోబోమని కేటీఆర్ ఆయనకు హామీ ఇచ్చినట్లు ఆర్ఎస్పీ వర్గీయులు చెప్పుకుంటున్నారు.

ప్రవీణ్, కోనప్పలకి విషమ పరీక్షగా మారిన స్థానిక ఎన్నికలు

Also Read: నీకోసం రూల్స్ మార్చాలా? బండి వర్సెస్ రాజా సింగ్.. బీజేపీలో కొత్త లొల్లి

కోనప్ప చేరికను ప్రవీణ్‌కుమార్ వ్యతిరేకిస్తుండటంతో కేసీఆర్ కూడా కోనప్పను స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చాటుకుంటే పార్టీలోకి తీసుకుంటామని చెప్పారంట… ఆ క్రమంలో అటు ప్రవీణ్‌కుమార్‌కి, ఇటు కోనేరు కోనప్పకి స్థానిక సంస్థల ఎన్నికలు విషమ పరీక్షగా మారాయంటున్నారు. ఆ పరీక్షలో సత్తాచాటడానికి కోనప్ప సిద్దమవుతున్నారు. అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరా.. కాని అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని.‌ స్థానిక సంస్థల ఎన్నికలలో తన వాళ్లు స్వతంత్రంగా పోటీ చేస్తారని చెప్తున్నారు. అందులో భాగంగానే ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఎన్నికల తర్వాత పార్టీ మార్పుపై ప్రజలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామంటున్నారు.

ఆర్ఎస్పీకి పొమ్మన లేక పొగపెడుతున్నారా?

కేటీఅర్ పెట్టిన టార్గెట్‌తో అర్ఎస్పీ సైతం స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. మెజారిటీ సీట్లు సాధించి సత్తాచాడటానికి కసరత్తు మొదలు పెట్టారు. కోనప్ప వర్గం అర్ఎస్పీ కన్నా ఎక్కువ సీట్లు సాధిస్తే కోనప్పకు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ ఖాయమైనట్లే అంటున్నారు.. ఒకవేళ కోనప్ప కంటే అర్ఎస్పీ మంచి మెజారిటీ సీట్లు సాధిస్తే ఆయనే ఎమ్మెల్యేగా బరిలో ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ సందర్భంగా పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సిర్పూర్‌ నుంచి ఆర్ఎస్పీ తనంతట తాను వెళ్లేలా చేయడానికే గులాబీబాస్ ఈ పరీక్ష పెట్టారంట. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో కోనప్ప, ఆర్ఎస్పీ ఇద్దరు బోల్తా పడితే అప్పుడు కారు పార్టీ పరస్థితి ఏంటో చూడాలి.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×