OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ ఎంటర్టైన్మెంట్ కి వేదికగా మారిపోయింది. వీటిలో కొన్ని కథలు ఎంటర్టైన్మెంట్ తో పాటు, మంచి మెసేజ్ ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో డబ్బుల కోసం కూతుర్లను, ఒక తండ్రి వేరే వాళ్ళకు అమ్ముకుంటాడు. ఆ తర్వాత వాళ్ళ జీవితం చాలా దారుణంగా తయ్యారవుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
రెండు ఓటిటిలలో
ఈ మూవీ పేరు ‘లవ్ సోనియా’ (Love Sonia). 2018 లో విడుదలైన ఈ హిందీ డ్రామా మూవీకి తబ్రేజ్ నూరానీ దర్శకత్వం వహించారు. దీనిని డేవిడ్ వోమార్క్ నిర్మించారు. ఇందులో రియా సిసోడియా, ఫ్రీదా పింటో, డెమీ మూర్, మనోజ్ బాజ్‌పేయి, రిచా చద్దా, అనుపమ్ ఖేర్, ఆదిల్ హుస్సేన్, రాజ్‌కుమార్ రావ్, సాయి తమ్‌హంకర్‌లతో పాటు టైటిల్ క్యారెక్టర్‌లో మృణాల్ ఠాకూర్ నటించారు. లవ్ సోనియా 21 జూన్ 2018న లండన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో వరల్డ్ ప్రీమియర్ ప్రదర్శించబడింది. ఈ మూవీ భారతదేశంలో 14 సెప్టెంబర్ 2018న థియేటర్‌లలో విడుదలైంది. జియో హాట్ స్టార్ (Jio hotstar), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
ఒక మారుమూల పల్లెటూరులో మల్లేష్ అనే వ్యక్తి వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు. ఇతనికి వయసుకు వచ్చిన ఇద్దరు కూతుర్లు కూడా ఉంటారు. వీళ్ళిద్దరూ హై స్కూల్ చదువుకుంటూ ఉంటారు. వ్యవసాయంలో సోనియా తండ్రికి బాగా సాయం చేస్తూ ఉంటుంది. ప్రీతి మాత్రం అంతగా పని చేయకపోవడంతో, తనపై కోప్పడుతూ ఉంటాడు మల్లేశం. అదే ఊర్లో ఉండే అమర్, సోనీయాను ప్రేమిస్తూ ఉంటాడు. ఒకసారి చాలా రోజులు వర్షాలు పడకపోవడంతో, మల్లేశంకి కష్టాలు ఎదురవుతాయి. అతని బలహీనతను క్యాష్ చేసుకోవాలనుకుంటాడు ఠాగూర్ అనే వ్యక్తి. అలా డబ్బు ఆశ చూపించి పెద్ద కూతురు ప్రీతిని అమ్మే విధంగా చేస్తాడు. ఆమెను తీసుకువెళ్లి ముంబైలోని రెడ్ లైట్ ఏరియా కి అమ్మేస్తాడు. అక్క దూరం అవడంతో, చెల్లి సోనియా చాలా బాధపడుతూ ఉంటుంది. తనని వెతుక్కుంటూ ఆమె ముంబైకి వస్తుంది.
అక్కడ తనకు భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఆ ఏరియాలో ఒక వ్యక్తి సోనియాను బాగా టార్చర్ చేస్తాడు. తనను బాగా భయపెట్టి కస్టమర్ల దగ్గరకు పంపిస్తాడు. లేకపోతే మీ అక్కను వెతికి చంపేస్తానని భయపెడతాడు. చేసేదేంలేక తను కూడా అదే పనిలో దిగాల్సి వస్తుంది. ఆ తర్వాత సోనియాను విదేశాలకు అమ్మేస్తారు. అక్కడ తనని బాగా దారుణంగా ఇబ్బందులకు గురి చేస్తారు. సోనియా తన అక్కని కలుస్తుందా? అమర్ సోనియాని వెతుక్కుంటూ వస్తాడా? మల్లేశం తను చేసిన తప్పుని తెలుసుకుంటాడా? లాంటి విషయాలను తెలుసుకోవాలంటే సినిమాను జియో హాట్ స్టార్ (Jio hotstar), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘లవ్ సోనియా’ (Love Sonia) అనే ఈ మూవీని చూడాల్సిందే.