Tollywood Movies : ఈ ఏడాది జనవరి సంక్రాంతి సినిమాల సందడి బాగానే ఉంది. బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోలు పోటీ పడ్డారు. రిలీజ్ అయిన ప్రతి మూవీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. అంతేకాదు భారీ విషయాన్ని అందుకోవడంతో పాటు కలెక్షన్స్ కూడా భారీగానే వసూలు చేశాయి. దానితో సంక్రాంతి సినిమాల సందడి ఓ రేంజ్ లో ఉందనే చెప్పాలి. సంక్రాంతి సందర్భంగా చివరగా రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ మాత్రం ఇప్పటికీ అదే జోరులో కొనసాగుతుంది. ఓడిటిలో రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతున్న కూడా కలెక్షన్స్ మాత్రం ఇంకా తగ్గలేదని చెప్పాలి. ఇక జనవరి సందడి ముగియగానే ఫిబ్రవరి సందడి మొదలైంది. ‘తండేల్’ లాంటి హిట్ పడింది. మరో రెండు వారాలు మిగిలే ఉన్నాయి. ఈ రెండు వారాల్లోనూ ఆసక్తికరమైన సినిమాలే వస్తున్నాయి.. మరి ఆలస్యం ఎందుకు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు ఏంటో ఒకసారి చూసేద్దాం..
గత వారం విడుదలైన ‘లైలా’ బాగా నిరాశ పరిచింది. ఈవారం ఓ నాలుగు చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. నాలుగూ భిన్నమైన కథలే. రెండు కథలు వినోదాత్మక చిత్రాలైతే, మరో రెండు ‘నాన్న’ కు కనెక్ట్ అయ్యే స్టోరీలే కావడంతో ప్రేక్షకుల ఆసక్తి కూడా కాస్త ఎక్కువగానే ఉంది..
లవ్ టుడే మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రదీప్ రంగనాథన్ హీరోగా మరో సినిమా రాబోతుంది. రిటర్న్స్ అఫ్ ది డ్రాగన్ అనే టైటిల్ తో ఆ సినిమా రాబోతుంది. ప్రదీప్ లో ధనుష్ లుక్స్ కనిపించాయి. దాంతో… ఈజీగా ఆ పాత్రని ఓన్ చేసుకోగలిగారు తెలుగు అభిమానులు.. ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటించింది. ట్రైలర్ లో యూత్ ఫుల్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. ఈ సినిమా ఇప్పటివరకు పాజిటివ్ టాక్నే అందుకుంది అందులో అనుపమ ఉండడంతో ఈ సినిమాకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది అది థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత టాక్ ఎలా ఉంటుందో చూడాలి.
Also Read : పోలీసుల అదుపులోకి మంచు మనోజ్.. అసలేం జరిగింది..?
ధనుష్ దర్శక నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’. ఇది కూడా హాస్యభరిత చిత్రమే. పవీష్, ప్రియా ప్రకాష్ వారియర్ నటించారు.. ఈ చిత్ర ట్రైలరే ఈ సినిమాకు ప్లస్సు ఎలా కనిపిస్తుంది. టైటిల్ క్యాచీగా ఉండడంతో సినిమా కూడా అదే విధంగా ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు . ఇప్పటివరకైతే ట్రైలర్ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి..
టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ బాపు.. టైటిల్ కి తగ్గట్లే ఈ సినిమాలో బ్రహ్మాజీ తన తండ్రి మాటను జవదాటకుండా ఉంటాడు. అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా పారితోషికం తీసుకోకుండా చేశానంటూ… బ్రహ్మాజీ మంచి బూస్టప్ ఇచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే బలగం సినిమా లాగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతున్నాయి.
జబర్దస్త్ కమెడియన్ ధన్‌రాజ్ దర్శకత్వం వహించిన ‘రామం రాఘవం’ కూడా ఈవారమే విడుదల అవుతోంది. సముద్రఖని, ధన్‌రాజ్ తండ్రీ కొడుకులుగా నటించారు. తండ్రంటే ఏమాత్రం ప్రేమ, గౌవరం లేని కొడుకు కథ ఇది.. ధనరాజు గతంలో కొన్ని సినిమాలు తెరకెక్కించారు ఆ సినిమాలో పర్వాలేదనిపిచ్చాయి మరి ఈ సినిమా ఎలాంటి టాకింగ్ అందుకుంటుందో చూడాలి…