BigTV English

KCR Master Plan: కేసీఆర్ వ్యూహమా? వ్యూహాత్మక తప్పిదమా?

KCR Master Plan: కేసీఆర్ వ్యూహమా? వ్యూహాత్మక తప్పిదమా?

KCR Master Plan: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికే బీఆర్ఎస్ సాహసించలేదు. కరీంనగర్‌, నిజామాబాద్‌, మెదక్‌, ఆదిలాబాద్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కూడా గులాబీ పార్టీ బరిలోకి దిగలేదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంతో పాటు ఒక టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ సత్తా చాటుకుంది. దాంతో రాజకీయవర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ శకం ముగిసినట్లే అని.. పొలిటికల్ రేసులో నుంచి గులాబీ పార్టీ ఎలిమినేట్ అయిపోయినట్లే అన్న టాక్ వినిపిస్తుంది.


ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ఓటములు ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా జరుగుతాయి. కానీ, ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో రాజకీయ పార్టీల ఎలిమినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయ్యిందంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు దానికి మొదటి అడుగుగా చెప్తున్నారు. తెలంగాణ రాజకీయ అవని పై ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు సరికొత్త రాజకీయ సమీకరణాలు ఆవిష్కరించాయి. పొలిటికల్ రేసులో నుంచి నెమ్మదిగా బీఆర్ఎస్ ఎలిమినేట్ అవుతుంటే.. బీజేపీ అంతలా ఎలివేట్ అవుతోంది. ఇది భవిష్యత్ తెలంగాణ రాజకీయాలకు సంకేతంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

యుద్ధం చేయకుండానే చేతులెత్తేసినట్లు.. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ వ్యవహరించింది. ఆ లొంగుబాటు బీజేపీకా? లేక వ్యూహాత్మకమా? అన్న చర్చ జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి పరోక్షంగా సహకరించినట్లు విమర్శలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పెద్దలు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కమలనాథులకు దాసోహం అన్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. వాస్తవానికి రాజకీయాలు పాత రోజుల్లా లేవు.. నిత్యం రేసులో ఉండాల్సిందే. లేదంటే గేమ్ నుండి ఔట్ అయ్యే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి.


ఈ పరిస్థితులను కేసీఆర్ అంచనా వేయలేకపోతున్నారా? లేక బీజేపీ కోసం తన లెక్కలు మార్చుకుంటున్నారా? అన్నది అంతుపట్టడం లేదు. వాస్తవానికి బీఆర్ఎస్ నుండి 10 మంది ఎమ్మెల్యేలు పోయినా ఇప్పటికీ దానికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా కేడర్, లీడర్లు ఉన్నారు. ఆర్థికంగా కూడా ఆ పార్టీ అందరికంటే బలంగా ఉంది. ఐనా కేసీఆర్ ఎమ్మెల్సీ రేసు నుండి తప్పుకోవడం అందరినీ ఆశ్చర్య పరిచింది.

Also Read: ఎమ్మెల్యే కోటా.. ఎమ్మెల్సీ సీట్లు.. 4 వీళ్లకు..1 వాళ్లకు

మనం తప్పుకోవడం వ్యూహాత్మక తప్పిదం అవుతుంది. మనం తప్పు కుంటే ఆ స్థానాన్ని బీజేపీ ఆక్రమిస్తుంది. అది పార్టీ ఉనికికి చాలా ప్రమాదమని హరీష్ రావు లాంటి నేతలు కేసీఆర్ కు చెప్పినా ఆయన పెడచెవిన పెట్టారంట. ఈ నేపథ్యంలో అధికారంలో ఉండి కాంగ్రెస్ ఓడటం, నిన్నటి దాకా అధికారంలో ఉండి ఎన్నికల బరి నుండి బీఆర్ఎస్ ముందే ఔట్ కావడం తెలంగాణ రాజకీయాలను కీలక మలుపు తిప్పే పరిణామాలుగా కనిపిస్తున్నాయి. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడం కేసీఆర్ వ్యూహమో? వ్యూహాత్మక తప్పిదమో? కాని తెలంగాణ రాజకీయ ముఖచిత్రం నుండి బీఆర్ఎస్ ఎలిమినేట్ అయ్యి ఆ స్థానంలో బీజేపీ ఎలివేట్ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×