BigTV English

MLC Posts: ఎమ్మెల్యే కోటా.. ఎమ్మెల్సీ సీట్లు.. 4 వీళ్లకు..1 వాళ్లకు

MLC Posts: ఎమ్మెల్యే కోటా.. ఎమ్మెల్సీ సీట్లు.. 4 వీళ్లకు..1 వాళ్లకు

MLC Posts: తెలంగాణలో ఖాళీ అయిన ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్ కి నాలుగు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ కి ఒకటి లభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎంఐఎంకి ఇస్తారా లేదా వేచి చూడాలి. ఇక కాంగ్రెస్ లో సామాజిక వర్గాల వారీగా ఈ ఎమ్మెల్సీ పోస్టులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెడ్డి సామాజిక వర్గం నుంచి జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి.. బీసీల నుంచి మధు యాష్కీ, చరణ్ కౌశిక్, అంజన్ కుమార్, వజ్రేష్ యాదవ్.. ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి రేసులో సునీతారావు నిలుస్తున్నారు. ఇక కమ్మ సామాజిక వర్గం నుంచి కుసుమ కుమార్.. మైనార్టీల నుంచి ఫహీం ఖురేషీ, అజరుద్దీన్, షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్ రేసులో ఉన్నారు. ఇక ఎస్సీల నుంచి సంపత్ కుమార్, అద్దంకి దయాకర్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి బెల్లయ్య నాయక్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ పోటీ పడుతున్నారు.


ఇదిలా ఉంటే.. మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్నారు. ఇవాళ్టి నుంచి జిల్లా నేతలతో ఆయన సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు రీసెంట్‌గా నోటిఫికేషన్ వచ్చింది. దీంతో ఆయన జిల్లాలవారీగా ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. ఈ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఫైనల్ చేయనున్నారు. బీఆర్ఎస్‌కు ప్రస్తుతం ఉన్న మెజార్టీతో ఒక ఎమ్మెల్సీని సొంతం చేసుకునే అవకాశం ఉంది. అయితే రెండో ఎమ్మెల్సీని కూడా దక్కించుకోవడానికి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేలతో కూడా సంప్రదింపు చేయాలని సూచించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేలు యూ టర్న్ తీసుకుంటే మరో ఎమ్మెల్సీ స్థానం బీఆర్ఎస్ ఖాతాలోకి పడుతుందని కేసీఆర్ అంచనా. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో మాట్లాడే బాధ్యత హరీష్ రావు, కేటీఆర్‌కు అప్పగించే అవకాశం ఉంది. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల్లో కొంతమంది తమతో టచ్‌లో ఉన్నారని బీఆర్ఎస్ వర్గాలు ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టాయి.


ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన విధివిధానాలపై కూడా కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఎమ్మెల్యేలతో కేసీఆర్ చర్చించనున్నారు. ఇక దీనితో పాటు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Also Read: రేవంత్ కేబినెట్.. బీసీల 42 శాతం రిజర్వేషన్లు, 11 వేల పోస్టులకు గ్రీన్‌సిగ్నల్

మరోవైపు ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఎమ్మెల్యే కోటాలో మొత్తం 5 స్థానాల భర్తీకి రంగం సిద్ధం కాగా.. కూటమి నేతలకే ఐదు ఎమ్మెల్సీ స్థానాలు దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. సంఖ్యాబలం ప్రకారం ఐదు ఎమ్మెల్సీ స్థానలను దక్కించుకోనుంది. అధికార కూటమి. దీంతో సీఎం చంద్రబాబు అనుగ్రహం కోసం తీవ్రంగా ఎదురు చూస్తున్నారు ఆశావహులు. టీడీపీ కి నాలుగు, జనసేనకు ఒక ఎమ్మెల్సీ స్థానాలు దక్కుతుండగా.. సామాజిక వర్గాల పరంగా.. ఎవరెవరికి అవకాశముందని చూస్తే..

కమ్మ సామాజిక వర్గం నుంచి మాజీ మంత్రి దేవినేని ఉమ, మాజీ ఎమ్మెల్యేలు కొమ్మాలపాటి శ్రీధర్, ప్రభాకర్ చౌదరి.. కాపు కోటాలో వంగవీటి రాధా, పరుచూరి అశోక్ బాబు, బీసీ కోటాలో యనమల రామకృష్ణుడు, బీద రవిచంద్ర, బుద్ధా వెంకన్న, గుండమల తిప్పేస్వామి, వడ్డే అంజనప్ప, గావిరెడ్డి రామానాయుడు, మైనార్టీ కోటాలో.. ఎండీ నజీర్, క్షత్రియ కోటాలో SVS వర్మ,మాజీ ఎంఎల్సీ సత్యనారాయణ రాజు, చామర్తి జగన్మోహన్ రాజు పోటీలో ఉన్నారు. ఇక ఎస్సీ.. కేఎస్ జోహార్, పీతల సుజాత, ఎస్ట్టీ కోటా.. గిడ్డి ఈశ్వరి, వంతల రాజేశ్వరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. రేపు సాయంత్రం జాబితా ఫైనల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూలై మొదటి వారంలో.. ఏపీ క్యాబినేట్ విస్తరణ చేస్తున్నట్టు తెలుస్తోంది.

 

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×