BigTV English

Botsa vs Atchannaidu: లిక్కర్ వ్యవహారంపై చర్చ.. బొత్సకు అచ్చెన్న కౌంటర్

Botsa vs Atchannaidu: లిక్కర్ వ్యవహారంపై చర్చ.. బొత్సకు అచ్చెన్న కౌంటర్

Botsa vs Atchannaidu:  ఏపీ శాసన మండలిని మద్యం వ్యవహారం కుదిపేసింది. దీనిపై అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. బెల్టు షాపులపై వాడి వేడి చర్చ జరిగింది. కొత్త కొత్త బ్రాండ్లను తగ్గించారా? వాటిని బ్యాన్ చేశారా? లిక్కర్ కేసుల గురించి చర్చ జరిగింది.


గత ప్రభుత్వంలో ఎక్కువ కేసులు పెట్టడం వల్లే మద్యం అమ్మకాలు తగ్గాయన్నారు ప్రతిపక్ష నేత బొత్స. ఈ పది నెలల కాలంలో ఎందుకు కేసులు పెట్టలేదన్నారు. గడిచిన 10 నెలలు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన బ్రాండ్లు కంటిన్యూ అవుతున్నాయని, ఏమైనా మార్చారా అంటూ సూటిగా ప్రశ్నలు లేవనెత్తారు.

మద్యంపై తాము లేవనెత్తిన ప్రశ్నలకు ఏమైనా చర్యలు తీసుకున్నారా?  స్వర్గీయ ఎన్టీఆర్ తీసుకొచ్చిన మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచిందెవరు? మా విజయనగరం జిల్లాలో ఓ ఊరిలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 9 వరకూ బెల్ట్ షాపు పెట్టుకునేందుకు రూ.50 లక్షలకు వేలం పాడారని గుర్తు చేశారు. ఒక్కటి కాదు ఇలాంటివి వంద చెప్పమంటే చెబుతానన్నారు.


ఈలోగా జోక్యం చేసుకున్న మంత్రి అచ్చెన్నాయుడు కొన్ని అంశాలపై వైసీపీ సభ్యులు నోరు ఎత్తకుంటే బెటరన్నారు.  మద్యంపై మాట్లాడే హక్కు వైసీపీకి లేదన్నారు. వాటిలో మద్యం, ఇసుక, మైనింగ్, భూమి వంటి కొన్ని శాఖలపై వైసీపీ ప్రశ్నలు వేయకూడదన్నారు. గడిచిన ఐదేళ్లలో ఒక్క బ్రాండ్ లిక్కర్ రాష్ట్రంలో దొరికిందా? అంటూ కౌంటరిచ్చారు. టీ దుకాణంలో టీ తయారు చేసి ఇచ్చినట్లుగా నాసిరకం మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారని దుయ్యబట్టారు.

ALSO READ: కొడాలి నానికి ఊహించని షాక్

సొంత కంపెనీల్లో నాసిరకం లిక్కర్ తయారు చేశారన్నారు. ఆనాడు చాలామంది పొరుగు రాష్ట్రాల నుంచి లిక్కర్ తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇప్పుడు అదంతా కట్టడి చేసి ప్రతీ పైసా ప్రభుత్వానికి ఆదాయం వచ్చినట్టుగా చేశామన్నారు. మీరు ఎక్కువ తాగిస్తున్నారని ప్రశ్న వేయడం సరికాదన్నారు. బెల్టు షాపుల గురించి కూడా క్లారిటీ ఇచ్చారు.

2019-24 మధ్యకాలంలో ప్రతీ ఇంటింటికీ వెళ్లి మద్యం బాటిల్స్ డోర్ డెలివరీ చేసినవాళ్లు ఈరోజు బెల్ట్ షాపుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు సదరు మంత్రి. అడ్డగోలుగా మాట్లాడి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని భావించడం సరికాదన్నారు. దీనిపై ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు సదరు మంత్రి.

వైసీపీ హయాంలో తెచ్చిన బ్రాండ్స్ ఉన్నాయని, మీరు తెచ్చిన సరుకు ఏం చెయ్యమంటారని ప్రశ్నించారు మంత్రి. ఈ విషయంలో ఎక్కడా దాపరికం లేదన్నారు. బెల్టు షాపులు ఉండకూడదని ముఖ్యమంత్రి పదేపదే చెబుతున్నారని వివరించారు.

ఈ వ్యవహారంపై పీడీఎఫ్ సభ్యులు నోరు ఎత్తారు. మద్యం కట్టడి చేయాలనే ఆలోచన ప్రభుత్వాలకు లేదన్నారు. రాబోయే తరాలను దృష్టిలో పెట్టుకుని క్రమంగా తగ్గిస్తే బెటరన్నారు. కనీసం నియంత్రణ వైపు చర్యలు చేపడితే బాగుంటుందన్నారు. వెంటనే ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర జోక్యం చేసుకున్నారు. బయట రాష్ట్రాల నుంచి వచ్చే వాటిని కంట్రోల్ చేయడం వల్ల దానికి సంబంధించి ఆదాయం ఏపీకి వచ్చిందన్నారు.

ఒకప్పుడు ఈ ఆదాయం పక్క రాష్ట్రాలకు పోయిందని గుర్తు చేశారు మంత్రి. తెలంగాణలో మైనస్ 3 శాతం, ఏపీ ప్లస్ 14లో ఉందన్నారు. ఇప్పటివరకు 15 షాపులను రద్దు చేశామన్నారు. గత మద్యంలో జరిగిన అవకతవకలపై సీఐడీ విచారణ జరుగుతోందని, దీని నుంచి ఎవరూ తప్పించుకోలేరన్నారు మంత్రి కొల్లు రవీంద్ర.

 

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×