E-Paper
Advertisement

KCR: కేసీఆర్ నోట చంద్రబాబు పేరు.. అందుకేనా..

KCR: కేసీఆర్ నోట చంద్రబాబు పేరు.. అందుకేనా..

KCR:  ఎన్నికల తర్వాత ప్రజాజీవితానికి దూరమై తన ఫాంహౌస్‌కే ఎక్కువగా పరిమితమైన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చాలా కాలం తర్వాత బయటకొచ్చారు. వచ్చి రావడంతోనే మళ్లీ సెంటిమెంట్ అస్త్రం ఎత్తుకున్నారు .. రాజకీయంగా మళ్లీ యాక్టీవ్ అయ్యే విధంగా కేసీఆర్ వ్యూహారచన చేస్తున్నట్లు కనిపిస్తోంది. కృష్ణా జలాల వాటాలకు సంబంధించి ఏకకాలంలో బీజేపీ, కాంగ్రెస్‌‌లపై ఒత్తిడి పెంచడానికి స్కెచ్ గీస్తున్నారంట. ఆ క్రమంలో గులాబీబాస్ భారీ బహిరంగ సభల్లో పాల్గొనే అవకాశం కనిపిస్తోందంటున్నారు. ఈ రీఎంట్రీలో కూడా కేసీఆర్ మళ్లీ ఏపీ సీఎం చంద్రబాబును టార్గెట్ చేయడం చర్చల్లో నలుగుతోంది.

తెలంగాణ భవన్‌లో ప్రభుత్వ పనితీరుపై చర్చ

గులాబీ దళపతి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా కాలం తర్వాత తన ఫాంహౌస్ నుంచి బయటకొచ్చారు. తెలంగాణ భవన్‌కు వచ్చి పార్టీపై , కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై సమీక్షించారు. వరుస ఎన్నికల్లో ఎదురైన పరాజయాలు, పార్టీలో పెరుగుతున్న అసంతృప్తి నేపథ్యంలో బీఆర్ఎస్‌కు మళ్లీ ఊపిరి పోయాలన్న ఉద్దేశంతో కేసీఆర్ రంగంలోకి దిగినట్లు పార్టీ నేతలు చెప్తున్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీలు, సీనియర్ నేతలతో భేటీ అయి తాజా రాజకీయ అంశాలపై చర్చించారు కేసీఆర్.

తెలంగాణ రాజకీయ పరిస్థితులపై నేతలతో చర్చ.. కేసీఆర్

చాలా కాలం తర్వాత తెలంగాణ రాజకీయ పరిస్ధితులపై నేతలతో చర్చించి కేసీఆర్…రాజకీయంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ మరోసారి సెంటిమెంట్ రాజకీయాలనే పార్టీ భవిష్యత్‌కి మంచిందనే భావనకి వచ్చినట్లు కనిపిస్తుందనే టాక్ పొలిటికల్ సర్కిల్స్‌లో నడుస్తుందట. నీటి అంశాలనే ప్రధాన ఏజెండాగా ప్రజల్లోకి వెళ్లేందుకు గులాబీ దళపతి కార్యచరణ సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.

బీజేపీని నిలదీయడమే లక్ష్యంగా పోరాటం

రెండేళ్ల మౌనం తర్వాత కేసీఆర్ నేరుగా ప్రజాక్షేత్రంలోకి రావాలని నిర్ణయించుకున్నారు. కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాకా నుంచే పోరాటం మొదలుపెట్టడం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. రాబోయే రెండు మూడు రోజుల్లో స్థానిక నేతలతో భేటీ అయ్యి, భారీ బహిరంగ సభ ద్వారా తన గళాన్ని వినిపించేందుకు కార్యచరణ సిద్ధం చేస్తున్నట్లు గులాబీ నేతలు చెబుతున్నారట. కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని, నీటి వాటాల విషయంలో కేంద్రంలోని బీజేపీని నిలదీయడమే లక్ష్యంగా ఈ పోరాటం సాగనుందట. తద్వారా అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండు పార్టీలపై ఏకకాలంలో ఒత్తిడి పెంచాలని కేసీఆర్ భావిస్తున్నారని గులాబీ నేతలు మాట్లాడుకుంటున్నారు.

గులాబి నేతల వ్యూహం

గులాబీ పార్టీ 2014, 2018 ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ ను బలంగా రగిలించి అధికారాన్ని దక్కించుకుంది. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అదే వ్యూహం పనిచేయలేదు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో స్వయంగా కేసీఆర్ ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోయింది. పార్టీ చరిత్రలో తొలిసారిగా బీఆర్ఎస్ కు ఒక్క ఎంపీ సీటు కూడా రాలేదు. ఇటీవల జూబ్లిహిల్స్, కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఓటమి, అలాగే పంచాయితీ ఎన్నికల్లో కూడా గులాబీ పార్టీ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయింది. రాష్ట్ర ఏర్పాటే తెలంగాణకు శాపం అంటూ కేసీఆర్ మాట్లాడడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తుందట. అందులో సాగునీటి అంశాన్ని తెరపైకి తీసుకువస్తే …రాజకీయంగా మైలేజ్‌ వస్తుందనేది గులాబీ నేతల వ్యూహాంగా కనిపిస్తుందట.

కేసీఆర్ కొత్త రాజకీయ వ్యూహం

ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర వివక్షకు గురైందని విషయాన్ని మరోసారి కేసీఆర్ గుర్తుచేస్తున్నారు. పాలమూరు-రంగారెడ్డి జిల్లాలకు రావాల్సిన 174 టీఎంసీల నీరు ఇప్పటికీ అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్. పాలమూరు జిల్లాకు బీజేపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఆన్యాయం చేస్తున్నాయనే విషయాన్ని ఆస్త్రంగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. చాలా రోజుల తర్వాత పార్టీ కార్యాలయానికి వచ్చిన కేసీఆర్ ఒక కొత్త రాజకీయ వ్యూహం ప్రకటించారు. మళ్లీ సెంటిమెంట్ రాజకీయాలు రాజేశారు.. ఏపీ ఏర్పాటు తెలంగాణకు శాపం అన్న కేసీఆర్ వ్యాఖ్యలను ప్రజలు ఎంతవరకూ విశ్వసిస్తారన్నది ఆసక్తికరంగా మారిందట.

చంద్రబాబు నీళ్ల దోపిడీ చేస్తున్నారని ధ్వజం

అటు గోదావరి మీద అరాచకం చేసి చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రభుత్వం నల్లమల సాగర్‌, ఈ సాగర్‌, ఆ సాగర్‌ అంటూ నీళ్ల దోపిడీ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చప్పుడు చేయడం లేదని కేసీఆర్ ధ్వజమెత్తారు. ఇటు కృష్ణలో పాలమూరు ఎత్తిపోతలకు అన్యాయం జరుగుతున్నా మాట్లాడటం లేదని. మరి ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నట్టీ రాష్ట్ర ప్రభుత్వం? ఏం చేయడానికి ఉన్నట్టు? ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నట్టు ? ఎట్టి పరిస్థితుల్లో తానే స్వయంగా రంగంలోకి దిగాలనుకుంటున్నానని యాంటీ చంద్రబాబు సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేశారు. ఈరోజు డెసిషన్‌ అయిపోయింది. నాలుగు రోజుల్లో ఆయా జిల్లాల నాయకులతో సమావేశమై గ్రామ గ్రామాన డప్పు కొడుతం. మొత్తం సభలు పెడుతం. కవులు, గాయకులు, కళాకారులందరినీ తట్టిలేపుతం. ఈ మీడియా సోదరులను కూడా రిక్వెస్ట్‌ చేస్తం. అకడ జరిగే అన్యాయాన్ని, ప్రజలకు జరిగే అన్యాయాన్ని, జల దోపిడీని ప్రజలకు చూపెట్టాలని కోరుతామంటూ చంద్రబాబుని తెలంగాణకు విలన్‌గా ఫోకస్ చేసే ప్రయత్నం చేశారు.

పార్టీ పేరు అయినా మర్చిపోతారు కానీ చంద్రబాబుని మర్చిపోరా?

ఇదంతా చూస్తూ దీర్ఘ కాలం తర్వాత బయటకు వచ్చిన కేసీఆర్ తన పార్టీ పేరు అయినా మర్చిపోతాడు కానీ చంద్రబాబు పేరు మర్చిపోడన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. మరికొద్దిరోజుల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు చేస్తుండడంతోనే కేసీఆర్ మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అయ్యారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆ క్రమంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే సెంటిమెంట్ రాజకీయాలతో ప్రజల మద్దుతు కూడకట్టాలనే యోచనలో బీఆర్ఎస్‌ నేతల ఉన్నట్లు చర్చ జరుగుతోంది.

Story By Ramireddy,  Big Tv 

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×