BigTV English

KCR New Strategy: కేసీఆర్ నయా ప్లాన్.. జోగుకి కీలక బాధ్యతలు..

KCR New Strategy: కేసీఆర్ నయా ప్లాన్.. జోగుకి కీలక బాధ్యతలు..

KCR New Strategy: గతంలో ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్‌కు పెట్టన కోట.. ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో కనిపిస్తోంది.. భవిష్యత్తులో ఆ పార్టీ మనుగడే ప్రశ్నార్ధకంగా మారే పరిస్థితి కనిపిస్తోంది.. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో వరుస ఓటముల తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి ఏంటన్న చర్చ నడుస్తోంది.. పదేళ్ళకు పైగా పదేసి సీట్లతో కళకళలాడిన పార్టీ ఆ జిల్లాలో ఒక్కసారిగా వరుస ఓటములు ఎదురవ్వడం హై కమాండ్‌ను కూడా టెన్షన్‌లో పడేసిందట.. ఇక కారుకు రిపేర్లు తప్పవని అధిష్ఠానం కూడా భావిస్తోందట.. కాకపోతే ఆ రిపేర్లు ఎక్కడ? ఎలా ? మొదలు పెట్టాలి అనేదే కారు పార్టీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారిందట..


ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బోరు కొచ్చి షెడ్డుకు చేరిన కారు జిల్లా

ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో కారు బోరు కొచ్చి షెడ్డుకు చేరింది.. జిల్లా బీఆర్ఎస్‌లో పెద్దగా నేతలెవరూ కనపడకపోవడం, ఉన్న నేతలు కూడా ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతుండటంతో జిల్లాలో ఆ పార్టీ మనుగడే ప్రశ్నార్థకం అవుతుందా? అన్న చర్చ నడుస్తోంది. ఆ క్రమంలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో పార్టీని గాడిన పెట్టేందుకు అధిష్ఠానం సమాయత్తం అవుతుందట.. గులాబి పార్టీ పరిస్థితి ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం అగమ్య గోచరంగా మారడంతో.. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదని ఆ పార్టీ నేతలకు గట్టిగానే తెలిసి వస్తోందంట..


అంతకు ముందు జిల్లాలో క్లీన్ స్వీప్ చేసిన ఉద్యమ పార్టీ

గతంలో జిల్లాను క్లీన్ స్వీప్ చేసిన ఉద్యమ పార్టీ, ప్రస్తుతం ఉనికి కోసం పాకులాడే పరిస్థితికి చేరుకుంది.. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేవలం రెండు స్థానాలు గెలిచిన బీఆర్ఎస్, ఎంపీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది.. ఆ ఎఫెక్ట్‌తో గులాబీ పార్టీలో కీలక నేతలంతా కండువాలు మార్చి అధికార పక్షం వైపు వెళ్ళారు. కారు పార్టీలో మిగిలిన కొంత మంది నేతల్లో ఒకరిద్దరు మినహాయించి మిగతా వారు పెద్దగా బయటకు రావడం లేదు.. దీంతో పార్టీ క్యాడర్ కూడా కామ్‌గా ఉండిపోతుందట.. ప్రధానంగా నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో అసలు బీఆర్ఎస్ ఉందా..? లేదా..? అన్నట్లు పార్టీ పరిస్థితి తయారయ్యిందట.

ఉమ్మడి జిల్లాపై గట్టి పట్టున్న నాయకుడికే ఇన్చార్జ్ బాధ్యతలు

ఒకప్పుడు పార్టీకి కంచుకోటగా ఉన్న జిల్లాలో పట్టు కోల్పోవడం కేసీఆర్ అండ్ కోని కలవరపెడుతోందట.. దాంతో అలెర్ట్ అయిన అగ్ర నాయకత్వం కష్ట కాలంలో పార్టీకి తోడుగా నిలిచిన కొందరు ప్రధాన నేతలకే నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించాలని చూస్తోందట.. ఉమ్మడి జిల్లాపై గట్టి పట్టున్న నాయకుడికే ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించాలని డిసైడ్ అయ్యిందట .. మరో వైపు పార్టీ మారిన కీలక నేతలను తిరిగి తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నప్పటికీ … ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదని .. అందుకే ఉన్నవారితోనే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని ఆలోచనలు చేస్తున్నారట .

Also Read: బీజేపీలో కుమ్ములాటలు.. టేబుల్స్ తుడుచు.. సీటు పట్టు!

పూర్వ వైభవం తెచ్చేందుకు జోగు రామన్న ప్రయత్నాలు

కారు పార్టీ అధిష్టానం ఆలోచనకు తగ్గట్టు అదే పనిలో ఉన్నారట మాజీ మంత్రి జోగు రామన్న.. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట..అటు బీఆర్ఎష్ నుండి గెలిచిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి కూడా ప్రజాక్షేత్రంలో ఉద్యమాలు చేయాలని డిసైడ్ అయ్యారట.. ఇక నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో ఆరు నియోజకవర్గాల్లో కొత్త ఇంచార్జ్ లను నియమించి జిల్లా అధ్యక్షుడిని ఎంపిక చేయాలని అధిష్ఠానం ఫిక్స్ అయినట్టు ప్రచారం జరుగుతోంది..

నేతలు పార్టీని పట్టించుకోవడం లేదని క్యాడర్ ఫిర్యాదులు

ప్రస్తుతం ఉన్న నాయకులు పార్టీని పట్టించుకోవడం లేదని, క్యాడర్‌ని గాలికి వదిలేశారని గులాబి అధిష్టానానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేరాయట. దీంతో ఆయా స్థానాల్లో కొత్త వారిని నియమించి వారికి అవకాశం ఇవ్వాలని భావిస్తోందట అధిష్టానం. అటు ఖానాపూర్ లో జాన్సన్ నాయక్‌కి, చెన్నూర్ లో బాల్క సుమన్‌కి తోడుగా మరో ఇద్దరు యువ నాయకులను నియమించాలనే ఆలోచనలు చేస్తున్నారట కారు పార్టీ పెద్దలు. అలాగే ఉమ్మడి అదిలాబాద్ జిల్లా పై పూర్తి పట్టున్న జోగు రామన్న కు కీలక బాధ్యతలు అప్పగించాలని పార్టీ వర్గాలో చర్చ జరుగుతోంది.. మరి కేసీఆర్ అండ్ కో చేస్తున్న ప్రయత్నాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి

Related News

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

Big Stories

×