Telangana RTC: ఇప్పుడున్న రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం దొరకం చాలా కష్టం. ఎందుకంటే విపరీతమైన పోటీ పెరిగింది. ఆ ఉద్యోగమే అతని కష్టాలకు కారణం అయ్యింది. ఎందుకంటే ఎత్తుగా ఉండడమే ముఖ్యకారణం. వచ్చిన ఉద్యోగం వదల్లేక నరకం అనుభవించాడు. ఏ వ్యక్తికి కష్టాలు ఎల్లకాలం ఉండవు. అన్సారీ విషయంలోనూ అదే రుజువు అయ్యింది. ఈ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో వెంటనే ఆర్టీసీ మంత్రి పొన్న ప్రభాకర్ ఆదేశాలు ఇచ్చారు.
పై ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు అమీన్ అహ్మద్ అన్సారీ. తెలంగాణలో ఆర్టీసీలో పని చేస్తున్నాడు. మెహిదీపట్నం డిపోలో విధులు నిర్వహిస్తున్నాడు. చాంద్రాయణగుట్ట షాహీనగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఆయన తండ్రి కాచిగూడ డిపోలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న సమయంలో అనారోగ్యంతో నాలుగేళ్ల కిందట చనిపోయారు.
కారుణ్య నియామకం కింద ఇంటర్ పూర్తి చేసిన అన్సారీకి కండక్టర్ ఉద్యోగం ఇచ్చింది ప్రభుత్వం. ఇక్కడ వరకు అంతా బాగానే సాగింది. అన్సారీకి అసలు సమస్య వచ్చిపడింది. ఏడడుగుల పొడవు ఉండటంతో విధులు నిర్వర్తించడం సవాల్‌గా మారింది. బస్సుల్లో రోజూ సగటున ఐదు ట్రిప్పుల్లో ఎనిమిది గంటల వరకు ప్రయాణించాల్సి పరిస్థితి ఏర్పడింది.
195 సెం.మీ.(6 అడుగుల 4 అంగుళాలు) ఎత్తున్న బస్సులో ఆయన విధులు నిర్వహిస్తున్నాడు. అన్సారీ ఎత్తు చూస్తే 214 సెంటీ మీటర్లు కాగా, గంటల తరబడి తల వంచి డ్యూటీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీనివల్ల మెడ, వెన్నునొప్పి, నిద్రలేమితో ఆసుపత్రుల చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు.
ALSO READ: అసలు గుంట నక్కలు ఎవరో బయటపడ్డారు.. సామా ఫైర్
అన్సారీ కష్టాలను గమనించిన ప్రయాణికులు చివరకు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. అన్సారీ మరేదైనా ఉద్యోగం ఇచ్చేలా ఇవ్వాలని కోరారు. ఈ విషయాన్ని మీడియా బయటకు తీయడంతో రేవంత్ సర్కార్ రియాక్ట్ అయ్యింది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఆ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో మాట్లాడారు.
ముఖ్యమంత్రి సూచన మేరకు అన్సారీకి ఆర్టీసీలో మరో ఉద్యోగం ఇవ్వాలని ఆ సంస్థ ఎండీ సజ్జనార్‌కు ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని ప్రస్తావించారు మంత్రి పొన్నం. ఆ విధంగా అన్సారీ కష్టాలకు ఫుల్‌స్టాప్ పడింది.
ALSO READ: ఇదే కదా రామభక్తులంటే
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు అతనికి సరైన మరో ఉద్యోగం ఆర్టీసీ లో ఇవ్వగలరు @SajjanarVC గారికి ఆదేశం
– మీ పొన్నం ప్రభాకర్ https://t.co/zadYYAMYhM
— Ponnam Prabhakar (@Ponnam_INC) April 6, 2025