OTT Movie : క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లు ఇప్పుడు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే వెబ్ సిరీస్ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఇందులో ఒక సైకో పెళ్లికి సిద్ధంగా ఉండే అమ్మాయిలను టార్గెట్ చేసి చంపుతుంటాడు. చివరి వరకు సస్పెన్స్ తో సాగిపోయే ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘దహాద్'(Dahaad). బాలీవుడ్ నుంచి విడుదలైన ఈ పోలీస్ ప్రొసీజరల్ సిరీస్ కు రీమా కాగ్తీ, జోయా అఖ్తర్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌లో సోనాక్షి సిన్హా, విజయ్ వర్మ, గుల్షన్ దేవయ్య, సోహం షా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది రాజస్థాన్‌లోని ఒక చిన్న గ్రామంలో జరిగే స్టోరీని చూపిస్తుంది. సమాజంలోని కుల వివక్షత, లింగ వివక్షత, మహిళలపై జరిగే నేరాలను ఈ సిరీస్ లో కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు. ఈ సిరీస్ నిజ జీవిత సీరియల్ కిల్లర్ ‘సైనైడ్ మోహన్’ ను ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. అతను వివాహం కోసం సిద్ధంగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని చంపుతుంటాడు. అయితే చంపేముందు వాళ్ళను శారీరకంగా అనుభవిస్తాడు. ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
రాజస్థాన్‌లోని మందావా అనే చిన్న గ్రామంలో స్టోరీ ప్రారంభమవుతుంది. సబ్-ఇన్‌స్పెక్టర్ అంజలి భాటీ నాయకత్వంలో ఒక విచిత్రమైన కేసు వెలుగులోకి వస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 27 మంది మహిళలు ఆచూకీ లేకుండా మాయమవుతారు. కానీ స్థానికులు దీనిని పెద్దగా పట్టించుకోరు. మొదట్లో ఈ మరణాలు ఆత్మహత్యలుగా కనిపిస్తాయి. కానీ అంజలి దర్యాప్తు చేస్తున్న కొద్దీ, ఇవి ఒక సీరియల్ కిల్లర్ చేతిలో జరిగిన హత్యలుగా అనుమానం కలుగుతుంది. అంజలి, తన సహచరులైన దేవీ లాల్ సింగ్, కైలాష్ పర్ఘీ తో కలిసి ఈ కేసును పరిశీలిస్తుంది. ఈ దర్యాప్తులో ఆనంద్ స్వర్ణకర్ అనే హిందీ లిటరేచర్ ప్రొఫెసర్‌పై అనుమానం పడుతుంది. ఆనంద్ బయటికి సాధారణ వ్యక్తిగా, సమాజ సేవకుడిగా కనిపిస్తాడు. కానీ అతని నిజ స్వరూపం ఒక క్రూరమైన సీరియల్ కిల్లర్‌గా ఉంటుంది. అతను వివాహం కోసం ఎదురుచూసే మహిళలను మోసం చేసి, వారిని శారీరకంగా అనుభవించి సైనైడ్‌తో హత్య చేస్తాడు. చివరికి అంజలి ఆ కిల్లర్ ని పట్టుకుంటుందా ? పెళ్ళికి ముందు అమ్మాయిలను అనుభవించి ఎందుకు చంపుతున్నాడు? ఈ విషయాలను ఈ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సిరీస్ కేవలం ఒక క్రైమ్ థ్రిల్లర్‌తో ఆగిపోదు. ఇది కుల వ్యవస్థ, లింగ వివక్ష, స్త్రీలపై జరిగే అన్యాయాలను లోతుగా చూపిస్తుంది. ఇందులో అంజలి స్వయంగా కుల వివక్షతను ఎదుర్కొంటూ, ఒక మహిళా పోలీసు అధికారిగా తన స్థానాన్ని సమర్థించుకోవాల్సి పరిస్తితి వస్తుంది.