Pithapuram Varma: కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ వచ్చే ఎన్నికల్లో పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుందని జోస్యం చెప్తున్నారు.. పిఠాపురం నియోజకవర్గం వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యాలు కలకలం రేపుతున్నాయి. పరోక్షంగా జనసేనను టార్గెట్ చేస్తున్నట్లు ఆయన మాట్లాడటంపై పెద్ద చర్చే జరుగుతోంది. ఇప్పటికే పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ వర్సెస్ జనసేన వార్ నడుస్తోంది. అసలిక్కడ జనసేన పదేపదే ఎందుకు టార్గెట్ అవుతోంది? వర్మకు ఎటువంటి నామినేటెడ్ పదవి రాకపోవడమే కారణమా? మినీ మహానాడులో జ్యోతుల నవీన్ తెలుగుదేశం పార్టీ మనుగడకాపాడుకోవాలంటే కష్టపడిన వారికి పదవులు ఇవ్వాలని చేసిన కామెంట్స్ వెనుక ఆంతర్యమదేనా?
పిఠాపురం మినీ మహానాడులో జ్యోతుల నవీన్ హాట్ కామెంట్స్
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి, రాష్ట్ర డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్న పవన్‌కళ్యాణ్ నియోజకవర్గం ఈ మధ్య కాంట్రవర్సీలకి కేర్ అఫ్‌గా నిలుస్తోంది. తెలుగు తమ్ముళ్లకు. జనసైనికులకు మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. తాజాగా పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే వర్మ నిర్వహించిన మినీ మహానాడులో జిల్లా పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ చేసిన కామెంట్స్ సెగ్మెంట్లోహాట్ టాపిక్ గా మారాయి… కష్టపడిన వారికి పదవులు ఇవ్వకుంటే, కార్యకర్తలను కాపాడుకోలేకపోతే తెలుగుదేశం పార్టీ మళ్లీ ఓటమి చవి చూస్తుందనడంలో ఎటువంటి సందేహం ఉండదని జిల్లా టీడీపీ అధ్యక్షుడి హోదాలో ఉన్న జ్యోతుల నవీన్ వ్యాఖ్యానించడంపై పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద డిబేటే నడుస్తోంది.
నాగబాబు వ్యాఖ్యలతో మిత్రపక్షాల క్యాడర్ మధ్య గ్యాప్
కాకినాడ జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో మినీ మహానాడు మీటింగ్‌లకు జిల్లా అధ్యక్షుడిగా హాజరైన జ్యోతుల నవీన్ .. ఎక్కడా ఈ స్థాయిలో రెస్పాండ్ కాలేదు. పిఠాపురం నియోజకవర్గంలో మాత్రమే ఎందుకు ఆ విధంగా మాట్లాడారనే చర్చ పిఠాపురం తెలుగు తమ్ముళ్లు, జనసైనికుల మధ్య ఓ రేంజ్ లో నడుస్తోంది. జనసేన ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో నిర్వహించారు. గ్రాండ్ సక్సెస్ అయిన ఆ సభలో ప్రస్తుత జనసే ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు చేసిన వ్యాఖ్యలతో మిత్రపక్షాల మధ్య గ్యాప్ పెరిగిపోయింది. పవన్ కళ్యాణ్ విజయానికి పవన్ కళ్యాణ్ చరిష్మా, జనసేన కార్యకర్తలు మాత్రమే కారణమని నాగబాబు చేసిన కామెంట్స్ పిఠాపురం టీడీపీలో పెద్ద దుమారమే రేపాయి.
నాగాబాబు కామెంట్స్‌పై రియాక్ట్ కాని వర్మ
అప్పటి నుంచి మిత్రపక్షాల నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు మారిపోయాయి. పవన్‌కళ్యాణ్ కోసం పిఠాపురం సీటు త్యాగం చేసి, ఆయన విజయానికి కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే వర్మ స్వయంగా నాగబాబు కామెంట్స్‌పై స్పందించ లేదు. ఆయన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని బలపరిచే పనిలో నిమగ్నమయ్యారు. కార్యకర్తే అధినేత … అన్న కార్యక్రమం వారంలో ఒకరోజు నిర్వహిస్తున్నారు. ప్రజలే నా బలం .. అనే నినాదంతో నియోజకవర్గంలో చురుగ్గా పని చేసుకుంటూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు .
దొరబాబు వంటి నేతల్ని చేర్చుకుంటూ బలపడే ప్రయత్నం చేస్తున్న జనసేన
వర్మ అవకాశం దొరికిన ప్రతిసారీ తెలుగుదేశం పార్టీ రథ సారథిగా లోకేష్‌ను ప్రకటించాలని బహిరంగ సభలలో మాట్లాడుతున్నారు. నామినేటెడ్ పదవి కోసం లొకేష్‌ని ప్రసన్నం చేసుకోవడానికి వర్మ ఆ డిమాండ్ వినిపిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న జ్యోతుల నవీన్ పిఠాపురం మినీ మహానాడు వేదికగా కార్యకర్తలను నాయకులను కాపాడుకోలేకపోతే తెలుగుదేశం పార్టీ మళ్లీ ఓటమి చవి చూడాల్సి వస్తుందంటూ చేసిన హాట్ కామెంట్స్ కేవలం వర్మ ఉద్దేశించి చేశారా? కాకినాడ జిల్లాల్లో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు వంటి వైసీపీ నేతలను జనసేనలో చేర్చుకుంటూ, ఆ పార్టీ బలపడుతున్నట్లు కనిపిస్తుండటంతో అసహనానికి గురై అలా వ్యాఖ్యానించారా? అన్న చర్చ నడుస్తోంది.
ఆగ్రహం వ్యక్త చేస్తున్న పిఠాపురం జనసైనికులు
కేవలం పవన్ కళ్యాణ్ నియోజకవర్గమే ఎందుకు ప్రతిసారి టీడీపీకి టార్గెట్ అవుతుంది? వర్మతో పాటు తెలుగుదేశం నాయకులు కూడా పిఠాపురం నియోజకవర్గాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలుపొంది, డిప్యూటీ సీఎంగా అనేక శాఖలకు మినిస్టర్‌కి వ్యవహరిస్తూ నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలో అనేక పదవులు జనసేన నాయకులను రావడంలో పవన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అది సహజంగా జనసేన బలోపేతానికి దోహద పడుతుంది కాబట్టే అందరూ పిఠాపురం నియోజకవర్గంపైనే ఫోకస్ పెడుతున్నారని, పవన్‌ని టార్గెట్ చేసినట్లుగా వ్యవహరిస్తున్నారని, అది సరైన పద్ధతి కాదని జనసైనికులు బహిరంగ విమర్శలు చేస్తున్నారు.
పవన్‌తో సన్నిహితంగా ఉంటున్న చంద్రబాబు, లోకేష్‌లు
చంద్రబాబు, లోకేష్‌తో సహా టీడీపీ ముఖ్యనేతలంతా పవన్‌కళ్యాణ్‌తో అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. పవన్‌ని చంద్రబాబు బహిరంగంగానే పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. లోకేష్ సైతం డిప్యూటీ సీఎం పవనన్న అంటూ సాన్నిహిత్యాన్ని చాటుకుంటున్నారు. పవన్కళ్యాణ్ కూడా కూటమి ప్రభుత్వం15 – 20 సంవత్సరాల పాటు ఉంటుందని, ప్రధాని మోడీలా చంద్రబాబు కూడా వరుస విజయాలు సాధించాలని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు సీఎం గా ఉండాలని పదేపదే సీఎంని ఆకాశానికెత్తేస్తున్నారు.
వర్మకు పదవి కారపోవడమే ఈ పరిస్థితికి కారణమంటున్న జనసేన
అలాంటిది పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోనే తెలుగుదేశం, జనసేన నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం, పదేపదే పిఠాపురం నియోజవర్గం వార్తల్లోకి ఎక్కడం, రెండు పార్టీలకు అంత మంచిది కాదని, అది చినికిచినికి గాలివానగా మారి, దాని ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా జనసేన, టిడిపి కార్యకర్తలపై రిఫెక్ట్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జనసైనికులు మాత్రం వర్మకు పదవి రాకపోవడమే ఈ పరిస్థితికి కారణమని నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు.
Also Read: గంటాకి వారసుడి తలనొప్పి
తెలుగుదేశం క్యాడర్ కూడా పవన్‌కళ్యాణ్ విజయంలో కీలకపాత్ర పోషించిన వర్మకు కచ్చితంగా నామినేటెడ్ పదవి ఇవ్వాలని ఎప్పటి నుంచో కోరుతోంది. ఈ నేపథ్యంలోనే జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ చేసిన కామెంట్స్ వెనుక వర్మే పాత్ర ఉందా? అనే చర్చ ఇ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది. ఈనెల ఆఖరికీ నామినేటెడ్ పదవులన్నీ భర్తీ చేస్తానంటున్న చంద్రబాబు ఈ సారైనా వర్మకు ఏదైనా పదవి కట్టబెట్టి పిఠాపురం రచ్చకి తెర దింపుతారో? లేదో చూడాలి.