BigTV English

Ganta Srinivasa Rao: గంటాకి వారసుడి తలనొప్పి

Ganta Srinivasa Rao: గంటాకి వారసుడి తలనొప్పి

Ganta Srinivasa Rao: జోహార్ సీఎం చంద్రబాబు, జోహార్ లోకేష్, ఏంటి బతికి ఉన్న వాళ్లకు జోహార్ కొడుతున్నాం అనుకోకండి… ఇది మేం అంటున్నది కాదు. రాజకీయాల్లో ఓటమి తెలియని మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ కొడుకు నోటి నుండి వచ్చిన పలుకులు. తండ్రి ఏమో రాజకీయాల్ని శాసించే స్థాయికి ఎదిగి ఓటమి తెలియని నాయకుడిగా ముద్ర వేయించుకుంటే రాజకీయ ఆరంగేట్రానికి సిద్ధంగా ఉన్న కొడుకు రవితేజ తన తెలిసీ తెలియనితనంతో తండ్రి ఇమేజ్‌ను డామేజ్ చేస్తూ అందరిలో నవ్వులపాలవుతున్నారు. మరి నిన్న మొన్నటి వరకు తండ్రి చాటు బిడ్డగా ఉన్న రవితేజ భవిష్యత్తు రాజకీయ జీవితం ఎలా ఉండబోతుంది? ఓటమి ఎరగని తన తండ్రి తరహాలో అతను కూడా అనుభవం పెంచుకుని చక్రం తిప్పగలరా?


ఓటమి ఎరుగని పొలిటీషియన్ గంటా శ్రీనివాసరావు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాల్లో ఓటమి తెలియని నాయకుడు ఎవరు అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు మాజీ మంత్రి ప్రస్తుత భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు… ఓటమి ఎరగని రాజకీయ నాయకుడిగా పేరున్న గంటా శ్రీనివాసరావు 4 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిచి తన రాజకీయ ప్రయాణంలో ఓటమిని దరిదాపులకు రాకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు… ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏ నియోజకవర్గం నుండి పోటీ చేసినా, ఓటమి తనను చూసి ఓడిపోతుందని ధీమాతో ఎన్నికల బరిలో దిగే గంటా ఎన్నికల ముందు నియోజకవర్గాల్లో అడుగుపెట్టినా, విజయతోనే అసెంబ్లీలో అడుగు పెట్టారు.. గంటా శ్రీనివాస్ కు పార్టీతో పనిలేదు… ఏ రాజకీయ పార్టీ నుండి ఎన్నికల బరిలో దిగినా తన స్ట్రాటజీతో గెలుపును ఇట్టే సొంతం చేసుకుంటారనే ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు…


రుషికొండ ప్యాలెస్‌ను ప్రదర్శనకు పెట్టి చీవాట్లు

అందుకే ప్రతి ఎన్నికల ముందు గంటా శ్రీనివాస్ పార్టీ మారతారు అనే ప్రచారం జరిగితే చాలు రాజకీయ పార్టీలు గంటాను తమ పార్టీలోకి ఆహ్వానించడానికి పోటీ పడుతుంటాయి. రాజకీయాల్లో ఆర్థిక, సామాజిక బలం ఉంటే మాత్రమే సరిపోదు. ఎన్నికలలో పోల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనేది కూడా బాగా తెలిసి ఉండాలి. అలా తెలిసిన వ్యక్తి కాబట్టి గంటా శ్రీనివాసును చూస్తే ఓటమి కూడా భయపడి పారిపోతుందంటారు. అలాంటి గంటా శ్రీనివాస్ కు 2024 ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా టీడీపీలో కొంత వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ రిషికొండపై నిర్మించిన ప్యాలెస్ తాళాలు తీసి ప్రదర్శనకు పెట్టడంతో సీఎం చంద్రబాబు చేత తొలి వార్నింగ్ ఇప్పించుకున్నారంట.

జీవీఎంస డిప్యూటీ మేయర్ ఎన్నిక రోజు ఓటింగుకి దూరం

తర్వాత గంటా అమరావతి వెళ్లాలంటే విశాఖ వయా హైదరాబాద్ టూ గన్నవరం అంటూ ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టి మళ్ళీ చంద్రబాబు ఆగ్రహానికి గురయ్యారంట. ముచ్చటగా మూడోసారి విశాఖ జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక రోజు ఓటు వేయడానికి రాకుండా దూరంగా ఉండి మరోసారి చంద్రబాబు చేత మాట పడ్డారు. రాజకీయాల్లో ఎంత ఉన్నత స్థాయికి వెళ్లినా టైం రివర్స్ అయితే కోరుకోకుండానే కష్టాలు కళ్ళ ముందుకు వస్తాయి అన్నట్లు… ప్రస్తుతం టిడిపిలో తనకంటూ ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న గంటా శ్రీనివాసరావు టిడిపి అధినాయకత్వం చేత మాటలు పడుతూ వస్తున్నారు

గంటా శ్రీనివాస్‌కి కొడుకు రూపంలో కొత్త తలనొప్పి

అదలా ఉంటే టీడీపీ నుంచి పీఆర్పీకి, అక్కడ నుంచి కాంగ్రెస్‌కి తర్వాత తిరిగి టీడీపీకి వచ్చిన గంట శ్రీనివాస్ తన ఇమేజ్‌కి ఎక్కడా డ్యామేజ్ అవ్వకుండా పాతికేళ్ల రాజకీయ జీవితంలో ఓ మెట్టు పైకి ఎదుగుతూనే వచ్చారు. అలాంటి మాజీ మంత్రికి ఇప్పుడు కొడుకు రూపంలో కొత్త తలనొప్పి మొదలైందంట. రాజకీయ నాయకుల్లో అత్యధికులు కచ్చితంగా రాజకీయ వారసత్వాన్ని తెరమీదకి తీసుకొచ్చి తమ బిడ్డల్ని గ్రాండ్ లాంచ్ చేస్తారు. అలాగే గంట శ్రీనివాస్ తన కొడుకు రవితేజని రాజకీయాల్లో గ్రాండ్‌గా లాంచింగ్ చేయడానికి ప్లాన్ చేశారు… 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక భీమిలి నుండి గెలిచిన ఆయన భీమిలి నియోజకవర్గం పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో తనతో పాటు తన కొడుకును కూడా ముందు పెట్టి నడిపిస్తున్నారు.

భీమిలి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న రవితేజ

గత సంవత్సర కాలంగా భీమిలి నియోజకవర్గంలో జరిగే అధికారిక కార్యక్రమాల్లో గంటా కొడుకు రవితేజ అన్ని తానై ముందుండి నడిపిస్తున్నారు. ఇప్పటివరకు అన్ని ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల నిర్వహణలో ముందు ఉండి పనులు చేస్తున్న రవితేజ పెద్దగా ప్రసంగాలు చేయలేదు. స్టేజీ మీద మాట్లాడితే ఒక్క నిమిషానికి మించి ఏ రోజు మాట్లాడింది లేదు. అలాంటి గంట రవితేజ తాజాగా భీమిలి నియోజకవర్గంలో జరిగిన మినీ మహానాడులో తన తండ్రితో పాటు నియోజకవర్గంలోని కీలకమైన రాజకీయ నాయకుల సమక్షంలో క్యాడర్‌ని ఉత్సాహపరచడానికి మాట్లాడుతూ నోరు జారి జోహార్ సీఎం సార్, జోహార్ లోకేష్ అన్నయ్య అంటూ నినాదాలు చేశారు.

రవితేజను ఫాలో అయిన పార్టీ క్యాడర్

రవితేజ తెలిసీ తెలియక కనబర్చిన అత్యుత్సాహాన్ని కేడర్ మొత్తం ఫాలో అయింది. మినీ మహానాడుకు హాజరైన పార్టీ శ్రేణులు మొత్తం అంతా ఫాలో అయ్యి జోహార్ సీఎం చంద్రబాబు, జోహార్ నారా లోకేష్ అంటూ నినాదాలు చేశారు…. చేసిన తప్పును గుర్తించి సరిదిద్దుకునే లోపే జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది. రవితేజ మినీ మహానాడు స్టేజి మీద మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి… బ్రతికున్న వాళ్లకు జోహార్లు ఏంటయ్యా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీకి దూరంగా జరిగిన రవితేజ

ఆ వ్యాఖ్యలతో గంటా వారసుడు నవ్వులపాలు అవుతున్నా… ఇంతకాలం ఆయన ఎవరో తెలియని వారికి కూడా పరిచయమవుతున్నారు. గంటా రవితేజ తెలియని వారు ఉండరు అనే అంతగా సోషల్ మీడియాలో పాపులర్ అవుతున్నారు. గంటా శ్రీనివాస్ తన కొడుకుని సినిమా ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టి కొత్త ఇమేజ్ క్రియేట్ చేయాలనుకున్నారు. స్టార్ డైరెక్టర్ జయంత్ సి పరాన్జీతో పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్‌తో జై దేవ్ అనే మూవీతో గంట రవితేజను లాంచ్ కూడా చేశారు. జయదేవ్ సినిమా డిజాస్టర్ కావడంతో గంటా రవితేజ తనకి సినిమాలు సరిపడవు అనుకున్నారో ఏమో?మొదటి సినిమాతోనే సినిమా ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పేసి తండ్రి రాజకీయ వారసుడిగా ఓనమాలు నేర్చుకోవడం మొదలుపెట్టారు.

రవితేజ రాజకీయ భవిష్యత్తుపై అప్పుడే సందేహాలు

సినిమా ఇండస్ట్రీ నుంచి నేరుగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రవితేజ తన తండ్రి రాజకీయ వ్యవహారాలను చక్కబెడుతూ ఎక్కడ నోరు విప్పకుండా గత ఐదేళ్లుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ వచ్చారు. టీడీపీ అధికారంలో ఉన్న ప్రస్తుత తరుణంలో జరుగుతున్న మినీ మహానాడు తన ఆ రాజకీయ ఆరంగేట్రానికి సరైన సమయం అని భావించిన రవితేజకు తొలి పొలిటికల్ ప్రసంగంలోనే చుక్కెదురవ్వడంతో.. ఆయన భవిష్యత్తు రాజకీయం ఎలా ఉండబోతుందన్న సందేహాలు మొదలయ్యాయి.

మంత్రి పదవి దక్కక నిరాశకు గురైన గంటా

2024 ఎన్నికల బరిలో తన వారసుడ్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించాలని గంట శ్రీనివాస్ ప్రయత్నం చేసినట్లు జోరుగా ప్రచారం సాగింది. చంద్రబాబు దగ్గర కూడా తన కొడుకుకి సీటు ఇవ్వాలని గంటా కోరినట్లు అప్పట్లో టాక్ నడిచింది. 2024 ఎన్నికల్లో ప్రతి సీటు టీడీపీకి కీలకం కావడంతో చంద్రబాబు నిరాకరించడంతో గంట తానే స్వయంగా భీమిలి బరిలోకి దిగి విజయం సాధించారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కచ్చితంగా గంట శ్రీనివాస్ కు మంత్రి పదవి వస్తుందని అందరూ భావించారు. అయితే ఎవరు ఊహించని విధంగా చంద్రబాబు మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడంతో ఆయనకు నిరాశే మిగిలింది.

Also Read: బీజేపీతో పొత్తు.. వైసీపీ కొత్త వ్యూహమా?

భీమిలిలో వారసుడ్ని ఫోకస్ చేస్తున్న గంటా శ్రీనివాస్

మంత్రి పదవి రాకపోవడంతో నియోజకవర్గ మీద కొంత ఫోకస్ తగ్గించిన గంటా తన వారసుడ్ని ప్రమోట్ చేసుకునే పనిలో పడ్డారంట. రవితేజను భీమిలి నియోజకవర్గంలో బలమైన నేతగా తయారు చేయడానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్న మాజీ మంత్రి పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో కుమారుడ్ని ముందు పెట్టి నడిపిస్తున్నారంట. తీరా చూస్తే రవితేజ మినీ మహానాడు స్పీచ్‌తో అందరికీ కామెడీగా మారిపోయారు. మరి సినిమాల్లో ఫ్లాప్ అయిన ఆయన పొలిటికల్ స్క్రీన్‌పై ఏ మాత్రం రాణిస్తారో చూడాలి.

Related News

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

T Congress: కాంగ్రెస్‌లో టెన్షన్..? కార్యవర్గ పోస్టుల భర్తీ ఎప్పుడు..

Big Stories

×