E-Paper
Advertisement

Khammam: సైలెంట్ మూడ్‌లో ఖమ్మం నేతలు

Khammam: సైలెంట్ మూడ్‌లో ఖమ్మం నేతలు

Khammam:  మొన్నటివరకు స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి. పార్టీ నేతలంతా ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రయత్నించారు. కానీ ఆ టైంలో బీసీ రిజర్వేషన్ అంశం తెరపైకి వచ్చి, కోర్టు తీర్పుతో నేతలంతా సైలెంట్ అయ్యారు. ప్రత్యేకించి ఆ జిల్లాలో అన్ని పార్టీలు స్తబ్ధతగా మారి ముభావాన్ని పాటిస్తున్నాయి. నేతలు కూడా ప్రజల్లోకి వెళ్లకుండా కొంచెం డిస్టెన్స్ మెయింటెన్ చేస్తున్నారట. ఇంతకీ రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైన జిల్లాలో ఎందుకీ పరిస్థితి అనేది చర్చ జరుగుతోంది. ఆ జిల్లా ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

స్తబ్ధతకు లోనైన రాజకీయ నేతలు

మొన్నటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలంటూ హడావిడి నడిచింది. దాంతో ఆయా పార్టీల నేతలంతా జనంలోకి దూకి, కౌగిలింతల రాజకీయం చేశారు. కానీ, అనుకోకుండా వచ్చిన ఒక బ్రేక్ అందరినీ గందరగోళంలో పడేసింది. అదే బీసీ రిజర్వేషన్ అంశం! న్యాయస్థానం తీర్పు తెరపైకి రావడంతో… ఆశలు పెట్టుకున్న నాయకులంతా ఒక్కసారిగా బ్రేకులు పడిన బండిలా మారిపోయారు. ఫలితంగా, జిల్లా రాజకీయ నేతలంతా ఒక్కసారిగా స్తబ్ధతకు లోనయ్యారు. ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు, ప్రజల మధ్యకు వెళ్లేందుకు సరైన టాపిక్ లేక, వేదిక దొరకక సతమతమవుతున్నారు.

పంచాయతీ ఎన్నికల్లో ప్రాధాన్యత ఇస్తామని హామీ

ఖమ్మం జిల్లాను రాజకీయాల గుమ్మంగా చెబుతుంటారు. అలాంటి జిల్లాకు చెందిన నేతలు కమిట్ అయితే, తమ అభ్యర్థిని విజయతీరాలకు చేర్చడానికి రాత్రనక, పగలనక కష్టపడతారు. రాష్ట్రమంతా ఒక్కో తీర్పు ఇస్తే, ఖమ్మం ప్రజలు మాత్రం విలక్షణంగా ఓటేసి, పార్టీలకు కళ్లు తెరిపిస్తారు. కానీ, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ విషయంలో గందరగోళం రాగానే, నేతలంతా మౌనంగా మారిపోయారట. ప్రజల సమస్యలపై గొంతెత్తాల్సిన నాయకులు ఎవరూ కనిపించడం లేదట. కనీసం సమస్యలపై ఏకరు పేట్టుకునేందుకు కూడా ఏ నాయకుడు కనిపించడం లేదట. ఈ క్రమంలోనే జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు, తమ అనుచరులను నిరుత్సాహపడకుండా చేసేందుకు ఏం చేయాలో అది చేస్తున్నారు. ఇన్నిరోజులు పంచాయతీ ఎన్నికల్లో ప్రాధాన్యత ఇస్తామని ముందుకు అడుగులు వేయించారు. కానీ, రిజర్వేషన్ అంశం ఇంకా తేలకపోవడంతో, పదవుల కోసం ఆశించిన నేతలను సంతృప్తి పరచడం కష్టమైపోతోంది. సెకండ్ కేటగిరీ నేతలు కూడా, ఏంది ఈ అయోమయం? అంటూ గోలపెడుతున్నారట. అటు, జిల్లా ప్రధాన ఆలయాల కమిటీల ఏర్పాటులో జాప్యం కూడా అధికార పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా కనిపిస్తోందట.

MLA ఎన్నికల్లో కష్టపడ్డవారికి ఏం దక్కలేదట

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతలు హవా చూపించారు. 10 నియోజకవర్గాల్లో 9 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి, తమ సత్తా చాటారు. కానీ, ఆ నేతలకు ఇప్పటివరకు దక్కిందేం లేదట. ఎన్నికల సమయంలో మాత్రమే పార్టీ వైపు చూసిన గెస్ట్ ఆర్టిస్టులకు పదవులు అందిస్తూ, నిజమైన కాంగ్రెస్ క్యాడర్‌ను పక్కనపెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయట. దాంతో పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని టాక్‌. మంత్రుల పర్యటనల సమయంలో భజన బ్యాచ్ హడావిడి చేస్తుంది కానీ, అసలు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమవుతోందట. ఆరు గ్యారెంటీలతో అదరగొడుతాం అంటూ అధిష్ఠానం ప్రచారం చేస్తున్నా, నేతలు మాత్రం మాకేం పట్టదు అన్నట్టు వ్యవహరిస్తున్నారట. ఇలాగైతే, కాంగ్రెస్‌కు డ్యామేజ్ తప్పదు అంటున్నారట ఎక్స్‌పర్ట్స్‌.

పవర్ పోయే సరికి కండువా మార్చిన గులాబీ నేతలు

ఇక పదేళ్లపాటు అధికారంలో ఉన్న గులాబీ నేతలు.. పవర్ పోయేసరికి కండువా మార్చేశారట. అలా అధికార పార్టీలోకి వచ్చిన వారికి .. మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉంటున్న నేతలకు పడట్లేదట. ఇక గులాబీ నేతల కథ అలా ఉంటే కమలం నేతల తీరు మరోలా ఉందంట. జిల్లాలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం సమాయత్తమతున్న తరుణంలో.. జిల్లాలోని పార్టీ కేడర్ మాత్రం వర్గాలుగా విడిపోయి ప్రజల నాడిని పట్టడంలో విఫలమై సతమతమవుతుందట. ఓవరాల్ గా జిల్లాలోని రాజకీయ నేతలంతా మౌనం వహించడంతో పార్టీలు ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నాయి. సమస్యలపై గళమెత్తేందుకు ఏ నాయకుడు కూడా చురుగ్గా కనిపించడం లేదు. ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్న సీనియర్ నేతలు రాజకీయాలకు దూరంగా ఉండడం, వామపక్షాలు కూడా ఎవరి దారి వారు చూసుకోవడంతో… ప్రజల్లోకి వెళ్లడానికి సరైన టాపిక్ దొరకక పార్టీలన్నీ కూడా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయాయి. మళ్లీ ఎన్నికల సందడి ప్రారంభమైతేకానీ ఆ ఊపు రాదు.

Story by Venkatesh, Big Tv

Related News

Trading Scam: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో రూ. 25 కోట్ల భారీ స్కామ్.. షాక్‌లో బాధితులు..?

Ameenpur Lake: డేంజర్ బెల్స్.. మాయమైపోతున్న అమీన్‌పూ‌ర్ పెద్ద చెరువు..?

కిలాడీ జంట లగ్జరీ లైఫ్ బిల్డప్.. తెరవెనుక కోట్లలో చీటింగ్.. నందూస్ వరల్డ్ జంట అసలు రంగు బట్టబయలు..?

Iran Conflict: ఇజ్రాయెల్‌తో రాజీ.. ఇరాన్‌తో రాజకీయం.. ట్రంప్ ఆడుతున్న ఇంటర్నేషనల్ గేమ్ ఇదే!

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

Big Stories

×