E-Paper
Advertisement

Khammam district:రెబల్స్ రాజకీయం.. ఖమ్మం కాంగ్రెస్ లో ఆందోళన!

Khammam district:రెబల్స్ రాజకీయం.. ఖమ్మం కాంగ్రెస్ లో ఆందోళన!
Advertisement

Khammam district:  పంచాయతీ ఎన్నికల్లో పాత కొత్త నాయకుల మధ్య ఆధిపత్య పోరుతో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ సర్పంచ్ సీట్లు తగ్యాయంట… దాంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు హద్దు దాటుతుందంటున్నారు .. కొందరు నేతలు పార్టీ లైన్ దాటి ప్రత్యర్ధులతో చేతులు కలిపి ,పార్టీకి నష్టం చేకూర్చారంట.. కొందరు నేతల తీరుతోనే పార్టీ మద్దతుదారులుగెలవాల్సిన స్థానాల సంఖ్య తగ్గిందని చెపుతున్నారు.. ఇంతకు ఎవరా నేతలు..వారి కారణంగా జరిగిన నష్టం ఏంటి..?

కాంగ్రెస్‌లో నాయకుల మధ్య ఆధిపత్య పోరు

ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ చైతన్యం కలిగిన జిల్లా..ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటే కాంగ్రెస్ పార్టీ కంచుకోట.. అలాంటి కాంగ్రెస్‌లో నాయకుల మధ్య ఆధిపత్య పోరు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మాత్రం పాములా బుసకొట్టింది.. వీలైతే సొంత పార్టీనే కాటు వేయడానికి సైతం కొందరు నేతలు వెనకాడలేదంట… అందుకు తాజా ఉదాహరణే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు అంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పార్టీ అభ్యర్ధులను గెలిపించుకోవడానికి నానా అవస్థలు పడాల్సివచ్చిందనే టాక్ నడుస్తుంది.

కిందస్థాయి నేతల ఆధిపత్య ధోరణితో పార్టీకి నష్టం

Advertisement

పైకి అంతా బాగానే ఉన్నా కొన్ని నియోజకవర్గాల్లో కిందిస్థాయి నేతల ఆధిపత్య ధోరణితో పార్టీ కి నష్టం వాటిల్లిందని క్యాడర్ అంటోంది. ఈ అధిపత్య పోరు అంశంపై కొందరు ఎమ్మెల్యేలు సైతం అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి రెడీ అవుతున్నారంట. ఈ ఆధిపత్య ధోరణి ముఖ్యంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి , భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉందంట. కొందరు నాయకుల కారణంగా పార్టీ గెలవాల్సిన చోట్ల ఓడిపోవటమే కాకుండా … రాష్ట్రంలోనే అత్యధిక స్థానాలు గెలవాల్సిన చోట సదరు నాయకులు పార్టీకి తీరని అన్యాయం చేశారని అక్కడి ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.

తుళ్ళూరు బ్రహ్మయ్య వర్సెస్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో నేతల మధ్య ఆధిపత్య పోరు రచ్చకు దారి తీస్తుందట. పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్గపోరు డీసీసీబీ మాజీ డైరెక్టర్ తుళ్ళూరు బ్రహ్మయ్య వర్సెస్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నట్టు మారిందంట. గత అసెంబ్లీ ఎన్నికల్లో పినపాక నియోజకవర్గంలో పాయం వెంకటేశ్వర్లు గెలుపు కోసం డీసీసీబీ మాజీ డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య అహర్నిశలు పనిచేశారు. పాయం వెంకటేశ్వర్లు ఎమ్మెల్యేగా గెలిచాక నియోజకవర్గంలో తుళ్లూరు బ్రహ్మయ్య పెత్తనం పెరిగిపోయిందనేది నేతలు మాట్లాడుకుంటున్నారు. దీంతో తుళ్లూరు బ్రహ్మయ్య ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు సమాచారం ఇవ్వకుండా, పార్టీ విధానాలతో సంబంధం లేకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఒంటెద్దు పోకడలు పోతున్నారనే విమర్శలు నియోజకవర్గంలో వెల్లువెత్తుతున్నాయి.

రెబల్స్‌ని రంగంలోకి దింపిన విజయబాబు, బ్రహ్మయ్య

Advertisement

ఈ విషయమై పాయం వెంకటేశ్వర్లు గత కొంతకాలంగా తుళ్లూరు బ్రహ్మయ్య పై గుర్రుగా ఉన్నట్లు టాక్. ఈ కారణంతోనే పంచాయతీ ఎన్నికలలో తుళ్లూరు బ్రహ్మయ్య గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన పరిచయాలతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై రెబల్ అభ్యర్థులను నిలబెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. వారికి మద్దతుగా బ్రహ్మయ్య ప్రచారం కూడా చేసినట్లు చెబుతున్నారు. ఈ ఆధిపత్య పోరు కారణంగానే ఏకగ్రీవం అవ్వాల్సిన చాలా చోట్ల ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిందంట. ఈ ఆధిపత్య పోరుతోనే నియోజకవర్గ పరిధిలోని కొన్ని మండలాలలో బీఆర్ఎస్ ఖాతా తెరవటమే కాకుండా కీలకమైన రెడ్డిపాలెం , బయ్యారంతో పాటు పలు సర్పంచ్ స్థానాల్లో బీఆర్ఎస్ గెలవడానికి అవకాశం లభించిందని ఎమ్మెల్యే వర్గీయులు అంటున్నారు.

సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ తీవ్ర ఆగ్రహం

పినపాక నియోజకవర్గం పరిస్థితి ఇలా ఉండగా సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరోలా ఉందంట. ఇక్కడ ఆధిపత్య పోరుతో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలిచేందుకు అవకాశమించ్చిదంటున్నారు. సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మండలం కాంగ్రెస్‌కు బలమైన ప్రాంతం. అలాంటి మండలంలో బీఆర్ఎస్ కు అత్యధిక స్థానాలు రావడం ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారిందట. ప్రస్తుత ఐడీసీ చైర్మన్ మువ్వ విజయబాబు సత్తుపల్లి నియోజకవర్గంలో కొన్నిచోట కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణమయ్యారని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట.

పార్టీ అభ్యర్ధుల ఓటమికి కారణమైనవారిపై ఆగ్రహం

సత్తుపల్లి మండలం లంకపల్లి మువ్వ స్వగ్రామం ఉండటంతో సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో నాయకులతో మువ్వకు సత్సంబంధాలు ఉన్నాయి. తన వర్గం నాయకులకు ఎమ్మెల్యే సర్పంచ్ టిక్కెట్ నిరాకరించడంతో కాంగ్రెస్ పార్టీ రెబ్బల్స్‌ని ఆయన బరిలో నిలిపినట్టు చెపుతున్నారు. సత్తుపల్లి మండలంలో కాకర్లపల్లి , బెతుపల్లి, చెరుకుపల్లి పంచాయతీలలో రెబల్స్ గెలుపొందటం వెనుక మువ్వ విజయబాబు ఉన్నారు అనే టాక్ వినిపిస్తుంది. సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గెలిచిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులతో విజయోత్సవ సంబరాలు చేసుకుంటుంటే.. ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ మాత్రం పార్టీ అభ్యర్ధుల ఓటమికి కారణమైనవారిపై ఆగ్రహంతో ఊగిపోతున్నారట..

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పరిస్థితిపై క్యాడర్ ఆందోళన

నాయకుల మధ్య అధిపత్యపోరు ఇలాగే కొనసాగితే రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఇబ్బందికరంగా మారుతుందని కాంగ్రెస్ క్యాడర్ ఆందోళన చెందుతోంది. ఏది ఏమైనా నాయకుల మధ్య అంతర్గత పోరుపై అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో? వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు రాబడుతుందో అనేది కాలమే చెప్పాలి.

Story by Ajay, Big Tv

 

Related News

సీఎంగా రేవంత్ ఉన్నంతకాలం కేసీఆర్ అసెంబ్లీకి రారు.. కేటీఆర్ క్లారిటీ!

లీ క్వాన్ యూ ఎవరు? కేసీఆర్‌ను ఆయనతో పోల్చిన కేటీఆర్‌.. అసలు కథ ఇదే!

మేమొచ్చినా.. వెంట‌నే హామీలు అమ‌లు చేయ‌లేం.. ! కుదురుకోవ‌డానికి ఐదారేళ్లు ప‌డుతుందేమో..? ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై కేటీఆర్ కామెంట్స్‌..

ఎంపీ ధర్మపురి అరవింద్‌కు బిగ్ షాక్.. తిరగబడ్డ సొంత పార్టీ నేతలు!

ఇకపై బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీలో కొత్త రూల్స్.. కేంద్రం కొత్త పోర్టల్.. ఇలా అప్లై చేయండి?

జీహెచ్‌ఎంసీలో డబుల్ బిల్లుల భారీ కుంభకోణం.. రూ. 70 కోట్ల నిధులు దారిమళ్లింపు!

రాడు.. రానేరాడు.. వస్తే గిస్తే.. సీఎంగానే వ‌స్త‌డు.. ఏం చేసుకుంట‌రో చేసుకోండి..!

కొండా సురేఖ ఎపిసోడ్‌పై ఏఐసీసీ సంచలన నిర్ణయం!

Big Stories

Advertisement
×