E-Paper
Advertisement

Duvvada Madhuri Audio Case: ఆ ఇద్దరే నా భర్తను కిడ్నాప్ చేశారు! అప్పన్న భార్య చెప్పిన నిజాలు

Duvvada Madhuri Audio Case: ఆ ఇద్దరే నా భర్తను కిడ్నాప్ చేశారు! అప్పన్న భార్య చెప్పిన నిజాలు
Advertisement

Duvvada Madhuri Appanna Audio Case: ఇటీవల దువ్వాడ మాధురి ఓ సంచలన ఆడియోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అందులో దువ్వాడ శ్రీనివాస్‌ అనుచరుడు కింజరాపు అప్పన్నతో తన మధ్య జరిగిన సంభాషణ ఉందని మాధురి తెలిపింది. ఆ ఆడియో సంభాషణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారంది.

అందులో కింజరాపు అప్పన్న, దువ్వాడ శ్రీనివాస్‌పై దాడి చేయడానికి ప్లాన్ జరుగుతోందని.. సంచలన వ్యాఖ్యలు చేసినట్టు మాధురి వెల్లడించింది. ఈ దాడి నరసన్నపేట దగ్గర కానీ, నిమ్మాడ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో జరగవచ్చని అప్పన్న ఆడియోలో హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఈ ఆరోపణలకు దువ్వాడ శ్రీనివాస్ కొద్దిరోజుల క్రితం తీవ్రంగా స్పందించారు. తనపై దాడి చేస్తామంటూ బెదిరింపులు చేస్తున్నారని, అయితే ఇలాంటి బెదిరింపులకు తాను ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడబోనని స్పష్టం చేశారు. దమ్ముంటే ఎదురుగా వచ్చి కొట్టాలి అంటూ నిమ్మాడ హైవేపై దువ్వాడ హల్‌చల్‌ చేశారు. ఇలాంటి బెదిరింపులకు తగ్గేది లేదని దువ్వాడ కౌంటర్ ఇచ్చారు.

ఇదిలా ఉంటే.. దువ్వాడ మాధురి, అప్పన్న ఆడియో కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. తన భర్త కనిపించడం లేదంటూ శ్రీకాకుళం ఎస్పీకి అప్పన్న భార్య ఫిర్యాదు చేసింది. సోమవారం నుంచి అప్పన్న కనిపించడం లేదంటూ కంప్లైంట్ లో పేర్కొంది. ఎవరో ఇద్దరు వచ్చి తీసుకెళ్లారంటూ ఎస్పీకి తెలిపింది. అయితే ఎంక్వైరీ కోసం తీసుకెళ్లారా లేక కిడ్నాప్ చేశారా అన్నది తెలియాల్సి ఉంది.

Advertisement

తన భర్తకి ప్రాణహాని ఉంది అంటూ కన్నీరు పెట్టుకుంటోంది. ఈ రాజకీయాలకు తాము బలైపోతున్నామంటూ వాపోయింది. ఏడాదిన్నర నుంచి సొంత ఊరిలో అడుగుపెట్టలేకపోతున్నామంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

Related News

పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్‌.. సీఎం సతీశన్ మనసులోని మాట

బిగ్ టీవీ ఎఫెక్ట్.. ముగ్గురు అధికారులపై వేటు, ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినికి గర్భం

డీఎస్సీ రచ్చపై నోరు విప్పిన జనసేన.. ఐదేళ్లలో మీరేం చేశారంటూ వైసీపీని ప్రశ్నించిన మంత్రి దుర్గేష్

బొత్సకు దెబ్బ మీద దెబ్బ.. బెల్లానకు విజయనగరం జిల్లా బాధ్యతలు, వైసీపీ హైకమాండ్ కీలక నిర్ణయం

ఆటోను ఢీ కొట్టిన లారీ.. స్పాట్ లో ముగ్గురు మృతి, విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

చవితి ముసురు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున నుంచి..

జనసేన కొత్త వ్యూహం.. గ్రామీణ ప్రాంతాల్లో జెండా పాతేందుకు పక్కా ప్లాన్!

హారన్ కొట్టాడని బస్సెక్కి డ్రైవర్‌ను బాదేశాడు.. పెనుమాకలో బైకర్ దౌర్జన్యం!

Big Stories

Advertisement
×