BigTV English
Advertisement

Kolikapudi Srinivasa Rao: ఇవేం పనులు.. పార్టీ నుండి కొలికపూడి సస్పెండ్..?

Kolikapudi Srinivasa Rao: ఇవేం పనులు.. పార్టీ నుండి కొలికపూడి సస్పెండ్..?

Kolikapudi Srinivasa Rao Suspended From TDP Party: మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అనూష్యంగా టికెట్ దక్కించుకుని సీనియర్ ప్రత్యర్ధిపై విజయం సాధించారు. పార్టీ కూడా పవర్‌లోకి వచ్చింది. ఉద్యమ నేపధ్యం ఉన్న సదరు ఎమ్మెల్యే ప్రజలకు అండగా ఉండాల్సి పోయి తానే ఆ నియోజకవర్గ ప్రజలకు సమస్యగా మారుతున్నారు. అధికారంలో ఉన్నం ఏం చేసినా చెల్లుతుందని ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారంట దాంతో ఆ సొంత నియోజకవర్గ ప్రజలే రోడ్డెక్కి ఆ ప్రజాప్రతినిధికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. పార్టీ పెద్దలను కలిసి మాకీ ఎమ్మెల్యే వద్దని ఫిర్యాదులు చేస్తున్నారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు..? అప్పుడే ఆయనపై అంత వ్యతిరేకత ఎందుకొచ్చింది?


కృష్ణా జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అమరావతి ఉద్యమంలో ఫోకస్ అయిన దళిత నేత.. అమరావతి టాపిక్ వస్తే చాలు టీవీ డిబేట్లలో ప్రత్యక్షమవుతారు. గ్రీన్ కలర్ తలపాగా కట్టుకుని ఉద్యమ స్ఫూర్తి చూపిస్తూ చెలరేగేవారు .. అమరావతి రాజధాని పట్ల ఆయన నిబద్దత చూసి తెలుగుదేశం పార్టీ ఏరికోరి టికెట్ ఇచ్చింది. తిరువూరు ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గంలో 1994 నుంచి నల్లగట్ల స్వామిదాసు టీడీపీకి పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. స్వామిదాసు గత ఎన్నికల ముందు కేశినేని నాని వెంట వైసీపీలో చేరడంతో టీడీపీకి అభ్యర్ధి కరువయ్యారు.

దాంతో ప్రస్తుత విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని తన అన్న నాని టీమ్‌ని ఓడించడానికి కొలికపూడి పేరు అధిష్టానానికి సిఫార్సు చేశారు. కొలికపూడ వాగ్ధాటి చూసి పార్టీకి పనికొస్తారని భావించి చంద్రబాబునాయుడు అతనికి టికెట్ ఇచ్చారు. కూటమి వేవ్‌లో కొలికపూడి మంచి మెజార్టీతో గెలిచారు. అమరావతి ఉద్యమనేతగా ఫోకస్ అయిన ఆయన్ని తిరువూరు ఓటర్లు అంతలా ఆదరిస్తే గెలిచాక ఆయన తనలోని మరోకోణం చూపిస్తున్నారంట. సమస్యలు చెప్పుకుందామని వెళ్లిన మహిళలను లైంగికంగా వేధింస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.


ఎమ్మెల్యే కొలికపూడి శ్రీను ఆగడాలు నియోజకవర్గంలో మితిమీరిపోయాయంటున్నారు. అధికారం చేతిలో ఉందికదా అని రెచ్చిపోతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పేకాట శిబిరాల ఏర్పాటులో ఆయన ఎక్కువ వాటా డిమాండ్ చేస్తున్నారంట. ఒకవేళ ఇవ్వకుంటే భాగస్వామిపై కేసుల అస్త్రం ప్రయోగిస్తున్నారట. ఇటీవల చిట్టేల సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావుపై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మనస్థాపానికి గురైన ఆయన భార్య ఆత్మహత్యా యత్నం చేసి ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నారు. అలానే ఎ.కొండూరుకు చెందిన ఒకరి దగ్గర ఎన్నికల కోసం కోటి రూపాయలు తీసుకున్న కొలికపూడి ఎమ్మెల్యే అయ్యాక కొలికపూడి రూ.20లక్షలు మాత్రమే ఇచ్చి దిక్కున్న చోటు చెప్పుకోమని అన్నారట.

Also Read: బావ.. నీ బండారం బయట పెడతా.. వైవీకి బాలినేని వార్నింగ్

తాజాగా మహిళలు సమస్యలు చెబుదామని ఎమ్మెల్యే కొలికపూడి దగ్గరకు వెళితే వారిని లైంగికంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి. దీంతో మహిళలు తమ సమస్యలను చెప్పుకునేందుకు ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లాలంటే భయపడుతున్నారంట. ఎమ్మెల్యే ఆగడాలు మితిమీరడంతో ఇటు టీడీపీ కార్యకర్తల్లో అటు సామాన్య ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .. వారంతా రోడ్డెక్కి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు.

ఎమ్మెల్యే కొలికపూడిని వెంటనే సస్పెండ్ చేయాలని తిరువూరు టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఓట్లేసి గెలిపించుకున్న ప్రజలే ఇప్పుడు ఛీ ఆ ఎమ్మెల్యే మాకొద్దు .. అంటున్నారు. అసలు కొలికపూడి తమకు ఎమ్మెల్యేగా వద్దంటూ బాహాటంగానే చెప్పేస్తున్నారు. ఎమ్మెల్యే కొలికపూడిపై వచ్చిన లైంగిక ఆరోపణలపై విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని విజయవాడలో ధర్నా నిర్వహించి. తర్వాత మంగళగిరి టీడీపీ సెంట్రల్ ఆఫీసుకు వెళ్లి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి అచ్చెన్నాయుడులను కలిసి ఫిర్యాదు చేశారు .. పార్టీకి నష్టం కలిగించడంతో పాటు కేడర్‌ని, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఆ క్రమంలో ఎమ్మెల్యే కొలికపూడి వివాదం టీడీపీ హైకమాండ్ వద్దకు చేరినట్లు తెలిసింది. అసలు ఆయన పనితీరు, ఆయన నియోజకవర్గం ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉన్నారు అనేదానిపై ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి అభిప్రాయసేకరణ చేసినట్లు చెప్తున్నారు. ప్రజలంతా కొలికపూడికి వ్యతిరేకంగా ఓటువేశారంట. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పారంట. ఈ అభిప్రాయ సేకరణ అధినేత చంద్రబాబు వద్దకు చేరినట్లు తెలుస్తోంది. పార్టీ షోకాజ్ నోటీసులు కొలికపూడికి జారీచేసే అవకాశాలున్నట్లు సమాచారం. మరి చూడాలి ఈ ఎపిసోడ్ ఏ టర్న్ తీసుకుంటుందో?

 

Related News

India VS Pakistan: పవర్‌ఫుల్‌గా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్! యుద్ధం ఖాయమేనా?

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

KCR Campaign: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ రానట్లేనా?

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌లో.. కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం

Donald Trump: ఎవరీ జొహ్రాన్‌ మమ్దానీ? న్యూయార్క్ మేయర్ బ్యాక్ గ్రౌండ్ ఇదే

Suicide Incidents: బతకండ్రా బాబూ! అన్నింటికీ ఆత్మహత్యే పరిష్కారమా?

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Jubilee Hills Bypoll: నవంబర్ సెంటిమెంట్.. బైపోల్స్‌లో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా!

Big Stories

×