Big Stories

Flipkart Big Saving Days Sale: ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ల వర్షం.. ఆ ఫోన్ ధర మరీ అంత తగ్గడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా!

Flipkart Big Saving Days Sale 2024: ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభించనుంది. సేల్ మే 3 న ప్రారంభమై మే 9 వరకు కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఇటీవలే లాంచ్ అయిన మోటరోలా ఎడ్జ్ 50 ప్రో 5Gపై భారీ ఆఫర్ ప్రకటించింది. ఫోన్‌ మార్కెట్‌లో లాంచ్ చేసినప్పుడు 8GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 31,999గా ఉంది. అయితే సేల్‌లో భాగంగా ఫోన్ ధరను తగ్గించింది. ఇప్పుడు మీరు రూ.27,999 చెల్లించాలి కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా సరసమైన ధరలలో అనేక స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఫోన్ ఆఫర్లు, ఫీచర్లు తదితర విషయాలు తెలుసుకోండి.

- Advertisement -

మోటరోలా  Edge 50 Proని AI ఫీచర్లతో నెల ప్రారంభంలో విడుదల చేసింది. ఫోన్ ప్రారంభించిన సమయంలో దీని ధర చాలా ఎక్కువగా ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సమయంలో ఇది తక్కువ ధరకు అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌పై అనేక డిస్కౌంట్లు కూడా ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ ఫ్లిప్‌కార్ట్‌లో లైవ్ అవుతుంది.

- Advertisement -

Also Read: రూ.10 వేలల్లో భలే మంచి టీవీలు.. ఒక్కోదానికి లక్షల్లో రేటింగ్స్!

మోటరోలా ఎడ్జ్ 50 ప్రోని ప్రారంభించిన సమయంలో 8GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 31,999 ఉండగా రూ.4000 డిస్కౌంట్ అందిస్తుంది. దీని ప్రకారం ఫోన్‌ను రూ.27,999లకు కొనుగోలు చేయవచ్చు. అంతే కాకుండా HDFC క్రెడిట్ కార్డుపై అదనంగా రూ. 2000 వరకు డిస్కౌంట్ అందిస్తుంది. నో కాస్ట్ EMI ద్వారా కూడా ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

ఇక ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇందులో 6.7 అంగుళాల P-OLED డిస్‌ప్లే 144Hz, HDR10+, 2000 nits పీక్ బ్రైట్‌నెస్, 1220 x 2712 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో ఉంటుంది. దీని డిస్‌ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. Adreno 720 GPUతో 4nm వద్ద పనిచేసే Snapdragon 7 Gen 3 చిప్‌సెట్  ప్రాసెసర్ Motorola Edge 50 Pro ఫోన్‌లో ఉంటుంది. ఇదిAndroid 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.

Also Read: ఇదేందయ్యా ఇది.. ఇదేడా చూడలే.. రూ. 350లకే స్మార్ట్‌ఫోన్!

ఇందులో 50MP (OIS) ప్రైమరీ సెన్సార్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 10 MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఇది 13MP అల్ట్రా-వైడ్ లెన్స్‌తో కూడా వస్తుంది. సెల్ఫీ కోసం 50MP 4K@30fps, 1080p@30/60fps లెన్స్ అందించబడ్డాయి. పవర్ కోసం ఫోన్‌లో 4500 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 125 వాట్ల వైర్డు ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ 18 నిమిషాల్లో 100 శాతం ఛార్జ్ అవుతుంది. ఇది 50W వైర్‌లెస్, 10W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News