Big Stories

TS SSC Results 2024 : తెలంగాణ టెన్త్ రిజల్ట్స్ వచ్చేశాయ్.. ఆ సబ్జెక్టుల్లో ఎక్కువమంది ఫెయిల్

Telangana 10th Results : తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు ఫలితాలను పదోతరగతి పరీక్షల బోర్డు అధికారిక వెబ్ సైట్ https://results.bsetelangana.org/ లో చెక్ చేసుకోవచ్చు. 91.31 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

- Advertisement -

టెన్త్ ఫలితాల్లోనూ బాలికలే అత్యధిక ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. టెన్త్ ఫలితాల్లో బాలికలు 93.23 శాతం ఉత్తీర్ణులవ్వగా, 89.42 శాతం మంది బాలురు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. 3,927 స్కూళ్లలో విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణులైనట్లు పేర్కొన్నారు. కాగా.. పదోతరగతి పరీక్షల్లో ఎక్కువ మంది విద్యార్థులు లెక్కలు, సైన్స్ సబ్జెక్టుల్లోనే ఫెయిల్ అయినట్లు చెప్పారు. 6 స్కూళ్లలో జీరో ఫలితాలు వచ్చాయని, ఆ స్కూళ్లన్నీ ప్రైవేటు విద్యాసంస్థలేనని పేర్కొన్నారు. 8,883 మంది విద్యార్థులకు 10/10 GPA వచ్చినట్లు వివరించారు.

- Advertisement -

పదోతరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. నిర్మల్ జిల్లాలో 99.09 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ సెక్రటరీ వెల్లడించారు. వికారాబాద్ జిల్లాలో అత్యల్ప ఉత్తీర్ణత నమోదైనట్లు తెలిపారు. ఈ జిల్లాలో 65.10 శాతం మంది విద్యార్థులే ఉత్తీర్ణులయ్యారు. ఫెయిలైన విద్యార్థులకు జూన్ 3 నుంచి 13 వరకూ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని తెలిపారు. పది పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా.. మళ్లీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు.

2023-24 విద్యాసంవత్సరానికి గాను మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకూ టెన్త్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 5 లక్షల 8 వేల 385 మంది స్టూడెంట్స్ హాజరయ్యారు. వీరిలో 2 లక్షల 57 వేల 952 మంది బాలురు, 2 లక్షల 50 వేల 433 మంది బాలికలున్నారు. ఇక ఈ ఏడాది నుంచి తెలంగాణ టెన్త్ మార్క్స్ మెమోలపై విద్యాశాఖ పర్మినెట్ ఎడ్యుకేషన్ నెంబర్ (P.E.N) ను ముద్రించనుంది. 11 అంకెలతో ముద్రించే ఈ నంబర్ సెక్యూరిటీ ఫీచర్లను కలిగి ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News