BigTV English

Formula E Race Case: ‘కారు’ కథలు.. ఫార్ములా రేస్ స్కామ్‌‌ను సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారా? ఈ ప్రశ్నలకు బదులేది?

Formula E Race Case: ‘కారు’ కథలు.. ఫార్ములా రేస్ స్కామ్‌‌ను సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారా? ఈ ప్రశ్నలకు బదులేది?

ఫార్ములా ఈ రేసింగ్ అవకతవకలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇందులో ఏం జరిగింది? ప్రభుత్వానికి ఎలా నష్టం వచ్చింది? స్పాన్సర్ గ్రీన్ కో ఎందుకు తప్పుకుంది? HMDA అకౌంట్ నుంచి డబ్బుల్ని ఎందుకు ట్రాన్స్ ఫర్ చేయించారు? ఇలాంటివి కీలకంగా ఉన్నాయి. ముందుగా కేటీఆర్ పై ఏసీబీ నమోదు చేసిన FIRలో ఏముందో చూద్దాం. ప్రభుత్వ నిధులు 54 కోట్ల 88 లక్షల 87వేల 43 రూపాయలను అక్రమంగా యూకేకి చెందిన ఎఫ్ఈఓ ఫార్ములా ఈ ఆపరేషన్ లిమిటెడ్ కంపెనీ బదిలీ చేశారని, రెండు విడతల్లో ఈ చెల్లింపులు జరిగాయన్నది FIRలో ఉంది.


విదేశీ కంపెనీకి చెల్లింపుల కారణంగా హెచ్ఎండీఏకు 8కోట్ల 6 లక్షల 75వేల 404 అదనపు పన్ను భారం పడింది. 10 కోట్లకు మించి బదిలీ జరిగితే ప్రభుత్వం, ఆర్థిక శాఖ అనుమతి అవసరం. సీజన్ 10 ఫార్ములా ఈ రేసింగ్ కు స్పాన్సర్స్ లేకపోవడంతో హెచ్ఎండీ నిధుల్నే మళ్లించారు. 54.88 కోట్ల రూపాయలు నిధులు దుర్వినియోగం చేశారు. పైగా 2023 అక్టోబర్ 9 నుంచి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సమయంలో చెల్లింపులు జరిపారు. ఎలక్షన్ కమిషన్ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఈ చెల్లింపులు చేశారు. ఇదీ FIRలో ఉన్న మ్యాటర్. వీటికి కేటీఆర్ దగ్గర్నుంచి డైరెక్ట్ ఆన్సర్ లేకుండా పోయింది.

అసలు లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయి. ఇందులో అవినీతి ఎక్కడ ఉంది.. ఏసీబీ ఎందుకు అని కేటీఆర్ అంటున్నారు. కానీ ఇందులోనే అసలు కథ దాగి ఉంది. స్పాన్సర్ గా ఉన్న గ్రీన్ కో ఎందుకు తప్పుకున్నదో తెలియదు. మధ్యలోనే తప్పుకుంటే అగ్రిమెంట్ ప్రకారం ఎందుకు అడగలేదన్న దానికి కేటీఆర్ నుంచి జవాబు లేదు. స్పాన్సర్ పోయాడు.. ఎన్నికలు అయ్యాక, ఎలాగూ తిరిగి అధికారంలోకి వస్తామన్న కాన్ఫిడెన్స్ తో కొత్త స్పాన్సర్ తీసుకొద్దామనుకున్నట్లు కేటీఆర్ సింపుల్ గా చెప్పారు.


చూశారుగా కేటీఆర్ అంటున్న మాట. ఎలాగూ వస్తామన్న కాన్ఫిడెన్స్ తోనే HMDA నిధుల్ని విదేశీ కంపెనీకు బదలాయించారు. అంటే సొంత అకౌంట్ కాదు.. ప్రజల ధనాన్ని పంపించారు. అరవింద్ కుమార్ కాదు.. తనదే బాధ్యత అన్నారు కేటీఆర్. ఇందులో ప్రశ్నలు ఏంటంటే బీఆర్ఎస్ కు వేల కోట్ల పార్టీ విరాళాలు తెచ్చుకున్నప్పుడు 100 కోట్లు ఇచ్చే స్పాన్సర్ కేటీఆర్ కు దొరకలేదా? అమర్ రాజానో మరొకరో అని చెప్పారు కదా.. అప్పుడే వారిని ఎందుకు తీసుకురాలేకపోయారు? నష్టపోతారని తెలిసే ఎవరినీ ఆహ్వానించలేదా? లాభాలు వచ్చి ఉంటే స్పాన్సర్ షిప్ కు పోటీ ఉంటుందని ఎవరికైనా తెలిసిన మ్యాటరే. దీనికి జవాబు ఏది?

కేటీఆర్ అంటున్నదేంటంటే.. ఇది కామన్ వెల్త్ మాదిరి ప్రభుత్వమే చొరవ తీసుకుని పెట్టిన రేసింగ్ అంటున్నారు. మరి ఇది కరెక్టా అంటే కానే కాదు. మిగితా గేమ్స్ కు ఈ ఈ రేస్ కు సంబంధమే లేదు. ఎందుకంటే ఇక్కడ మూడు పార్టీల మధ్య అగ్రిమెంట్ స్పష్టంగా ఉంది. మౌలిక సదుపాయాలు కల్పించడం వరకే ప్రభుత్వం ఖర్చు పెట్టాలి. మిగితాది స్పాన్సర్ చూసుకోవాలి. కానీ ఇక్కడ స్పాన్సర్ అవుట్, గవర్నమెంట్ ఇన్ అయింది. పైగా తప్పుకున్న స్పాన్సర్ ను ఈజీగా వెళ్లిపోండని చెప్పడమే ఇక్కడ హైలెట్.

ఫార్ములా ఈ రేస్ 9, 10, 11, 12 సీజన్లను హైదరాబాద్ లో జరపాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో కష్టపడి మొదటి రేస్‌ ను గతేడాది ఫిబ్రవరి 11న నిర్వహించారు. కానీ పదో సీజన్ దగ్గర పీఠముడి పడింది. నిజానికి ఈ రేస్ ఇలా ఆగిపోవడానికి కారణం స్పాన్సర్ గా ఉన్న గ్రీన్ కో ఇందులో నుంచి అర్ధాంతరంగా తప్పుకోవడమే. నిజానికి ఈ సంస్థ 110 కోట్లు రేసింగ్ కోసం పెట్టుబడి పెట్టిందంటున్నారు. టిక్కెట్ల విక్రయం ఇతరత్రా చర్యలతో కొంత వరకు రాబట్టుకున్నా చాలా నష్టాలే మిగిలాయన్న టాక్ నడుస్తోంది. సరే గ్రీన్ కో లాభం కోసం కాదు.. ప్రపంచవ్యాప్తంగా తమ కంపెనీకి పేరు వస్తుందన్న ఉద్దేశంతో ఇందులో పెట్టుబడి పెట్టిందనుకుందాం. కేటీఆర్ చెబుతున్నట్లుగా ఫార్ములా ఈ రేస్ తో హైదరాబాద్ కు ఇండియాకు చాలా పేరు వచ్చి ఉంటే.. గ్రీన్ కోకు కూడా అదే స్థాయిలో పేరు వచ్చి ఆర్డర్స్ పెరిగి ఉండేవి.

ఇది చిన్న కంపెనీ ఏమీ కాదు. రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో పేరున్న కంపెనీ ఇది. ఫస్ట్ సీజన్ హిట్ అయి ఉంటే ఇంటర్నేషనల్ గా ఎదిగే ఛాన్స్ ఉంటుందనుకున్నారు. కానీ అలా జరగలేదు. పది, 11, 12 సీజన్లలో పెట్టుబడి పెడితే నిండా మునుగుతామనుకున్నారో.. లేదంటే FEOతో సెట్ కాలేదో తెలియదు గానీ తప్పుకుంది. అయితే ఇక్కడ వచ్చే ప్రశ్న ఏంటంటే.. ఇదే కేటీఆర్ అదే గ్రీన్ కో సంస్థను ఎందుకు ఒప్పించలేకపోయారు? పైగా గ్రీన్ కో వెళ్లిపోతానంటే ఎందుకు ఒప్పుకున్నారు? నిజానికి ఫార్ములా ఈ, గ్రీన్ కో గ్రూప్, తెలంగాణ ప్రభుత్వం ఈ మూడింటి మధ్య నాలుగేళ్ల రేస్ కోసం అగ్రిమెంట్ మొదటే కుదిరింది. కానీ గ్రీన్ కో వెళ్లిపోతానంటే నోటీసు ఏది? ఫైన్ ఏది? అగ్రిమెంట్ ప్రకారం ఎందుకు ఫాలో కాలేదు? ఆ స్థానంలో ప్రభుత్వ డబ్బును మంచినీళ్లలా పోతే పోనీ అని ట్రాన్స్ ఫర్ చేయించారా? ఇవన్నీ కేటీఆర్ నుంచి ఆన్సర్ లేని ప్రశ్నలు.

Also Read: దొంగ పాస్ పుస్తకాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రూ.22 వేల కోట్లు చెల్లించారు: సీఎం రేవంత్

కేటీఆర్ చెప్పిన మరో మాటఏంటంటే.. ఫార్ములా ఈ రేస్ సౌకర్యాలకు hmda, గ్రీన్ కో జాయింట్ గా 150 కోట్లు ఖర్చు పెడితే 7వందల కోట్ల బెనిఫిట్ జరిగిందని, అంటే 550 కోట్లు అదనంగా లాభం జరిగిందన్నట్లు నీల్సన్ అనే సంస్థ రిపోర్ట్ ఇచ్చిందన్నారు. అంటే టిక్కెట్ల అమ్మకం, ప్రత్యక్ష ప్రసారం చూడడం ద్వారా, హోటల్స్ అకామడేషన్, ఫ్లైట్స్ ఇవన్నిటితో బెనిఫిట్ జరిగిందంటున్నారు. బయటి నుంచే ఎక్కువ మంది వచ్చి చూశారన్నారు. కానీ వీటిని పక్కాగా క్రాస్ చెక్ చేసేదెవరు? ఇంత అద్భుతంగా జరిగితే ఇంటర్నేషనల్ కంపెనీ గ్రీన్ కో స్పాన్సర్ షిప్ నుంచి ఎందుకు తప్పుకుంటుంది. పైగా లైవ్ టెలికాస్ట్ తో విదేశీ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీకే బెనిఫిట్ జరిగింది. ఇందులో హైదరాబాద్ కు తెలంగాణ ప్రభుత్వానికి వచ్చింది గుండు సున్నా. 30 వేల మంది స్పెక్టేటర్స్ వస్తే చాలా వరకు బయటి వారే అన్నారు. అంత పెద్దమొత్తంలో బయటి నుంచి వచ్చే పరిస్థితి ఉంటుందా అన్నది ప్రశ్న.

కేటీఆర్ గొప్పగా చెప్పుకున్న ఫార్ములా ఇ రేసింగ్ తో హైదరాబాద్ కు కొత్తగా పేరు రావడం మాట అటుంచితే.. ఉన్న పేరు పోయేలా ఛాంపియన్ షిప్ నిర్వహించారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. రేసింగ్ లో పాల్గొనే డ్రైవర్లు ట్రాక్ పై సంతృప్తి వ్యక్తం చేసినా… వాష్ రూములు బేకార్ ఉన్నాయని కంప్లైంట్లు ఇచ్చారు. వరల్డ్ క్లాస్ రేసింగ్ డ్రైవర్లకు కల్పించే సౌకర్యాలు ఇవేనా? ఇదొక కంప్లైంట్ అంటే.. ఇక రేసింగ్ ను చూడ్డానికి వచ్చిన వారి బాధలు అన్నీ ఇన్నీ కావు. వేల రూపాయలు పెట్టి టిక్కెట్ కొని రేస్ చూడ్డానికి వచ్చిన వారికి చుక్కలు కనిపించాయి. వీఐపీల దగ్గర్నుంచి సామాన్యుల దాకా ఫుడ్, వాటర్ కూపన్స్ కోసం పెద్ద యుద్ధాలు చేయాల్సి వచ్చింది. మరి ఇంత చేసి హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంక్ బండ్ దగ్గర నిర్వహించిన రేస్ తో సగటు హైదరాబాదీలు ట్రాఫిక్ తిప్పలతో చాలా ఇబ్బందులు పడ్డారు. (స్పాట్)

అసలు ఫార్ములా రేసింగ్ లతో ఇంటర్నేషనల్ అటెన్షన్ గ్రాబ్ చేయాలనుకోవడం వర్కవుట్ కాలేదని గత అనుభవాలు చెప్పాయి. మన పేరు మార్మోగేలా చూసేందుకు ఫార్ములా ఈ రేస్ ముఖ్య ఉద్దేశమని కేటీఆర్ చెబుతూ వస్తున్నారు. కానీ మన దగ్గర ఈ రేసింగ్ కు కనెక్ట్ అయ్యేది ఎందరు..
ఏదైనా ఈవెంట్ కు లోకల్ గా సెంటిమెంటల్ స్ట్రాంగ్ బేస్ ఉంటేనే సక్సెస్ అవుతుంది.
పెట్టుబడుల సంగతి పక్కన పెట్టండి..
కొన్ని దేశాలకు కొన్ని స్పోర్ట్ ఈవెంట్లే సూట్ అవుతాయి..
ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఎన్ని ప్రయత్నాలు చేసినా క్రికెట్ వర్కవుట్ కాదు
మన దగ్గర ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫుట్ బాల్ లేవట్లేదు
సరిగ్గా ఇదే ఫార్ములా ఈ రేసింగ్ కూ కనెక్ట్ అవుతుంది.
ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కే రేసింగ్ లు నచ్చుతాయి
అఫ్ కోర్స్ మోటార్ స్పోర్ట్స్ ఫ్యాన్స్ మన మెట్రో సిటీస్ లో కచ్చితంగా ఉంటారు. కానీ అది లిమిటెడ్.
అలవాటు చేస్తే కొంత వరకు అటు టర్నవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
కానీ వీటిని చూసి విదేశీ పెట్టుబడులు వస్తాయన్నది ఒక ఆశ మాత్రమే. కచ్చితంగా జరుగుతుందన్న గ్యారెంటీ లేదు.
చెప్పాలంటే ఇది ఒక ప్రయోగం మాత్రమే.

టెంపరరీ ట్రాక్స్ వేయడం, అదికూడా హైదరాబాద్ నడిబొడ్డున ట్రాక్స్ తో ఈవీ రేసింగ్ ఫుల్ టైమ్ సాధ్యమని నమ్మడమే పెద్ద మైనస్.
టెంపరరీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ తో ఏదీ సాధ్యం కాదు.
పర్మినెంట్ ట్రాక్స్ వేసిన యూపీనే దశాబ్దం క్రితం ఈ మోటార్ స్పోర్ట్ ఈవెంట్ ను ముందుకు తీసుకెళ్లలేక చేతులెత్తేసింది.
మనదేశంలో ఫార్ములా రేసింగ్ పై బ్యాడ్ ఎక్స్ పీరియన్సెస్ ఉన్నాయి.
2013లో ఫార్ములా వన్ గుడ్ బై చెప్పేసింది.
ప్రమోటర్స్ చేతులెత్తేశారు.
స్పాన్సర్స్ రాలేదు.
ఎవరైనా రూపాయికి రూపాయిన్నర వస్తుందంటేనే ముందుకొస్తారు. ఏదీ రాకపోతే ఎందుకొస్తారు.
అందుకే 2013 తర్వాత ఏ రాష్ట్రం కూడా రేసింగ్ వైపు కన్నెత్తి చూడలేదు.
స్కోప్ ఉన్న ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఇవేవీ ఆసక్తి చూపలేకపోయాయి.
కనీసం వాటిని కూడా దృష్టిలో పెట్టుకోకపోవడం మైనస్.

నిజానికి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందే మార్గాలు చూడాలి. కానీ ఒకేసారి ఎక్కువ మొత్తం పెట్టి తర్వాత పైసా వసూల్ అంటే సంపన్న దేశాలకు ఇది వర్కవుట్ అవుతుంది. మనకు కాదు. ఒక ప్రయత్నం చేయడం తప్పు కాదు. కానీ ఇర్రెగ్యులారిటీస్ ఉండడం ఈ ఎపిసోడ్ లో బూమరాంగ్ అయింది. డ్రా బ్యాక్ గా మారిందంటున్నారు.
పైగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి చాలా మార్గాలు ఉన్నాయి.
వాటిని పట్టుకోకుండా రేసింగ్ అందులోనూ ఎలక్ట్రిక్ వెహికిల్ రేసింగ్ ను ఎంచుకున్నారు.
నిజానికి ఫార్ములా వన్, అండ్ టూకి ఎక్కువ క్రేజ్ ఉంటుంది.
వాటికే వరల్డ్ వైడ్ అటెన్షన్ ఉంటుంది.
కానీ ఎలక్ట్రిక్ వెహికిల్స్ చుట్టూ భవిష్యత్ ప్రపంచం ఉండబోతోందని, వాటికి మంచి బూస్టప్ వస్తుందని, తెలంగాణలో ఈవీ ఎకోసిస్టమ్ రూపొందించాలనుకుని దీన్ని టేకప్ చేశామని కేటీఆర్ అంటున్నారు.
మరి దీనికి చేయాల్సింది ఫార్ములా ఇ- రేస్ పెట్టడమే సొల్యూషనా? అంటే కానే కాదు..
ఎందుకంటే ఫస్ట్ తెలంగాణను ఈవీకి సెంటరాఫ్ అట్రాక్షన్ గా మార్చాలనుకుంటే ది బెస్ట్ పాలసీ ఇక్కడ అడాప్ట్ చేసుకోవాలి.
2020లో తెలంగాణలో ఇదే కేటీఆర్ ఈవీ పాలసీ తీసుకొచ్చారు.
అసలు ఎలక్ట్రిక్ వెహికిల్ కొందామా వద్దా అని ఆలోచించుకునే వారికి అది ఏమాత్రం ఉపయోగకరంగా లేకుండా పోయిందన్న విమర్శలు వచ్చాయి. కొంత వరకే బెనిఫిట్స్ ఇచ్చినట్లే ఇచ్చి చేతులు దులుపుకున్నారు.
కానీ సమగ్ర ఈవీ పాలసీ కోసం ఇటీవలే రేవంత్ సర్కార్ జీవో 41ని తీసుకొచ్చింది. ఇందులో రోడ్‌ ట్యాక్స్, వాహన రిజిస్ట్రేషన్‌ ఫీజును 100 శాతం మినహాయించారు. ఇది 2026 డిసెంబర్ 31 వరకు అమలు చేస్తారు. సో ఇలా ఉంటే సిటీ అంతా ఈవీకి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కానీ ఇ-రేసింగ్ తో మొత్తం మారిపోతుందని, హైదరాబాద్ పేరు మార్మోగుతుందని చెప్పి ఓ విఫల ప్రయోగం చేసి, రూల్స్ పాటించకుండా, ప్రభుత్వ ధనాన్ని వృధా చేయడం ద్వారా ఇప్పుడు ఏసీబీ కేసులో కేటీఆర్ A1గా ఇరుక్కోవాల్సి వచ్చింది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×