BigTV English
Advertisement

Bangalore Accident : కారుపై పడ్డ భారీ కంటైనర్.. నుజ్జునుజ్జు అయిపోయిన కారు.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి..

Bangalore Accident : కారుపై పడ్డ భారీ కంటైనర్.. నుజ్జునుజ్జు అయిపోయిన కారు.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి..

Bangalore Accident :  బెంగళూరు శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ప్రయాణిస్తున్న ఓ కారుపై అత్యంత బరువైన కంటైనర్ ట్రక్కు(Container Truck) పడడంతో నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం విషాదం. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..


బెంగళూరులోని జాతీయ రహదారి 4 పై(National Highway 4) ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నేలమంగళ తాలుకా తాలేకేర్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. రహదారిపై ప్రయాణిస్తున్న సమయంలో కంటైనర్ ట్రక్, కారు ప్రయాణిస్తున్నాయి. ఇదే సమయంలో ఎదురుగా ఉన్న పాలవ్యాన్ ను కంటైనర్ ట్రక్ ఢీ కొట్టింది. ఈ రెండింటి మధ్యలో కారు ఉండడంతో.. కారుకు ప్రమాదం(Car Accident) జరిగింది. ఆ తర్వాత.. కంటైనర్ ట్రక్ అదుపుతప్పి కారుపై పడిపోయింది.  దీంతో.. కారులోని ప్రయాణిస్తున్న కుటుంబం మొత్తం మరణించారు.

కంటైనర్ ట్రక్ భారీ లోడ్ తో వెళుతోంది. ఈ ప్రమాదంలో.. వాల్వో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు చిన్నారులు సహా మరో నలుగురు(Six Died) చనిపోయారు.ఈ ప్రమాదం జరిగినప్పుడు.. పక్కనే ఉన్న మరో బైక్ కు(Two Wheeler) కూడా ప్రమాదం జరిగింది. కారుకు ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, రోడ్డుపై ప్రయాణిస్తున్న వారు పరుగుల సంఘటనా స్థలానికి వెళ్లారు. కారుపై బరువైన కంటైనర్ పడిపోవడంతో…  హుటాహుటిన క్రేన్లు తీసుకువచ్చి కంటైనర్ తీసేసేందుకు ప్రయత్నించారు.


కంటైనర్ కింద కారు నుజ్జునుజ్జు అయ్యింది. కారులోని వ్యక్తులందరినీ బయటకు తీసిన ప్రజలు.. వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. అప్పటికే.. కారులోని వాళ్లంతా చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనతో.. జాతీయ రహదారి 4 పై వాహనాల రద్దీ ఏర్పడింది. దాంతో.. పోలీసులు ఈ దారిపై ప్రయాణించే వారికి అడ్వైజరీ(Police Advisory) జారీ చేశారు. వాహనాల రద్దీ దాదాపు 3, 4 కిలోమీటర్ల మేర ఏర్పడినట్లు తెలిపారు.

హాలీడే సందర్భంగా కుటుంబంలో సరదాగా బయటకు వెళ్లిన కుటుంబం ఇలా ప్రమాదంలో చిక్కుకోవడం..  ఫ్యామిలీ అంతా మరణించడంతో విషాదం అలుముకుంది. మరణించిన వారంతా కర్ణాటకకు(Karnataka) చెందిన విజయపూర్‌కు చెందినవారిగా గుర్తించారు. కాగా..  బెంగళూర్‌లో(Bengakure) సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నిర్వహిస్తున్న చంద్రం ఎగప్పగోల్‌ (Chandram Yogappa) కుటుంబం ఈ ప్రమాదంలో చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. చంద్రం అగప్పగోల్ IAST సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని. చంద్రం ఇటీవలె వోల్వో కారును కొనుగోలు చేశారు. మృతులను చంద్రం ఎగప్పగోల్ (46), అతని భార్య ధోరబాయి (40), కుమారుడు జ్ఞాన్ (16), కుమార్తెలు దీక్ష (10), ఆర్య (6) చంద్రం ఎగప్పగోల్ సోదరుడి భార్య విజయలక్ష్మి (35) గా గుర్తించారు.

Also Read : వందమంది పోలీసులు, 30 కార్లుతో ఛేజింగ్.. అంత బంగారం ఎక్కడిది.?

యాక్సిడెంట్‌పై నెలమంగళ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు(Police Case) నమోదయ్యింది. చంద్రం ఎగప్పగోల్ వాస్తవానికి మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా జాట్ తాలూకాలోని మోరబాగి గ్రామ నివాసి కాగా.. బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌లో నివసిస్తున్నారు. ఈ ప్రమదంపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారందరికీ నివాళులు అర్పించారు.

Related News

Road Accident: పెళ్లి కారు టైరు పేలి‌.. ముగ్గురు స్పాట్‌డెడ్‌

Road Accident: డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. మంటల్లో తగలబడి.. 8 మంది స్పాట్!

Patancheru Tollgate: ఘోర రోడ్డు ప్రమాదం.. పటాన్‌చెరులో ట్యాంకర్‌ బోల్తా..

Hyderabad News: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్యాయత్నం.. అసలేం జరిగిందంటే..?

TMC MP Kalyan Banerjee: సైబర్ వలకు చిక్కిన ఎంపీ కళ్యాణ్ బెనర్జీ.. ₹55 లక్షల స్వాహా!

Tamil Nadu: చిన్నారి ప్రాణం తీసిన తల్లి.. మరో మహిళతో అఫైర్‌!

Nellore Accident: నెల్లూరులో స్కార్పియో యాక్సిడెంట్.. నలుగురు టీచర్లు స్పాట్!

Rajendranagar Accident: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన డీసీఎం వాహనం..

Big Stories

×