BigTV English

Allu Arjun: నా క్యారెక్టర్ ను తప్పు పడుతున్నారు.. నేనెప్పుడైనా ఇలా చేశానా.. బన్నీ ఎమోషనల్

Allu Arjun: నా క్యారెక్టర్ ను తప్పు పడుతున్నారు.. నేనెప్పుడైనా ఇలా చేశానా.. బన్నీ ఎమోషనల్

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను సంధ్య థియేటర్  ఘటన టాలీవుడ్ ను కుదిపేస్తున్న విషయం తెల్సిందే. ఈ ఘటనలో భాగంగా సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని ఇదివరకే పోలీసులు అరెస్టు చేశారు. ఈ మధ్యనే అల్లు అర్జున్ కూడా అరెస్టు చేశారు. ఇప్పటికే  తనపై ఉన్న కేసును కొట్టివేయాలని బన్నీ  పిటిషన్ దాఖలు చేయగా .. అది విచారణకు కూడా రాకముందే చిక్కడపల్లి పోలీసులు బన్నీ విచారణ నిమిత్తం అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అయితే బన్నీకి 14 రోజుల రిమాండ్ విధించగా.. లాయర్ అడిగిన లాజిక్ ప్రశ్నలకు కోర్టు ఆలోచించి బెయిల్ మంజూరు చేయడంతో బన్నీ బయటకు వచ్చాడు.


ఇక దీని తరువాత బన్నీ భాదితుల కుటుంబాన్ని ఇంకా పరామర్శించలేదు. దీంతో నెటిజన్స్ అల్లు అర్జున్ ను విమర్శించడం జరిగింది. ఇక ఈరోజు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. బన్నీపై ఫైర్ అయ్యారు. ” అల్లు అర్జున్ కు కాళ్ళు పోయాయా, చేతులు పోయాయా.. పరామర్శించటం కోసం అయన దగ్గరికి లైన్ కట్టారు, పాపం ఆసుపత్రి లో కొట్టుమిట్టు ఆడుతున్న చిన్నారి ని పరామర్శిచడానికి ఒక్కరికి మనసు రాలేదు.. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే” అని ఆయన చెప్పారు.

ఇక ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అల్లు అర్జున్ మీద తీవ్రమైన కామెంట్ చేశారు. “తొక్కిసలాటలో మహిళ చచ్చిపోయిందా? అయితే నా సినిమా సూపర్ హిట్ అయినట్టే.. అని అల్లు అర్జున్ పోలీసులతో అన్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఈ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ స్పందించాడు. ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చాడు.


“ఇదంతా కేవలం యాక్సిడెంట్ మాత్రమే.. ఇందులో ఎవరి తప్పు లేదు అని చెప్పుకొచ్చాడు. నేను కొన్ని కోట్లు పెట్టి సినిమా తీసి అది హిట్ అయ్యానని ఆనందంలో కూడా లేను 15 రోజులుగా నేను ఎలా ఫీల్ అవుతున్నానో మీకు తెలియదు. ఇందులో ఎవరి తప్పు లేదు.. నా గురించి ఎక్కడలేని ఆరోపణలు ఇస్తున్నారు. నాకు డెత్ గురించి తెలిసి కూడా రాలేదని, కావాలని దాని గురించి నేను మాట్లాడానని చెప్పుకొస్తున్నారు.. అందులో నిజం లేదు.

నా ఫ్యాన్స్ ను నేను ఎంత ప్రేమిస్తానో అందరికీ తెలుసు.. 20 ఏళ్లుగా నన్ను చూస్తున్నారు. ఇలాంటి వివాదాల్లో కానీ.. ఎవరితోనైనా ఇలా మాట్లాడడం కానీ మీరు చూసారా.. ?  అలాంటి నేను ఇలా చేస్తానా.. ? నా క్యారెక్టర్ ను తప్పు పడుతున్నారు.. నేనెప్పుడైనా ఇలా చేశానా అని ఎమోషనల్ అయ్యారు. నేను ఏదైనా తీసుకుంటాను కానీ.. నా క్యారెక్టర్ ను తప్పు పట్టి మాట్లాడుతుంటే నేను చాలా ఫీల్ అవుతున్నాను. నేను సినిమా చేస్తే అందరూ ఎంజాయ్ చేయాలనుకుంటాను.  నా సినిమా థియేటర్ లో ఇలా జరిగితే  నేను ఎలా హ్యాపీగా ఉంటాను. చిన్నతనం నుంచి ఆ థియేటర్ కు వెళ్లి వస్తున్నాను.

ఇక బాధిత బాలుడును కలవలేదు అని అంటున్నారు.  ఇంత జరిగినా కూడా నేను వెళ్లకుండా ఎందుకు ఉంటాను. కానీ, లీగల్  గా నేను వెళ్ళకూడదు అని చెప్తే .. మా నాన్నను పంపించాను. నాకు ఎప్పుడెప్పుడు వెళ్లి ఆ పిల్లాడిని కలవాలని ఉంది. ఇప్పుడిప్పుడే కుర్రాడు కోలుకుతున్నాడట. అది ఎంతో సంతోషించదగ్గ విషయం. నాకు ఆమె మృతి చెందిన విషయం నాకు తెలియదు. తెలిసేసరికి నేను షాక్.. దాని నుంచి బయటపడడానికి  నాకు చాలా సమయం పట్టింది.

అరే  నా ఫ్యాన్స్ కు ఏదైనా అయితే నేను ఎలా అబ్బా హ్యాపీగా ఉంటాను. థియేటర్ వాళ్లు పర్మిషన్ ఇవ్వలేదు అని అంటున్నారు. అలాంటిదేమి లేదు. అక్కడ పోలీసులు కూడా ఉన్నారు. కాకపోతే  క్రౌడ్ ఎక్కువ ఉందని చెప్పారు. ఇదంతా అనుకోకుండా జరిగింది.  ఆ కుటుంబానికి అండగా మేము ఉంటాం” అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×