E-Paper
Advertisement

నాడు వై నాట్ కుప్పం.. నేడు ఫినిష్ పులివెందుల! ఏపీలో పీక్‌కి చేరిన ఈగో వార్!

నాడు వై నాట్ కుప్పం.. నేడు ఫినిష్ పులివెందుల! ఏపీలో పీక్‌కి చేరిన ఈగో వార్!
Advertisement

Kuppam vs Pulivendula: ఏపీలో ఈగో పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఇగో దెబ్బతిన్న అగ్రనేతలు అదే ఈగో మీద కొట్టి రివెంజ్ తీర్చుకుంటున్నారు. ఇప్పుడు పులివెందల మున్సిపల్ ఎన్నికల్లో కనిపిస్తున్న సీన్ల వంటివే కాకున్నా.. ఐదేళ్ల క్రితం సేమ్ ఏకగ్రవాల సీన్లు చంద్రబాబు నాయుడు కంచుకోట కుప్పంలో కూడా కనిపించాయి. 2021 స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు కంచుకోట కుప్పంలో వైసపీ చేసిన ఏకగ్రవాలకు ఇప్పుడు ఈ ఎన్నికల్లో పులివెందులతో చంద్రబాబు నాయుడు ప్రతికారం తీర్చుకుంటున్నారా..? ఎస్ ఇది ఖచ్చితంగా రివెంజ్ పాలిటిక్స్. కుప్పంలో నాడు జరిగిన అవమానానికి నేడు పులివెందుల్లో బదులుకు బదులు తీర్చుకుంటున్నారు చంద్రబాబు నాయుడు. చంద్రబాబును అవమానించడమే లక్ష్యంగా కుప్పంను టార్గెట్ చేసింది అప్పటి వైసపి ప్రభుత్వం. ఆ ఆపరేషన్ కు నాయకత్వం వహించింది మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి. ఆయన కొడుకు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి చంద్రబాబు సొంత నియోజక వర్గంలో ఆయన తిరగడానికే వీలు లేకుండా పోలీసులను అడ్డంగా పెట్టారు ఆనాడు. ఫలితం చరిత్రలో ఎప్పుడూ చూడని దెబ్బ 89 పంచాయతీల్లో 75 పంచాయతీలు వైసపీ వశమయ్యాయి. టీడిపి కేవలం 14 పంచాయతీలకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది. 65 ఎంపిటీసిలలో 62 వైసపీవే టీడిపీ కి మిగిలింది కేవలం మూడు అంటే మూడే అంటే 98% వైసపీ పరమైపోయాయి.

కుప్పం మున్సిపాలిటీ పై వైసపి జెండా

Advertisement

కుప్పం నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల జెడ్పిటీసిలను నాలుగు మండల పరిషత్తులను కూడా వైసీపీ తన ఖాతాలోనే వేసుకుంది. ఇది రాష్ట్రంలో అప్పుడు సంచలనం అయిపోయింది. చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడి నియోజకవర్గంలోనే వైసపీ ఇలా పాకిపోతుంది ఏంటనే చర్చ అప్పట్లో నడిచింది. కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డ్లు ఉంటే అందులో 19 వైసిపీకి ఆరంటే ఆరే టిడిపికి మిగిలాయి. కుప్పం మున్సిపాలిటీ పై తొలిసారిగా వైసపి జెండా రెపరెపలాడింది. చైర్మన్ పీఠాన్ని ఆ పార్టీ కైవసం చేసుకుంది. ఆ రోజు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పోలైన ఓట్లు చూడండి వైసపీకి 84,160 ఓట్లు వస్తే టీడిపీ కేవలం 21,863 ఓట్లు మాత్రమే వచ్చాయి. టీడిపీ ని చావు దెబ్బతీశారు. తండ్రి కొడుకులు అక్కడి నుంచే పుట్టింది వై నాట్ కుప్పం అనే నినాదం చంద్రబాబును కుప్పంలోనే ఓడిస్తామనే దీమాను వైసపీ నాయకులంతా కూడా వ్యక్తం చేసేవాడు. ఆ రోజుల్లో ఆ ఫలితాలతో చంద్రబాబు కూడా షాక్కుకు గురయ్యారు. కానీ, ఆయన వెనక్కి తగ్గలేదు. అప్పటి నుంచి కుప్పంపై స్పెషల్ ఫోకస్ డబల్ చేశారు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు తాను సీఎం గా ఉన్నప్పటికంటే ఎక్కువ సార్లు కుప్పం వెళ్లారు. ఒక్కరే కాదు భార్య భువనేశ్వరిని కూడా అక్కడికి పంపారు. కుదిరినప్పుడల్లా పర్యటనలు చేశారు. ఇంటింటికి తిరిగారు.. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఆ ఫోకస్ ఆయన తగ్గించలేదు. కుప్పం బ్రాండ్ ను మళ్ళీ నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.

ఏకగ్రీవాలకు ఏకగ్రీవాలు.. దెబ్బకు దెబ్బ!

Advertisement

2024 ఎన్నికల్లో కుప్పంలో 50,000 మెజారిటీతో గెలిచి దెబ్బకు దెబ్బ కొట్టారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు అదే స్ట్రాటజీని రివర్స్ లో పులివెందులపై అప్లై చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. దశాబ్దాలుగా వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్న పులివెందలను టార్గెట్ చేశారు. పులివెందులు అంటే వైయస్ ఫ్యామిలీకి కంచుకోట. అక్కడ ఎవరు నిలబడిన విజయం వైఎస్ దే. అక్కడ ఎలక్షన్ జరుగుతుందా జరగదా అనేది సమస్య కాదు. ఆ సీటు జోలు రావడానికే ఎవరు సహసించే పరిస్థితి ఉండదు. నామమాత్రపు పోటీ మాత్రమే అక్కడ ఉండేది. గతంలో ఇలాంటి ఈగో రాజకీయాలు ఎప్పుడూ కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఏ రాష్ట్ర రాజకీయాల్లో కనపడేవి కాదు. రెండు పార్టీలు ఉంటాయి.. ఆ రెండు పార్టీలకు అగ్రనేతలు ఉంటారు. ఆయన ఒక
చోట పోటీ చేస్తారు.. ఈయన ఒక చోట పోటీ చేస్తారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ చేసుకోవడం. కానీ, ఒకళ్ళ నియోజక వర్గంలో ఒకళ్ళు ఇలా టార్గెట్ చేసుకొని వాళ్ళ ఓటమిని కళ్ళారా చూడాలనే పంతాలకు పట్టిపులకు పోయిన చరిత్ర ఇప్పటివరకు దేశంలో ఏ రాష్ట్రంలో లేదు.

చొక్కా మడతెత్తిన జగన్.. కాళ్లు మడిచి కూర్చోవాల్సి వచ్చిందా?

కానీ ఏపీలో ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంతంగా పార్టీ పెట్టుకున్నాక ఆయన చంద్రబాబు మీద ఫుల్ ఫోకస్ పెట్టారు. చంద్రబాబు కూడా జగన్ మీద ఫుల్ ఫోకస్ఏ పెట్టారు. అక్కడి నుంచి పుట్టిందే ఈ ఈగో రాజకీయం. అందుకే జగన్మోహన్ రెడ్డి తాను సీఎం కాగానే చంద్రబాబు మీద ఉన్న కసిని కుప్పంలో ఆయన్ని ఓడించడం ద్వారా హేళన చేయడం ద్వారా కసి తీర్చుకునే ప్రయత్నం చేశారు. చివరకు జగన్మోహన్ రెడ్డి తన సొంత ఊళలో ఓటు వేయకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోవాల్సిన పరిస్థితిని నిన్న చూసాం. మనం తమ పార్టీకి అన్యాయం జరిగిందని జగన్మోహన్ రెడ్డి ఏకంగా ఆర్ఓ ఆఫీస్ కి వెళ్లి కట్టెక నేల మీద కూర్చొని ధర్నా చేయాల్సి వచ్చింది. చోక్కా మడతేసాను అన్న జగన్ చివరికి కాళ్ళు మడతేసుకొని కింద కూర్చునే పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. ఓటు వేయకుండా జగన్ వెనక్కి తిరిగి వెళ్ళిపోవడాన్ని టిడిపి విపరీతంగా ట్రోల్ చేస్తోంది. చేతులు మడిచాను చూసుకుందాం రండన్న జగన్ చివరికి కాళ్ళు మడుచుకొని కింద కూర్చున్నాడంటూ ట్రోల్స్ మీద ట్రోల్స్ చేశారు.. కామెంట్స్ మీద కామెంట్ చేశారు.

Also Read: రెవెన్యూ, ఫారెస్ట్ భూములపై కీలక నిర్ణయం.. ఏళ్ల నాటి సమస్యకు మంత్రి పొంగులేటి మాస్టర్ ప్లాన్!

జగన్ ఇగో మీద కొట్టిన తండ్రికొడుకు..

ఇలా జగన్ ఇగో మీద కొట్టారు తండ్రి కొడుకులైన చంద్రబాబు లోకేష్. పొలివెందల మున్సిపాలిటీలో 40 వార్డులు ఉన్నాయి ఆ 40 వార్డులో 20ని టీడిపి ఏకగ్రేవం చేసుకుంది. చైర్మన్ సీటును కూడా టార్గెట్ చేసింది టీడిపి. ఇక పరిషత్ ఎన్నికలు చూస్తే సీన్ పూర్తిగా రివర్స్ అయింది 2021లో 98% సీట్లను కుప్పంలో ఎలాగైతే వైసపి ఏకగ్రహం చేసుకుందో ఇప్పుడు ఈ ఎన్నికల్లో 2026 లో జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో పులివెందలలో కూడా కూటమి ఏకగ్రేవాలను అలాగే చేసుకుంది. పులివెందల నియోజక వర్గంలో ఏడు మండలాలు ఉంటాయి. ఆ ఏడు మండలాల పదిలో 65 ఎంపిటీసీలు ఉంటాయి. అందులో 64 ఏకగ్రీయం అయ్యాయి. ఇందులో 60 టిడిపీకి మూడు బిజెపీకి ఒకటి జనసేనకు దక్కాయి. ఏడు మండలాల్లో ఆరు మండలాలు పూర్తిగా గా టీడిపీ ఖాతలో పడిపోయాయి. మిగిలింది ఒకే ఒక మండలం అల్లిరెడ్డి పల్లె ఏడు జెడ్పిటీసిల్లో మూడు ఏకగ్రీయం అయిపోయాయి. చక్రాయపేట, తొండూరు, సింహాద్రిపురం అందులో సింహాద్రిపురంలో అయితే ఏకంగా వైసపి నామినేషన్ కూడా వేయలేని పరిస్థితి ఉంది.

కుప్పంలో పడ్డ దెబ్బకు.. పులివెందులలో బదులు!

గుర్తుందా.. 2021లో కడప జిల్లాలో 432 ఎంపిటీసిల్లో 423 ఎంపిటీసిలను వైసిపి ఏకగ్రహం చేసుకుంది. ఇప్పుడు అదే కడపలో అదే పులివెందల్లో 64 ఎంపిటీసీలను కూటమి ఏకగ్రీవం చేసుకుంది. ఇది కదా ఇగో పాలిటిక్స్ అంటే ఇది కేవలం ఎన్నిక కాదు. ఇది ఒక మెసేజ్. కుప్పంలో నాడు జరిగింది ఏకగ్రీవం కాదు బలవంతు ఏకగ్రీవం అని టిడిపి నాడు ఆరోపించింది. ఇప్పుడు పులివెందులల్లో జరుగుతున్నది ప్రజలామోదంతో జరిగిన ఏకగ్రేం అని చెప్తుంది ఇదే కూటమి. కుప్పం దెబ్బకు పులివెందుల బదులు తీర్చుకుంది రివెంజ్ కంప్లీట్ అయిందా.. మళ్ళీ ఇది రిపీట్ అవుద్దా.. చూడాలి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మీరు ఇప్పుడు కొట్టారు తీసుకున్నాం.. రేపు మేము వస్తా అంటున్నారు. మరి జగన్ కొడతారా..? జగన్ కొట్టేదాన్ని చంద్రబాబు తీసుకుంటారా..? అని చూడాలి.

Tags

Related News

తమిళనాడుకు షాక్.. ఏపీకి జాక్‌పాట్.. రూ. 1614 కోట్ల కొరియన్ పెట్టుబడుల వెనుక అసలు కథ!

సీఎం విజయ్ కొత్త బిల్డింగ్ చూస్తే మైండ్ బ్లాకే.. అసలు ఆ లోపల ఏం జరుగుతోంది?

ఏమిటీ మురసు తుఫాన్? పేరు వెనుక కథేంటి? ఏయే జిల్లాలపై తీవ్ర ప్రభావం?

బీఆర్ఎస్ ప్రాజెక్టుల పర్యటన ఎప్పుడు?.. కేసీఆర్ రీ-ఎంట్రీపై బిగ్ అప్‌డేట్?

కవిత ఎమ్మెల్సీ పోటీతో లాభం ఎవరికి? కాంగ్రెస్‌కా… బీఆర్ఎస్‌కా?

సంపాదన తక్కువ.. ఖర్చు ఎక్కువ.. అప్పులతో నెట్టుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం?

సీఎం సభ తరువాత కేటీఆర్‌ ఇలాఖాలో అభివృద్ధి పరుగులు! వేములవాడతో కలుపుకుని రూ. 345 కోట్ల పనులు! రామన్నా రాకున్నా ఆగని అభివృద్ధి!

Big Stories

Advertisement
×