Amaravati: అదిగో పులి.. ఇదిగో మేక అన్నచందంగా ఉంది ఏపీలో పరిస్థితి. రేషన్ పంపిణీపై రకరకాల ప్రచారాలు జోరందుకున్నాయి. ఈ విషయం అధికారుల దృష్టికి రావడంతో రియాక్ట్ అయ్యారు. ఇంతకీ ప్రచారం వెనుక అసలు తతంగం ఏంటి? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
ఏపీలో రేషన్ సరుకులు పంపిణీ నిలిపి వేశారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రకటన చేశారు. తాము రేషన్ నిలిపివేయాలని ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదన్నారు. ఏపీ వ్యాప్తంగా చాలామంది రేషన్ వినియోగదారులు మొబైల్ నంబరు అనుసంధానం చేయలేదు. కుటుంబ సభ్యుల ఈకేవైసీ పూర్తి కాలేదని కారణాలుగా చెప్పి రేషన్ సరుకులు నిలిపి వేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు ప్రచారం సాగుతోంది.
రేషన్ కార్డుకు మొబైల్ నంబర్ లింక్ కాకపోవడం, ఈ-కేవైసీ పూర్తి కాని కారణంగా సరుకులు నిలిపి వేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అంటున్నారు రేషన్ డీలర్లు. అయినా ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఇలాంటి నిర్ణయాలు ఎలా తీసుకుంటారని అంటున్నారు అధికారులు ప్రశ్నిస్తున్నారు. ప్రజల్లో అలజడి క్రియేట్ చేయడానికి, కావాలని ఎవరో పుకార్లు పుట్టించారని అంటున్నారు. రేషన్‌కార్డులకు మొబైల్ నంబర్ల అనుసంధానం చేయని కుటుంబసభ్యుల నెంబర్లు సేకరించాలని ఆదేశాలు ఇచ్చినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు.
లింక్ చేయకపోయినా, ఈకేవైసీ కాకున్నా లబ్దిదారులకు రేషన్ నిరాకరించేది లేదన్నారు. ఒకవేళ ఇలాంటివి జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులు సూచన చేశారు. రేషన్‌కార్డులు ఉన్నవారికి దీపావళి కానుక ప్రకటించింది కూటమి ప్రభుత్వం. రేషన్ షాపుల ద్వారా కిలో కంది పప్పు రూ.100, గోధుమ పిండి రూ.25, లీటరు పామాయిల్ రూ.125 చొప్పున తక్కువ ధరకు పంపిణీ చేయాలని ఆదేశించారు. ధరణి బ్రాండ్ బియ్యాన్ని కిలో రూ.49 నుంచి రూ.50 మధ్య మొబైల్ వాహనాల ద్వారా పంపిణీ చేయాలన్నారు.
ALSO READ: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఫలితాలు.. నగరాలు-పట్టణాల్లో కూటమి జోరు, పత్తా లేని వైసీపీ
దీనికితోడు ఉల్లిపాయల ధరలు తగ్గేలా చూడాలన్నారు. ఉల్లి కిలో రూ.35 చొప్పున విక్రయిస్తున్నట్లు అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. త్వరలో 80 టన్నుల ఉల్లిని అందుబాటులోకి వస్తుందన్నారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు ప్రభుత్వంపై రూ.100 కోట్ల భారం పడుతుందని చెప్పారు అధికారులు.