E-Paper
Advertisement

ఏమిటీ మురసు తుఫాన్? పేరు వెనుక కథేంటి? ఏయే జిల్లాలపై తీవ్ర ప్రభావం?

ఏమిటీ మురసు తుఫాన్? పేరు వెనుక కథేంటి? ఏయే జిల్లాలపై తీవ్ర ప్రభావం?
Advertisement

Cyclone Murasu: బంగాళాఖాతం మరోసారి బద్దలవుతోందా? సముద్రం అల్లకల్లోలంగా మారుతోందా? తీరప్రాంతాల వైపు పెను తుఫాన్ దూసుకొస్తోందా? అర్నబ్ పెట్టిన ముప్పు తిప్పలును.. ముంచేసిన పంటల గురించే ఇంకా మర్చిపోలేదు.. ఆ ఇంపాక్ట్ ఇంకా తగ్గకముందే.. బంగాళాఖాతంలో ఇంకో డేంజర్ బెల్ మోగింది. అదే మురసు.. ఒక సివియర్ సైక్లోనిక్ స్ట్రోమ్. ఇప్పటికే దీని ఇంపాక్ట్ ప్రారంభమైంది. మళ్లీ రోడ్లు చెరువులుగా మారుతున్నాయి. విమానాలు రద్దవుతున్నాయి. అసలు ఏంటి ఈ మురసు? ఎందుకింత ప్రమాదకరంగా మారింది? ఏయే జిల్లాలపై దీని ప్రభావం ఉండబోతోంది? ఇలాంటి టైమ్‌లో ఇంపాక్ట్‌ రీజియన్‌లో ఉన్న వాళ్లు చేయాల్సిదేంటి?

ఈ తుఫాన్ ఎలా ఏర్పడుతుంది..

Advertisement

ముందుగా ఈ తుఫాన్ ఎలా ఏర్పడిందో తెలుసుకుందాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ వాయుగుండంగా మారింది. ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా బలపడింది. అనంతరం తుఫాన్‌గా రూపాంతరం చెందింది. ఈ తుఫాన్ పేరే మురసు. మురసు అంటే తమిళంలో యుద్ధ భేరి లేదా పెద్ద డప్పు అనే అర్థం ఉంది.

ఫస్ట్ ఈ పేరు ఎలా? ఎందుకు వచ్చిందో చూద్దాం..

Advertisement

ఫస్ట్ ఈ పేరు ఎలా? ఎందుకు వచ్చిందో చూద్దాం. ప్రపంచ వాతావరణ సంస్థకు అనుబంధంగా పనిచేసే కొన్ని దేశాలు ఈ రీజియన్‌లో ఏర్పడే తుఫాన్‌లకు పేర్లు పెడతాయి. రీసెంట్‌గా వచ్చిన అర్నబ్‌ తుఫాన్‌ పేరును బంగ్లాదేశ్‌ పెట్టగా.. ఇప్పుడు మురసును మన దేశమే పెట్టింది. అర్నబ్‌ సృష్టించిన విపత్తు అంతా ఇంతా కాదు. కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. భారీ ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. వేలాది ఎకరాల్లో పంట నాశనమైంది. ఇప్పుడు మురసు కూడా ఇదే బాటలో ఉంది.

మురసు ఎక్కడ తీరం దాటబోతోంది?

మరి మురసు ఎక్కడ తీరం దాటబోతోంది? అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. ఎందుకంటే మురసు ఇప్పుడు ఏపీవైపే దూసుకొస్తుంది. నెల్లూరు నుంచి నర్సాపురం మధ్య, ఒంగోలు సమీపంలో ఇది తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ చెబుతోంది. తీరం దాటే టైమ్‌లో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. గరిష్ఠంగా 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చు. సో.. ఆ సమీప ప్రాంతంలో ఉండే ప్రజలంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. తుఫాన్ కేంద్రం ప్రయాణించే మార్గం, దాని ప్రభావం ఉండే ప్రాంతాలు రెండూ వేర్వేరు. కాబట్టి తీరం దాటే ప్రాంతానికి దూరంగా ఉన్న జిల్లాల్లోనూ వర్షాలు, బలమైన గాలుల ప్రభావం ఉండవచ్చు.

ఏయే ప్రాంతాలపై మురసు ప్రభావం ఉండబోతుంది..

ఇప్పుడు ఏపీలో ఏయే ప్రాంతాలపై మురసు ప్రభావం ఉండబోతుందో చూద్దాం. దక్షిణ కోస్తా నుంచి మధ్య కోస్తా వరకు వర్షాల ప్రభావం కనిపించే అవకాశం ఉంది. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. IMD వార్నింగ్స్‌ ప్రకారం కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Also Read: క్యాంపస్ హబ్ AI ప్రొడక్ట్ లాంచ్‌లో కేటీఆర్.. గ్రామీణ యువతపై ప్రశంసల జల్లు

తుఫాన్‌పై ఏపీ ప్రభుత్వం ఫోకస్

ఇప్పటికే ఈ తుఫాన్‌పై ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేసింది. సహాయక, పునరావాస చర్యలకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సిబ్బంది, పరికరాలను ముందుగానే సిద్ధం చేస్తున్నారు. ఈ తుఫాన్ దెబ్బకు 12 జిల్లాల్లో దాదాపు 15 వేల 128 విద్యుత్ స్తంభాలు బలమైన గాలుల వల్ల దెబ్బతినే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేశారు.

మురసు దెబ్బకు విమానాలు రద్దు

ఇక తమిళనాడు, ఏపీలో ఈ మురసు దెబ్బకు విమానాలు ఎయిర్‌పోర్ట్‌లకే పరిమితమవుతున్నాయి. విజయవాడ నుంచి వెళ్లే 12 సర్వీసులు రద్దు అయ్యాయి. భోగాపురం నుంచి వెళ్లే విమానాలు కూడా రద్దయ్యాయి. హైదరాబాద్‌, విశాఖ, బెంగళూరు, చెన్నై, ముంబై, తిరుపతి, కర్నూలు వెళ్లే విమానాలను రద్దు చేశారు. హైదరాబాద్‌, విశాఖకు వెళ్లే విమానాలను రద్దు చేసినట్లు ఎయిరిండియా అనౌన్స్ చేసింది.

ఈ టైమ్‌లో తీసుకునే కొన్ని జాగ్రత్తలేంటో చూద్దాం..

ఇక ఈ టైమ్‌లో తీసుకునే కొన్ని జాగ్రత్తలేంటో చూద్దాం. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో ఉంటే అధికారులు చెప్పగానే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలి. అత్యవసర వస్తువులు సిద్ధం చేసుకోవాలి.. అంటే తాగునీరు, పొడి ఆహారం, టార్చ్‌లైట్, బ్యాటరీలు, పవర్ బ్యాంక్, అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి. ఇంటిని సురక్షితంగా ఉంచుకోవాలి.. తలుపులు, కిటికీలు మూసేయాలి. బయట ఉన్న కుండీలు, వస్తువులు, ఎగిరిపోయే సామగ్రిని లోపలికి తీసుకురావాలి. వరద నీటిలో ప్రయాణించవద్దు.. నీటితో నిండిన రోడ్లు, వాగులు, కాలువలు దాటేందుకు ప్రయత్నించకూడదు. లోతు తెలియని ప్రాంతాల్లోకి వెళ్లకూడదు. తెగిపడిన విద్యుత్ తీగలు, కూలిన స్తంభాలను తాకకూడదు. అలాంటివి కనిపిస్తే వెంటనే విద్యుత్ శాఖకు సమాచారం ఇవ్వాలి. పిల్లలు, వృద్ధులపై స్పెషల్ కేర్ తీసుకోవాలి. వారిని ఒంటరిగా వదిలేయకూడదు. అవసరమైన మందులు ఉంచుకోవాలి. ఎమర్జెన్సీ కిట్ అంటే.. ఫస్ట్ ఎయిడ్ బాక్స్, మందులు, గుర్తింపు కార్డులు, కాస్త క్యాష్‌, ఇంకా ముఖ్యమైన డాక్యుమెంట్స్‌ను వాటర్‌ప్రూఫ్ బ్యాగ్‌లో ఉంచాలి. ఇక సముద్ర తీరాలకు వెళ్లే ఆలోచనను కూడా రానివ్వకండి. చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగుల కింద నిలబడకండి.. అత్యవసరమైతే తప్ప.. ఇంటి నుంచి బయటికి రాకండి.

Tags

Related News

బీఆర్ఎస్ ప్రాజెక్టుల పర్యటన ఎప్పుడు?.. కేసీఆర్ రీ-ఎంట్రీపై బిగ్ అప్‌డేట్?

కవిత ఎమ్మెల్సీ పోటీతో లాభం ఎవరికి? కాంగ్రెస్‌కా… బీఆర్ఎస్‌కా?

సంపాదన తక్కువ.. ఖర్చు ఎక్కువ.. అప్పులతో నెట్టుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం?

సీఎం సభ తరువాత కేటీఆర్‌ ఇలాఖాలో అభివృద్ధి పరుగులు! వేములవాడతో కలుపుకుని రూ. 345 కోట్ల పనులు! రామన్నా రాకున్నా ఆగని అభివృద్ధి!

హస్తినలో ఇండీ నిరసన గళాలు! హైదరాబాద్‌లో బీజేపీ బల ప్రదర్శనలు! అమిత్ షా రాకతో బీజేపీలో సందడి..! తెలంగాణపై షా స్పెషల్‌ ఫోకస్‌!

ఆప్ ను అందలమెక్కించిన ఢిల్లీ విద్యా విప్లవం..! సర్కారీ విద్యకు అత్యధిక ప్రాధాన్యం..! భారీ సంస్కరణలతో మంచి ఫలితాలు.. పంజాబ్ లో గెలుపుకీ దోహదం!

సర్కారీ విద్య బలోపేతానికి భారీ సిఫార్సులు! మియాపూర్ భూముల అమ్మకం సొమ్మును వినియోగించాలని సూచన..! తన మాటవింటే మళ్లీ గెలవటం పక్కా అంటున్న మురళి!

Big Stories

Advertisement
×