E-Paper
Advertisement

సీఎం విజయ్ కొత్త బిల్డింగ్ చూస్తే మైండ్ బ్లాకే.. అసలు ఆ లోపల ఏం జరుగుతోంది?

సీఎం విజయ్ కొత్త బిల్డింగ్ చూస్తే మైండ్ బ్లాకే.. అసలు ఆ లోపల ఏం జరుగుతోంది?
Advertisement

Vijay Camp Office: తమిళనాడు సీఎం విజయ్ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేస్తా ఉన్నారు. అల్లా టప్పాగా రాలేదు.. అలా ఇలా రాలేదు.. అని ఆయన చేసే ప్రతిచర్య కూడా నిరూపిస్తుంది. ఇటు సంక్షేమం అటు అభివృద్ధి కార్యక్రమాలు రెండిటిని కూడా సమానంగా నడిపిస్తున్నారు. ఇచ్చిన హామీలు ఒకోదాన్ని అమలు చేసుకుంటూ పోతా ఉన్నారు. ఎక్కడా కూడా ఇతను రాజకీయ నాయకుడు కాదు అనే అభిప్రాయం ఎవరికీ కలగకుండా చేస్తా ఉన్నారు. ఈ ఆరు ఏడు నెలల్లో ఆయన తీసుకున్న కార్యక్రమాలు చేపడుతున్న కార్యక్రమాలు గాని స్పందిస్తున్న తీరు గాని జనాన్ని ఆకట్టుకుంటుంది అనేది ప్రధానంగా ఉన్న అభిప్రాయం. తమిళనాడు జనాలు అసలకే ఆవలిస్తే పెగు లెక్కపెట్టే టైపు ఐదేళ్లక ఒకసారి ప్రభుత్వాన్ని మార్చడం వాళ్ళకి అలవాటు అలాంటి వాళ్ళని మెప్పించడం అంటే సినిమా తీసి జనాల్లోకి వదలడం కాదు. ఆ ప్రతి
చర్యని వాళ్ళు గమనిస్తారు ఆ చర్యలో ఉన్న పాజిటివిటీ నెగిటివ్ ని చూస్తారు వాళ్ళు అందుకే గత 40 ఏళ్లుగా అటు జయలలితను ఇటు కరుణానిధిని డిఎంకే అని అన్నా డిఎంకే అని మార్చి మార్చి పీఠం మీద కూర్చోబెట్టారు మన తమిళ తంబీలు. ఇప్పుడు విజయ్ కూడా అదే మాదిరి రాజకీయాలు నడుపుతా ఉన్నారు. ఒక పక్క పార్టీ పెట్టిన ఆరు నెలల్లోనే అధికారంలోకి రావడమే కాకుండా తనదైన ముద్ర వేస్తూ రాజకీయాల్లో తన స్థానం ఏంటో నిరూపించుకుంటున్నారు తన పాత్ర ఏంటో స్పష్టం చేస్తున్నారు. ఇది ఒకసారి రాజకీయాలకు వచ్చిపోయినట్టుగా కాకుండా శాశ్వతంగా తన రాజకీయ జీవితంలోకి రావలసిన మార్పులన్నిటిని కూడా ఆయన ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా అడుగులు వేస్తూ పోతున్నారు.

సినిమా హీరో నుంచి సీఎం దాకా..

Advertisement

సినిమాల్లో హీరోగా కోట్లాది మంది అభిమానాలు సంపాదించుకున్న విజయ్ రాజకీయాలకు వచ్చి రాగానే ఏకంగా ముఖ్యమంత్రి అయిపోయారు. సింగిల్ హ్యాండ్ తో సీఎం సీట్ను పట్టేద్దాం అనుకున్న జస్ట్ జస్ట్ కొద్దిలో తప్పింది. కాంగ్రెస్ పార్టీతో పాటు మిగతా పక్షాల మద్దతుతో అనుకున్న సీఎం పదిని అనుకున్నట్టే పట్టేశారు విజయ్. ఇప్పుడు తమిళనాడు సీఎం విజయ్ మరోసారి వార్తల్లో నిలిచారు. దానికి కారణం సినిమా కాదు. రాజకీయ సభ అంతకంటే కాదు ఆయన కొత్త క్యాంప్ ఆఫీస్ చెన్నైలో విజయ్ కోసం ఓ ప్రభుత్వ భవనాన్ని సరికొత్తగా తీర్చి దిద్దబోతున్నారు. ఆధునిక సౌకర్యాలు కట్టుదిట్టమైన భద్రత అధికారులతో సమావేశాలకు అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం అంటే ఆశామాశి కాదు కదా అందుకే ఆధునిక సౌకర్యాలు ఉంటాయి. కట్టుతిట్టమైన భద్రత ఉంటుంది. అధికారులతోటి అనాధికారులతోటి సమావేశాలు పెట్టాల్సి ఉంటుంది నిత్యం సమీక్షలు సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. అలాంటి దాని కోసం ఈ క్యాంప్ ఆఫీస్ ని అచ్చు గుద్దినట్లు సిద్ధం చేస్తా ఉన్నారు.
అందులో భాగంగానే సీఎం కోసం ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్ ఒకటి వేస్తున్నారు. షెటిల్ కోర్టు వేస్తున్నారు. అంటే సీఎం ఇంటి నుంచి కాలు కదపకుండానే అటు ఆఫీస్ పని చేసుకోవచ్చు ఇటు ఎక్సర్సైజ్లు కూడా ఆయన చేసుకోవచ్చు. అన్నీ ఉండేలా ఈ క్యాంప్ ఆఫీస్ ని సిద్ధం చేస్తున్నారు. అసలు విజయ్ కి ఈ కొత్త క్యాంప్ ఆఫీస్ ఎందుకు అవసరమైందో కూడా మనం తెలుసుకుందాం.

ఇది విలాసమా? ప్రజా సౌకర్యమా?

Advertisement

ప్రస్తుతం విజయ్ ఉంటున్న ఇంటి నుంచి సెక్రటరిట్ కి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంది. ఈ కొత్త క్యాంప్ ఆఫీస్ వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది లేదంటే ముఖ్యమంత్రి వ్యక్తిగత సౌకర్యాల కోసమే ఈ మార్పులు చేర్పులు జరుగుతున్నాయా అసలు ఈ వ్యవహారం వెనకే ఉన్న కథ ఏంటో చూద్దాం. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత విజయ్ తన నివాసం నుంచే రోజువారి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. చెన్నైలోని నీలాంకార ప్రాంతంలో ఆయన సొంత ఇల్లు ఉంది. సీఎం అయిన దగ్గర నుంచి అక్కడి నుంచే రోజు సచివాలయానికి వస్తున్నారు. అంటే దాదాపు 18 కిలోమీటర్లు రావడానికి ఇంకో 18 కిలోమీటర్లు పోవడానికి రోజు 36 కిలోమీటర్లు ఆయన రోడ్డు మీద ఇలా ప్రయాణం చేయాల్సి వస్తుంది. అది కూడా చెన్నై లాంటి ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరంలో సాధారణ వ్యక్తి ప్రయాణిస్తే ఇది ఒక సమస్య కాదు కానీ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్నారంటే పరిస్థితి వేరుగా ఉంటుంది. ముందుగా రోడ్డు క్లియరెన్స్ ఇవ్వాలి, భద్రత ఏర్పాటు చూడాలి, పోలీసులను మోహరించాలి, వాహనాల రాకపోకలు నియంత్రించాలి కొన్నిసార్లు ట్రాఫిక్ కూడా దింపేయాల్సి వస్తుంది.
దీంతో విజయ్ రోజువారి ప్రయాణం వల్ల ఒక్క ఆ మార్గంలోనే కాదు ఆ ఎఫెక్ట్ మొత్తం సిటీ పైన పడుతుందట.

చెన్నై జనం కోసమే విజయ్ షాకింగ్ నిర్ణయం

సీఎం కాన్వాయ్ వల్ల ఇలా రోజు ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయ అనే వార్తలు పుంకారు పుంకాలుగా తమిళనాడులో వస్తున్నాయి. ఇది విజయ్కి కూడా కొద్దిగా ఇబ్బందికరంగా అనిపించిందండి సాధారణంగా సినిమా హీరో కొంచెం సామాజిక చైతన్యం ఉన్న వ్యక్తి కావడం వల్ల ఈ సమస్యను రోజు ఇలా సాగదీయడం మంచిది కాదని అభిప్రాయంతోటి ఆయన కొత్త ఆలోచన చేసి అధికారులతోటి ఒక సమీక్ష సమస్య నిర్వహించి ఈ సమస్యకు పరిష్కారంగా సచివాలయానికి దగ్గరలోనే సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేస్తే అలా ఉంటుందని ఒక ఆలోచన చేశారు. దానికి తగ్గట్టుగానే అధికారులు చకచక ఒక పరిశీలన చేసి చెన్నైలోని డిజిఎస్ దినకరన్ రోడ్లో ఉన్న ఓ భవనాన్ని క్యాంప్ ఆఫీస్ గా సిద్ధం చేయడానికి రెడీ చేశారు. అక్టోబర్ 28న ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా అక్కడికి వెళ్లి ఆ భవనం ఎలా ఉందో పరిశీలించారు. అది తనకు అనుకూలంగా ఉంటుందా లేదా అని కూడా ఆయన పరిశీలించారు. అది తన అవసరాలకు బాగా ఉంటుందని డిసైడ్ అయిపోయిన విజయ్ కొన్ని సూచనలు సలహాలు ఇచ్చి వచ్చారట. భవనంలో జరుగుతున్న మార్పులు గదుల ఏర్పాట్లు భద్రత ఇతర సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నాడు విజయ్. పనులు వేగంగా పూర్తి చేయాలని తనవల్ల ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్న చెన్నై వాసులకు త్వరగా విముక్తి కల్పించాలని విజయ్ భావిస్తున్నాడట ముఖ్యమంత్రి గారాయణంలో అంటే కేవలం ఆయన ఒక్కరే కూర్చునే గది ఉండదు ప్రభుత్వ అధికారులు వస్తారు.. సెక్రటరీలు ఉంటారు.. వివిధ శాఖలతో సమక్ష నిర్వహించాల్సి ఉంటుంది. మంత్రులు వస్తారు మంత్రులతో మాట్లాడాల్సి ఉంటుంది.

వెట్రి వీడు వెనుక ఇంత పెద్ద ప్లాన్ ఉందా?

ఒక్కోసారి అవసరమైతే క్యాబినెట్ సమస్యలు కూడా అక్కడ పెట్టాల్సి ఉంటుంది. అవసరమైనప్పుడు అత్యవసర సమావేశాలు కూడా అదే ప్లేస్ లో నిర్వహించాల్సి ఉంటుంది. ఇలాంటి ఇన్ని కార్యక్రమాలకు అనువుగా ఈ క్యాంప్ ఆఫీస్ని తీర్చిదిద్దాలంటే ఆశా మాషిక అయ్యా వాహరం కాదు. పైగా ఆయన సినిమా హీరో దానికి తగ్గట్టుగా ఈ వ్యవహారం అంతా ఉండాలి కాబట్టి ఆ హంగులన్నీ కూడా ఈ కొత్త క్యాంప్ ఆఫీస్ లోకి రాబోతున్నాయి. దీంతో పాటు గ్రీన్ బేస్ రోడ్ లోని పామణి ఇల్లం అనే ప్రభుత్వ నివాసాన్ని కూడా విజయ కోసం సిద్ధం చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. గతంలో ఈ భవనాన్ని ఉన్నతాధికారులు మంత్రులు అధికార నివాసంగా ఉపయోగించుకునే వాళ్ళు. దాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి అవసరాలకు అనుగుణంగా కూడా మార్పులు చేర్పులు చేస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. అంతేకాదు ఈ భవనానికి వెట్రి వీడు అంటే విజయ గృహం అనే పేరు పెట్టవచ్చునే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ పేరు మార్పుపై ప్రభుత్వం నుంచి ఇంకా అధికార ప్రకటన అనేది రాలేదు. ఇక ఈ కొత్త ఏర్పాట్లు వినకున్న ప్రధాన కారణం ట్రాఫిక్ సమస్యలు తగ్గించడం ప్రభుత్వ కార్యకలాపాలకు అనువైన వాతావరణం కల్పించడం అని చెప్తున్నారు.

కొత్త క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేస్తే ఎంత ఖర్చు అవుతుంది?

కానీ ఇక్కడే కొన్ని ప్రశ్నలు మొదలవుతున్నాయి. ముఖ్యమంత్రి నివాసాన్ని మార్చడం వల్ల నిజంగానే ట్రాఫిక్ సమస్య తగ్గుతుందా? కొత్త క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేస్తే ఎంత ఖర్చు అవుతుంది? ఆ ఖర్చు ప్రభుత్వ నిధుల నుంచా లేక ఇతర ఏర్పాట్ల ద్వారానా భవనం సిద్ధమైన తర్వాత ముఖ్యమంత్రి అక్కడి నుంచి రోజువారి కార్యక్రమాలు నిర్వహిస్తారా మళ్ళీ తన సొంత ఇంటింటికి ఎప్పుడైనా వెళ్తారా ఇవన్నీ స్పష్టత రావాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మనం మరో విషయాన్ని కూడా గమనించాలి ముఖ్యమంత్రి ఎక్కడ నివసించాలి ఎక్కడి నుంచి పని చేయాలి అనేది కేవలం ఆయన వ్యక్తిగత నిర్ణయం మాత్రమే కాదు దానికి పరిపాలనతో కూడా సంబంధం ఉంటుంది. భద్రతో కూడా ముడిపడి ఉంటుంది. ప్రజలకు కలిగే అసౌకర్యం కూడా ఇందులో ఒక భాగంగా చూడాల్సి ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి ప్రతిరోజు ఒక ముఖ్యమంత్రి ప్రతిరోజు ఎక్కువ దూరం ప్రయాణిస్తుంటే ఆ ప్రయాణం కోసం పోలీసు బలగాలని వందలాదిగా వినియోగించాల్సి వస్తుంది. ట్రాఫిక్ నియంత్రణ కోసం అదనపు ఏర్పాట్లు కూడా చేయాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కార్యాలయానికి దగ్గరగా సీఎం నివాసం ఉండటం వల్ల అటు పరిపాలనలకు ఉపయోగంగా ఉంటుంది. ఇటు ట్రాఫిక్ సమస్యలతోటి జనం ఇబ్బంది పడే బాధలు తప్పుతాయ అనే ఒక అభిప్రాయం కూడా ఉంది. 2004 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏపీ కి సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో అప్పటివరకు సీఎం కు క్యాంప్ ఆఫీస్ అనేది ఒకటి ఉండేది కాదు. ఆయన సీఎం అయిన తర్వాత సచివాలయానికి దగ్గరలో ఉండేలాగా ఒక క్యాంప్ ఆఫీస్ని నిర్మించారు. అన్ని హంగులు అప్పట్లో దాంట్లో సంకూరాయి. ఆ క్యాంపస్ వెనకనే సీఎం నివాసాన్ని కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఆయన ఐదేళ్ళు సీఎం గా పని చేసిన తర్వాత రెండోసారి గెలిచి మళ్ళీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత ఆ క్యాంప్ ఆఫీస్ ను వాడటం మానేశారు.

రాజశేఖర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్

అంతకుముందు రాజశేఖర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ గా వాడిన దాన్ని కెసిఆర్ సీఎం అయిన తర్వాత అది కెసిఆర్ సెక్యూరిటీ వాళ్ళ కోసం కేటాయించారు. ఆ వెనకుండ భవనాన్ని కూడా ఆయన వాడకుండా వదిలేశారు. విజయ్ విషయంకి వచ్చేటప్పటికి ప్రజాధనం వినియోగించే ప్రతి ప్రభుత్వ ప్రాజెక్టులో ఖర్చులు అవసరం పారదర్శకత కూడా ముఖ్యమే అసలు ఈ పనులన్నింటికి ఎంత ఖర్చు అవుతుంది ఎంత కేడస్తుంది అనేది ఇంకా బయటికి రాలేదు. ఇలాంటి విషయాలన్నీ ప్రజలకు తెలియడం కూడా అవసరమే అయితే ప్రజాధనం వినియోగించే ప్రభుత్వ కార్యక్రమాల్లో ఖర్చులు అవసరాలు పారదర్శకత కూడా ముఖ్యమే అసలు ఈ ప్రాజెక్టు కి ఎంత ఖర్చు అవుతుంది ఏ పనులకు ఎంత కేటాయిస్తున్నారు ఇలాంటి వివరాలన్నీ కూడా ప్రజలకు తెలియడం కూడా చాలా చాలా అవసరమే ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ ముఖ్యం కాబట్టి విజయ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న అభిప్రాయం వాళ్ళకి కలగకుండా ఉండాలంటే ఆ 7 భవనానికి ఎంత ఖర్చు పెడుతున్నారు దేని దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారు అని ఆయనే ముందే చెబితే బాగుంటుంది. లేకుంటే ప్రతిపక్షాలు ఆయన మీద విరుచుకు పడతాయి.

Also Read: క్రిప్టో ప్రపంచంలో భారీ హ్యాకింగ్ కలకలం.. ఒక్క ల్యాప్‌టాప్‌తో వేల కోట్ల ముప్పు?

ఆఫీస్‌పై విరుచుకుపడుతున్న విపక్షాలు!

ఆయన సౌకర్యాల కోసం విలాసాల కోసం ప్రజల డబ్బును తమిళనాడు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది విచ్చలవిడిగా అనే విమర్శకు ఆయన గురికావాల్సి వస్తుంది. విజయ్ రాజకీయాలకి వచ్చినప్పటి నుంచి కూడా తాను సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా పని చేస్తానని చెప్తూ వచ్చారు. అలాంటి నాయకుడు ముఖ్యమంత్రిగా తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ప్రజలు ఆసక్తిగా గమనిస్తా ఉంటారు. సినిమాల్లో ఆయన తన అభిమానులు మెప్పిస్తే మాత్రమే సరిపోతుంది. తమ హీరో సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా అభిమానులకు ఎక్కడికి పోరు. కానీ ముఖ్యమంత్రిగా విజయ్ తన అభిమానులతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ కూడా జవాబ్దారీగా ఉండాలి. సీఎం గా కూడా హిట్ కొట్టాలి అప్పుడే సక్సెస్ రిపీట్ అవుతుంది. అది రాజకీయంగా ఆయన నిలబెడుతుంది. అందుకే కొత్త క్యాంప్ ఆఫీస్ విషయంలో కూడా ఆయన ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఆసక్తిగా మారింది. మొత్తానికి తమిళనాడు సీఎం విజయ్ కొత్త క్యాంప్ ఆఫీస్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ మార్పుల వల్ల ముఖ్యమంత్రి ప్రయాణ సమయం తగ్గవచ్చు. భద్రత ఏర్పాట్లు మరింత సులభం కావచ్చు. ప్రభుత్వ సమావేశాలు నిర్మించడానికి అనువైన సమయం అనుకూలమైన ప్రదేశం దొరకవచ్చు. ముఖ్యమైనది ఏమిటంటే భవనం ఎంత అందంగా ఉందనేది కాదు అక్కడి నుంచి ప్రజలకు ఎంత సమర్ధవంతమైన పాలనను విజయ్ అందిస్తున్నారు అన్నదే చూస్తారు ఫైనల్ గా మరి విజయ్ కొత్త క్యాంప్ ఆఫీస్ నిజంగానే పరిపాలనకు కొత్త మార్పుకు నాందిగా మారుతుందా లేదా కేవలం ముఖ్యమంత్రి చినామ మార్పుగానే మిగిలిపోతుందా?

Tags

Related News

తమిళనాడుకు షాక్.. ఏపీకి జాక్‌పాట్.. రూ. 1614 కోట్ల కొరియన్ పెట్టుబడుల వెనుక అసలు కథ!

నాడు వై నాట్ కుప్పం.. నేడు ఫినిష్ పులివెందుల! ఏపీలో పీక్‌కి చేరిన ఈగో వార్!

ఏమిటీ మురసు తుఫాన్? పేరు వెనుక కథేంటి? ఏయే జిల్లాలపై తీవ్ర ప్రభావం?

బీఆర్ఎస్ ప్రాజెక్టుల పర్యటన ఎప్పుడు?.. కేసీఆర్ రీ-ఎంట్రీపై బిగ్ అప్‌డేట్?

కవిత ఎమ్మెల్సీ పోటీతో లాభం ఎవరికి? కాంగ్రెస్‌కా… బీఆర్ఎస్‌కా?

సంపాదన తక్కువ.. ఖర్చు ఎక్కువ.. అప్పులతో నెట్టుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం?

సీఎం సభ తరువాత కేటీఆర్‌ ఇలాఖాలో అభివృద్ధి పరుగులు! వేములవాడతో కలుపుకుని రూ. 345 కోట్ల పనులు! రామన్నా రాకున్నా ఆగని అభివృద్ధి!

Big Stories

Advertisement
×