E-Paper
Advertisement

తమిళనాడుకు షాక్.. ఏపీకి జాక్‌పాట్.. రూ. 1614 కోట్ల కొరియన్ పెట్టుబడుల వెనుక అసలు కథ!

తమిళనాడుకు షాక్.. ఏపీకి జాక్‌పాట్.. రూ. 1614 కోట్ల కొరియన్ పెట్టుబడుల వెనుక అసలు కథ!
Advertisement

South Korean Investment: తమిళనాడుతో పోటీ పడి మరి ఆంధ్రప్రదేశ్ మూడు దక్షిణ కొరియా కంపెనీలను ఆకర్షించింది. ఏకంగా 1614 కోట్ల పెట్టుబడులు 1418 ఉద్యోగాలు అయితే ఈ కంపెనీలు ఏం తయారు చేస్తాయి? ఆంధ్రప్రదేశ్ నే ఎందుకు ఎంచుకున్నాయి ఈ పెట్టుబడలతో రాయలసీమకు ఎలాంటి ప్రయోజనం కలగనుంది? అసలు ఈ పెట్టుబడల వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ పెట్టుబడల వెనుక ఉన్న కథ ఏంటి..?

Advertisement

ఆంధ్రప్రదేశ్ కు భారీ పెట్టుబడులు రాబోతున్నాయి. దక్షిణ కొరియాకు చెందిన మూడు ఆటోమొబైల్ విడి భాగాల తయారీ కంపెనీలు రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకువచ్చాయి. ఆ కంపెనీల పేర్లు హోషింగ్ సియాన్ ఈవోమెట్ ఈ మూడు కంపెనీలు కలిపి 1614.17 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ పరిశ్రమల ద్వారా మొత్తం 1418 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. అయితే ఈ మూడు కంపెనీల పెట్టుబడులు ఉద్యోగాల వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం.

ఏ కంపెనీ ఎంత పెట్టుబడి పెడుతోంది..?

Advertisement

ఏ కంపెనీ ఎంత పెట్టుబడి పెడుతోంది. మొదటిది హాషిన్ ఈ కంపెనీ 850 కోట్ల పెట్టుబడితో నాలుగు చక్రాల వాహనాలకు అవసరమైన విడిభాగాల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా 100 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.
రెండవది సియాన్ ఈ సంస్థ 514.17 7 కోట్ల పెట్టుబడితో కార్ల ఇంటీరియర్ ఎక్స్టీరియర్ విడి భాగాలను తయారు చేయనుంది. అంటే కార్ల లోపలి బయట భాగాలకు అవసరమైన కాంపోనెంట్స్ తయారు చేస్తుంది. దీని ద్వారా 918 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. మూడోది ఈవామై ఈ సంస్థ 250 కోట్ల పెట్టుబడితో ఆటోమొబైల్ విడిభాగాల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా 400 ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. అంటే మూడు కంపెనీల పెట్టుబడులు కలిపితే 1614.17 7 కోట్లు ఉద్యోగాల అంచన 1418 ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అత్యధిక పెట్టుబడి హాషిన్ పెడుతున్నప్పటికీ అత్యధిక ఉద్యోగాలు మాత్రం సియాన్ కంపెనీ కల్పించనుంది.

ఈ కంపెనీలు ఏపీ నే ఎందుకు ఎంచుకున్నాయి..?

ఈ కంపెనీలు ఏపీ నే ఎందుకు ఎంచుకున్నాయ అంటే దీనికి ప్రధాన కారణం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కియా కార్ల తయారీ పరిశ్రమ. అనంతపురం ప్రాంతంలోని పెనుకొండలో కియా ఇండియా తయారీ కేంద్రం ఉంది. కియా అనేది దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ. ఈ ప్లాంట్ ద్వారా భారతదేశంలో కార్ల తయారీ జరుగుతుంది. ఒక కార్ను తయారు చేయాలంటే ఇంజన్, బాడీ పార్ట్, సీట్లు, డాష్బోర్డ్లు ఇతర ఎన్నో విడిభాగాలు అవసరం. వీటన్నింటికీ ఒకే కంపెనీ తయారు చేయదు. వివిధ అనుబంధ కంపెనీలు విడిభాగాలు తయారు చేసి ప్రధాన కార్ల కంపెనీకి సరఫరా చేస్తారు. అందుకే కియా ప్లాంట్ దగ్గరలోని విడిభాగాల పరిశ్రమలు ఏర్పాటు చేస్తే రవాణ సరఫరా వ్యవస్థలో ప్రయోజనాలు ఉంటాయి. ఇలా ఒక ప్రధాన పరిశ్రమ చుట్టూ దానికి అనుబంధంగా మరిన్ని పరిశ్రమలు ఏర్పడటాన్ని ఆటోమొబైల్ క్లస్టర్ అంటారు. అంటే ఇప్పుడు ఏపీలో అలాంటి ఆటోమొబైల్ క్లస్టర్ మరింత విస్తరించే అవకాశం ఉంది.

తమిళనాడుతో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల పోటీ

తమిళనాడుతో పోటీ ఎందుకు వచ్చింది అనేగామీట ఎందుకంటే తమిళనాడు కూడా భారతదేశంలో అతి పెద్ద ఆటోమొబైల్ తయారీ కేంద్రంలో ఒకటి. చెన్నై శ్రీ పెరంబదూర్ ప్రాంతాల్లో Hyundai సహా అనేక ఆటోమొబైల్ కంపెనీలు వాటికి అనుబంధ పరిశ్రమలు ఉన్నాయి. ఈ మూడు దక్షిణ కొరియా కంపెనీలు గతంలో తమిళనాడు ప్రభుత్వంతో కూడా పరిశ్రమల ఏర్పాటు విస్తరణపై చర్చలు జరిపాయి. అయితే చివరకు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించాలి. దీంతో ఆటోమొబైల్ రంగంలో ఇప్పటికే బలమైన స్థానం ఉన్న తమిళనాడుతో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ఆకర్షణలో పోటీ పడనట్లయింది. ఇక నారా లోకేష్ పర్యటన ఎంత కీలకమైందంటే ఈ పెట్టుబడుల వెనుక రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు కూడా ఉన్నాయి. 2026 జూలై లో మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియాలో పర్యటించారు. అక్కడ Hyundai కియా సరఫరా వ్యవస్థలో ఉన్న ఆటోమొబైల్ విభాగాల తయారీ కంపెనీల ప్రతినిధులతో సమావేశంయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల ఏర్పాటు చేయడానికి ఉన్న అవకాశాలను వివరించి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.

రాయలసీమలో కొరియన్ కంపెనీల ప్రభంజనం!

ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ ద్వారా కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరిపారు. ఈ చర్చలు ఫాలో అప్ తర్వాతే వాషిన్ సియాన్ ఇవామేట్ సంస్థలు పెట్టుబడులకు అంగీకరించాయి. అంటే కేవలం పెట్టుబడల ఆహ్వానం మాత్రమే కాదు వాటిని కార్యరూపంలోకి తీసుకురావడానికి ప్రభుత్వ స్థాయిలో జరిగిన ప్రయత్నాలు కూడా ఈ నిర్ణయంలో కీలకంగా మారాయి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ పెట్టుబడలతో రాయలసీమ ప్రాంతానికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం. మొదటిది ఉపాధి 1418 ఉద్యోగాల అంచన ఉంది. ముఖ్యంగా టెక్నికల్ విద్య, డిప్లమా, ఐటిఐ, ఇంజనీరింగ్ చదివిన యువతకైతే అవకాశాలు ఏర్పడొచ్చు. రెండోది స్థానిక వ్యాపారాల అభివృద్ధి పరిశ్రమలు ఏర్పడితే రవాణ, గోదాములు, హోటల్, అద్యగృహాలు ఇతర సేవలకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. మూడోది చిన్న పరిశ్రమలకు అవకాశాలు. పెద్ద కంపెనీలకు విడిభాగాలు, ప్యాకేజింగ్, రవాణ వంటి సేవలు అందించే చిన్న మధ్యతరహ పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందొచ్చు. నాలుగోది నైపుణ్యాల అభివృద్ధి. కొత్త సాంకేతికత ఆధునిక తయారీ విధానాలతో స్థానిక యువతకు కొత్త నైపుణ్యాలు నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ ప్రయోజనాలు పరిశ్రమలు పూర్తి స్థాయిలో ప్రారంభమై స్థానికంగా కార్యకలాపాలు విస్తరించినప్పుడే కనిపిస్తాయి. పెట్టుబడుల ప్రకటనతోనే ఉద్యోగాలు వచ్చినట్టేనా అంటే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి. ప్రభుత్వంతో కంపెనీలు ఎంవ కుదిర్చుకున్నాయ అంటే పరిశ్రమలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని అర్థం కాదు.

Also Read: పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదాలు.. నలుగురు యువకులు మృతి!

యువతకు 1,400+ పైగా టెక్నికల్ ఉద్యోగాలు!

ఈ వార్తలో మరో పెద్ద విషయం రాయలసీమలో పెట్టుబడుల విస్తరణ. ఇదే సమయంలో అనంతపురంలో జరిగిన సిఐ ప్రాంతీయ సదస్సులో కూడా భారీ పెట్టుబడల ఒప్పందాలు కుదిరాయి. మొత్తం 23 అవగాహన ఒప్పందాల ద్వారా 5217.39 కోట్ల పెట్టుబడులు 7613 ప్రత్యక్ష ఉద్యోగాల కల్పనకు ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన 14 ఒప్పందాల విలువ 4141.39 కోట్లు వీటి ద్వారా 6374 ఉద్యోగాల అంచన ఉంది. అంటే ఆటోమొబైల్ రంగంతో పాటు ఏరోస్పేస్, డిఫెన్స్, స్టీల్, టెక్స్టైల్స్ వంటి రంగాల్లో కూడా రాయలసీమకు పెట్టుబడులు వస్తున్నాయి. అయితే ఈ సదస్సులోని హాషిన్, సియాన్, ఇవామేట్ ఒప్పందాలే మనం మొదట మాట్లాడుకున్న 1614 కోట్ల పెట్టుబడుల్లో భాగం. కాబట్టి ఈ రెండు మొత్తాలను కలిపి కొత్త పెట్టుబడులుగా చూపించకూడదు. ఒకప్పుడు వ్యవసాయం కరువు సమస్యలతో ఎక్కువగా వార్తలో నిలిచే రాయలసీమ ప్రాంతం ఇప్పుడు పారిశ్రామిక పెట్టుబడుల పరంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అయితే పెట్టుబడులు రావడం ఎంత ముఖ్యమో అవి పరిశ్రమలుగా మారడం స్థానిక యువతకు ఉద్యోగాలు రావడం కూడా అంతే ముఖ్యం.

Tags

Related News

సీఎం విజయ్ కొత్త బిల్డింగ్ చూస్తే మైండ్ బ్లాకే.. అసలు ఆ లోపల ఏం జరుగుతోంది?

నాడు వై నాట్ కుప్పం.. నేడు ఫినిష్ పులివెందుల! ఏపీలో పీక్‌కి చేరిన ఈగో వార్!

ఏమిటీ మురసు తుఫాన్? పేరు వెనుక కథేంటి? ఏయే జిల్లాలపై తీవ్ర ప్రభావం?

బీఆర్ఎస్ ప్రాజెక్టుల పర్యటన ఎప్పుడు?.. కేసీఆర్ రీ-ఎంట్రీపై బిగ్ అప్‌డేట్?

కవిత ఎమ్మెల్సీ పోటీతో లాభం ఎవరికి? కాంగ్రెస్‌కా… బీఆర్ఎస్‌కా?

సంపాదన తక్కువ.. ఖర్చు ఎక్కువ.. అప్పులతో నెట్టుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం?

సీఎం సభ తరువాత కేటీఆర్‌ ఇలాఖాలో అభివృద్ధి పరుగులు! వేములవాడతో కలుపుకుని రూ. 345 కోట్ల పనులు! రామన్నా రాకున్నా ఆగని అభివృద్ధి!

Big Stories

Advertisement
×