E-Paper
Advertisement

SBI ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఈ పథకాల్లో డిపాజిట్ చేస్తే.. ప్రతినెలా ‘జీతం’ గ్యారెంటీ!

SBI ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఈ పథకాల్లో డిపాజిట్ చేస్తే.. ప్రతినెలా ‘జీతం’ గ్యారెంటీ!
Advertisement

SBI Deposit Schemes: ఖాతాదారులకు మెరుగైన ఆర్థిక ప్రయోజనాలు అందించేందుకు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (SBI) ప్రత్యేక పథకాలను అందుబాటులోకి తెచ్చింది. నెలానెలా స్థిరమైన ఆదాయం పొందాలనుకునే వారు, సీనియర్ సిటిజన్లు, సురక్షితమైన మార్గాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారి కోసం ఎస్బీఐ తెచ్చిన 3 కీలక డిపాజిట్ పథకాలు, వాటి వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్

ఒకేసారి పెద్దమొత్తంలో డిపాజిట్ చేసి, ప్రతి నెలా ఒక నిర్ణీత ఆదాయాన్ని పొందాలనుకునే వారికి ఈ పథకం (SBI Annuity Deposit Scheme) బెస్ట్ ఆప్షన్. ఇందులో డిపాజిటర్లు జమ చేసిన సొమ్ము నుంచి బ్యాంక్ ప్రతి నెలా ‘ఈఎంఐ’ (EMI) రూపంలో డబ్బులు చెల్లిస్తుంది. ఈ నెలవారీ చెల్లింపుల్లో అసలుతో పాటు వడ్డీ కూడా కలిపి ఉంటుంది. వినియోగదారులు తమ వెసులుబాటును బట్టి 36, 60, 84, 120 నెలల (3, 5, 7 లేదా 10 సంవత్సరాలు) కాలపరిమితిని ఎంచుకోవచ్చు. సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) రేట్లకు సమానంగా ఈ స్కీమ్ లో వడ్డీ చెల్లిస్తారు. ఈ స్కీమ్ లో కనీస నెలవారీ యాన్యుటీ రూ. 1,000గా నిర్ణయించారు. 5 ఏళ్ల కాలపరిమితికి కనీస డిపాజిట్ రూ. 60,000గా ఉంది. గరిష్ట పెట్టుబడిపై ఎలాంటి పరిమితి లేదు. అత్యవసర సమయాల్లో మిగిలి ఉన్న యాన్యుటీ బ్యాలెన్స్‌లో గరిష్టంగా 75% వరకు రుణం లేదా ఓవర్‌డ్రాఫ్ట్ (Overdraft) పొందే వెసులుబాటు కూడా ఎస్ బీఐ కల్పించింది.

ఎస్‌బీఐ పేట్రన్స్ స్కీమ్ (SBI Patrons Scheme)

Advertisement

80 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులను గౌరవిస్తూ ఎస్‌బీఐ ‘పేట్రన్స్’ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. భారతీయ నివాసితులైన 80 ఏళ్లు పైబడిన వారు ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ పథకం కింద సూపర్ సీనియర్ సిటిజన్లకు సాధారణ సీనియర్ సిటిజన్లకు ఇచ్చే వడ్డీ రేటు కంటే అదనంగా 0.10% (10 బేసిస్ పాయింట్లు) వడ్డీ లభిస్తుంది. రూ. 3 కోట్ల కంటే తక్కువ ఉన్న రిటైల్ టర్మ్ డిపాజిట్లకు 7 రోజుల నుండి 10 సంవత్సరాల కాలపరిమితికి ఈ అదనపు వడ్డీ వర్తిస్తుంది. ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్ ద్వారా గానీ, యోనో (YONO) యాప్ ద్వారా గానీ ఎఫ్‌డీ ఓపెన్ చేసినప్పుడు.. కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌లోని పుట్టిన తేదీ ఆధారంగా ఈ అదనపు వడ్డీ ఆటోమేటిక్‌గా వర్తిస్తుంది.

Also Read: రూ. 279 రీఛార్జ్ ప్లాన్.. ఎయిర్‌టెల్ యూజర్లకు పండగే పండగ.. 20కి పైగా ఓటీటీలు ఉచితం!

ఎస్‌బీఐ గ్రీన్ రుపీ టర్మ్ డిపాజిట్ (SGRTD)

Advertisement

పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించే లక్ష్యంతో ఎస్‌బీఐ ఈ ప్రత్యేక ‘గ్రీన్ డిపాజిట్’ స్కీమ్ ను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా సమీకరించిన నిధులను దేశంలోని పర్యావరణ అనుకూల (ఈకో-ఫ్రెండ్లీ) ప్రాజెక్టులు, పునరుత్పాదక ఇంధన (Renewable Energy) రంగానికి మాత్రమే రుణాలుగా అందిస్తారు. ఈ డిపాజిట్ పథకం మూడు ప్రత్యేక కాలపరిమితుల్లో అందుబాటులో ఉంది. 1,111 రోజులు, 1,777 రోజులు, 2,222 రోజుల వ్యవధితో స్కీమ్ లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. భారతీయ పౌరులు, మైనర్లు, సంస్థలు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. కనీసం రూ. 1,000తో పెట్టుబడి ప్రారంభించవచ్చు. గరిష్ట పరిమితి లేదు. సాధారణ ఎఫ్‌డీలతో సమానమైన వడ్డీ రేట్లతో పాటు సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీని ఇందులో అందించనున్నారు. అంతేకాకుండా ఈ డిపాజిట్‌పై రుణం లేదా ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం కూడా పొందే వెసులుబాటును ఎస్‌బీఐ కల్పించింది.

Also Read: జియో నుంచి అదిరిపోయే ప్లాన్.. రూ.111 రీఛార్జ్‌తో గేమింగ్, ఓటీటీ, స్నాప్‌చాట్+ ఫ్రీ!

Tags

Related News

రూ.3 లక్షల లోన్ కావాలా గ్యారెంటీ కూడా అవసరం లేదు.. కేంద్ర ప్రభుత్వ పథకం.. ఇలా అప్లై చేయండి

క్రిప్టో ప్రపంచంలో భారీ హ్యాకింగ్ కలకలం.. ఒక్క ల్యాప్‌టాప్‌తో వేల కోట్ల ముప్పు?

ఉద్యోగులకు కొత్త కంపెనీ బంపర్ ఆఫర్.. ఏ టైమ్‌లోనైనా పనిచేయండి, ఇష్టమొచ్చినప్పుడు సెలవులు

కొండపై మ్యాగీ అమ్ముతూ నెలకు రూ.4.5 లక్షలు.. ఈ వ్యాపారి సంపాదన మామూలుగా లేదుగా!

సమ్మెలో ఐడీబీఐ బ్యాంకులు ఉద్యోగులు.. కస్టమర్లకు బ్యాంకు కీలక సూచనలు

శాలరీ అకౌంట్‌ vs సేవింగ్స్ అకౌంట్.. రెండింటికీ తేడా ఏంటి? ఏ ఖాతా వల్ల ఎక్కువ లాభం?

వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీలు.. మీ జాబ్ భద్రంగా ఉండాలంటే ఈ 3 స్కిల్స్ తప్పనిసరి

Big Stories

Advertisement
×