E-Paper
Advertisement

ఓట‌మి భ‌యంతోనే సీనియ‌ర్లను దించుతున్నారు..టీమిండియాపై అక్త‌ర్ ఫైర్

ఓట‌మి భ‌యంతోనే సీనియ‌ర్లను దించుతున్నారు..టీమిండియాపై అక్త‌ర్ ఫైర్
Advertisement

Shoaib Akhtar On Asia Cup Rising Stars 2026:  ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ లో (ACC Men’s Asia Cup Rising Stars 2026) నేపథ్యంలో తాజాగా టీమిండియా జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది. ఈ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్ గా వ్యవహరించ‌నుండ‌గా రజత్ పటిదార్ వైస్ కెప్టెన్ గా ఫైనల్ అయ్యాడు. అయితే దీనిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ అంటే అండర్ 19 ప్లేయర్లు మాత్రమే ఉండాలని సెటైర్లు పేల్చుతున్నారు. పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓడిపోతుంద‌నే భ‌యంతోనే ఇలా సీనియ‌ర్ల‌ను తీసుకొచ్చిన‌ట్టు హేళ‌న చేస్తూ రియాక్ట్ అవుతున్నారు.

ఓట‌మి భ‌యంతోనే సీనియ‌ర్లను దించుతున్నారు..టీమిండియాపై అక్త‌ర్ ఫైర్

లేటెస్ట్ గా పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) కూడా దీనిపై స్పందించాడు. అది టీమిండియా-ఏ నా… లేక సీనియర్ల అంతర్జాతీయ జట్టా ? అంటూ టీమిండియా, బీసీసీఐ యాజ‌మాన్యంపై ఫైర్ అయ్యాడు. రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్ కోసం 33 సంవత్సరాలు దాటిన వాళ్ళని కూడా సెలెక్ట్ చేశారని ఆగ్రహించాడు. తిలక్ వర్మ నుంచి మొదలుకొని రజ‌త్ పటిదార్, షేజాద్ అహ్మద్, రింకు సింగ్ అందరూ సీనియర్ క్రికెటర్లేన‌న్నాడు. పాకిస్తాన్ చేతిలో ఓడిపోతామ‌నే భయంతో సీనియ‌ర్ల‌ను బరిలోకి బీసీసీఐ దింపిందని విమర్శలు చేశాడు. దీంతో షోయబ్ అక్త‌ర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ లను దింపుతున్నారు…పాకిస్తాన్ ప్లాన్ మార్చాల్సిందే

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ బరిలోకి దిగడంపై షోయబ్ అక్త‌ర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీని తట్టుకోవడం ఎవరి వల్ల కాదని వార్నింగ్ ఇచ్చాడు. అతడి కోసం కచ్చితంగా పాకిస్తాన్ సిద్ధం కావాలని సూచించాడు. 15 ఏళ్ల కుర్రాడు అయినప్పటికీ అతడికి మంచి టాలెంట్ ఉందన్నాడు. ఇలాంటి నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీని తక్కువగా అంచనా వేయకూడదని కోరాడు. అభిషేక్ శర్మ కూడా పాకిస్తాన్ పైన కసిగా ఆడతాడని.. విరాట్ కోహ్లీ కంటే ప్ర‌మాదం అని తెలిపాడు. ఈ ఇద్ద‌రిద‌నీ లైట్ తీసుకుంటే పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోవడం గ్యారంటీ అని షోయబ్ అక్త‌ర్ వార్నింగ్ ఇచ్చాడు. ఇది ఇలా ఉండగా ఆసియా కప్ రైసింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఆదివారం నవంబర్ 22వ తేదీన మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నమెంట్ నవంబర్ 19వ తేదీ నుంచి 29వ తేదీ వరకు కొనసాగుతుంది.

Advertisement

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

 

Related News

న‌లుగురు న్యూజిలాండ్ క్రికెట‌ర్ల‌కు గాయాలు…టీమిండియాను గెలిపిందుకే ఈ డ్రామాలంటూ క‌మ్రాన్ ఆరోప‌ణ‌లు!

న్యూజిలాండ్ ఎదురుదాడికి గుర్నూర్, అకీబ్ న‌బీ త‌ట్టుకోలేరు..ప్యాంట్లు త‌డిపేసుకుంటారు

బాబ‌ర్ ఆజం పెద్ద వెధ‌వ‌..సింప‌తీ కోసమే డ్రామాలు చేస్తున్నాడు

అభిషేక్, మ‌హ్మ‌ద్ అమీర్ SRHలోనే ఉంటే బాలీవుడ్ సినిమా రేంజ్ లో త‌న్నుకుంటారు

పాకిస్తాన్ కు భ‌య‌ప‌డే 33 ఏళ్లు దాటిన వాళ్ల‌ను దించుతున్నారు..ఇంజ‌మామ్ సంచ‌ల‌నం!

మహ్మద్ అమీర్ యమ డేంజర్.. వాడు ఐపీఎల్‌లోకి వస్తే కోహ్లీ, రోహిత్ లాంటోళ్లు తట్టుకోలేరు

మరోసారి పాకిస్తాన్, టీమిండియా మ్యాచ్..ఎప్పుడంటే? రివేంజ్‌కు సిద్ధమవుతున్న వైభవ్

Big Stories

Advertisement
×