BigTV English

HC on Extra Marital Affairs: భార్య వేరే వ్యక్తిని ప్రేమిస్తే.. అది అక్రమ సబంధం కాదు.. హై కోర్టు సంచలన తీర్పు..!

HC on Extra Marital Affairs: భార్య వేరే వ్యక్తిని ప్రేమిస్తే.. అది అక్రమ సబంధం కాదు.. హై కోర్టు సంచలన తీర్పు..!

HC on Extra Marital Affairs: ఒక భార్య భర్తను కాకుండా.. వేరే వ్యక్తిని ప్రేమించిన కూడా అది అక్రమ సంబంధం కాదంటూ మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దీంతో ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. వివాహేతర సంబంధాలపైన హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భర్త కాకుండా.. భార్య మరో వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకోకుండా, ప్రేమ, అనురాగం ఉంటే.. దానిని అక్రమ సంబంధంగా పరిగణించలేమంటూ స్పష్టం చేసింది. అయితే ఇటీవల ఓ వ్యక్తి వేసిన పిటిషన్ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది న్యాయస్థానం.


భార్యతో వేరుగా ఉంటూ.. ఆమెకు ఆర్థిక సహాయం ఇస్తున్న మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి, తన భార్య మరొక వ్యక్తిని లవ్ చేస్తుందని, గత కొద్ది రోజుల క్రితం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో తన భార్య భరణం పొందే అవకాశం లేదని కోర్టులో వాదించాడు. అయితే భావోద్వేగ ప్రమేయం అక్రమ సంబంధం కిందకు రాదని.. కోర్టు తాజాగా అతని పిటిషన్‌ను కొట్టివేసింది. అక్రమ సంబంధానికి.. లైంగిక సంపర్కం తప్పనిసరి అని కూడా తీర్పును ఇచ్చింది.

దీంతో ఫ్యామిలీ కోర్టు ఆదేశాన్ని సవాల్ చేస్తూ.. అతను మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే ఈ పిటిషన్ పైన హైకోర్టులో విచారణ జరిపి అక్కడ కూడా విచారణ కొనసాగించింది. భారతీయ నాగరిక్ సురక్షిత సంహితులోని బీఎన్ఎస్ సెక్షన్ 144 ఆబ్లిక్  క్రిమినల్ ప్రొసీజర్ కోర్టులోని సీఆర్పీసీ సెక్షన్లను 125 ఆబ్లిక్ 4 ప్రస్తావిస్తూ.. భార్యకు అక్రమ సంబంధం ఉందని నిజమైతే ఆమెకు భరణం నిరాకరించబడుతుందని వివరించింది.


అయితే శారీరక సంబంధానికి సంబంధించిన ఎలాంటి ఫ్రూఫ్ లేకుండా.. ఆమెకు ఎఫైర్ ఉందనే ఆరోపణలు మాత్రం కోర్టులో చెల్లవని వెల్లడించింది. ఎలాంటి శారీరక సంబంధం లేకుండా ప్రేమించడాన్ని తప్పుగా పరిగణించలేమని కోర్టు చెప్పేసింది. భర్తతో విడిగా ఉంటున్నటి వంటి ఆమెకు చట్టప్రకారం భరణం నెలకు నాలుగు వేలు ఇవ్వాల్సిందే అంటూ కోర్టు తీర్పునిస్తూ.. భర్త వేసినటువంటి పిటిషన్ కోర్టు కొట్టివేసింది.

Also Read: ఇండియాలో ఎయిర్ అంబులెన్స్‌.. వచ్చే ఏడాదిలో ప్రారంభించే ఛాన్స్

దీంతో ఈ న్యూస్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇక దీనికంటే ముందు కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఇటీవల హాట్ టాపిక్‌గా మారింది. వివాహేతర సంబంధంలో భార్య వేరే వ్యక్తితో లైంగిక సంబంధం పెట్టుకుని, పిల్లలను కనేటువంటి విషయంలో సుప్రీంకోర్టు అప్పుడు కీలక తీర్పు వెలువరించింది. అపరిచిత వ్యక్తికి చెందిన బిడ్డకు తల్లి అయినప్పటికి చట్టబద్దమైన తండ్రి ఇప్పటికీ ఆ స్త్రీ భర్తగా ఉంటాడని పేర్కుంటూ గత కొన్ని రోజుల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హాట్ టాపిక్‌గా మారింది.

భార్యా భర్తలు వివాహం చేసుకున్నప్పుడు.. ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఉన్నప్పుడే ఇది వర్తిస్తుందని వెల్లడించింది. అలాంటి ఆసక్తికరమైనటువంటి తీర్పు వచ్చిన కొద్దిరోజులకే.. మధ్యప్రదేశ్‌లో తాజాగా ఈ తీర్పు వెలువడడంతో ఒక్కసారిగా ఈ వార్త వైరల్‌గా మారింది.

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×