BigTV English

Koil Alwar Thirumanjanam:మార్చి 21న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం ఎందుకంటే…

Koil Alwar Thirumanjanam:మార్చి 21న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం ఎందుకంటే…

Koil Alwar Thirumanjanam:తిరుమల శ్రీవారి ఆలయంలో కోయల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరపడం ఆచారంగా వస్తోంది.. ఉగాది, ఆణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ సంవత్సరం మార్చి 22వ తేదీన ఉగాది ఆస్థానం జరగనుంది. అందుకే మార్చి 21 మంగళవారం రోజు న ఆలయ అధికారులు కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 6 నుండి 11 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు


ఆళ్వారాలు అనగానే వెంటనే మనకు పన్నెండు మంది ఆళ్వారుల పేర్లు గుర్తుకు వస్తాయి. వారిలో కొయిల్ ఆళ్వార్ లేడు. దేవాలయాన్నే ఆళ్వార్గా చెప్పడం వైష్ణవ పరిభాష ఉద్దేశం.. కొయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే ప్రధాన దేవత ఉన్న ప్రదేశాన్ని అభిషేకించడమేనని విశిష్టర్ధం. ఆలయ పరిసరాలన్ని అందులోను ప్రత్యేకించి గర్భాలయాన్ని పవిత్రంగా ఉంచడం కోసమే జరిపే సేవ కొయిల్ ఆళ్వార్ తిరుమంజనం.

తిరుమల గర్భాలయంలో స్వయంవ్యక్త సాలిగ్రామ శిలామూర్తిగా కొలువైన పవిత్ర గర్భాలయ స్థానమే ఆనందనిలయం. ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశ్యం. కులశేఖరపడి మొదలు మహాద్వారం వరకు ఆలయ అధికారులు, ఉద్యోగులు శుద్ధి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు.


Rudraksha:రుద్రాక్ష ఎలా పుట్టింది?

Viveka case : అవినాష్ రెడ్డికి హైకోర్టులో షాక్.. సీబీఐ నెక్ట్స్ స్టెప్ ఏంటి..?

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×