BigTV English

Thar Movie : భర్త ఊరెళ్ళితే ప్రియుడితో ఆ పని చేసే భార్య … సస్పెన్స్ తో అదరగొట్టే యాక్షన్ థ్రిల్లర్

Thar Movie : భర్త ఊరెళ్ళితే ప్రియుడితో ఆ పని చేసే భార్య … సస్పెన్స్ తో అదరగొట్టే యాక్షన్ థ్రిల్లర్

Thar Movie : యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను తెరకెక్కించడానికి బాలీవుడ్ ఒక అడుగు ముందు ఉంటుంది. ఈ సినిమాలను ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తారు. కొత్త కొత్త కథలతో యాక్షన్ సినిమాలను తీస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు దర్శకులు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ రాజస్థాన్లోని ఇండియా, పాకిస్తాన్ బోర్డర్ లో ఉండే ఒక గ్రామం చుట్టూ తిరుగుతుంది. ఆ గ్రామంలో జరుగుతున్న వరుసహత్యలను పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


నెట్ఫ్లిక్స్ (Netflix) లో

ఈ బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘థార్’ (Thar). 2022 లో వచ్చిన ఈ థార్ మూవీకి రాజ్ సింగ్ చౌదరి దర్శకత్వం వహించారు. ఈమూవీని  అనిల్ కపూర్, హర్షవర్ధన్ కపూర్ నిర్మించారు. 80వ దశకంలో స్టోరీ జరిగిన నేపథ్యంలో మారుమూల ఉన్న ఒక గ్రామానికి, వెళ్లే ఒక నగర వ్యక్తి చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఇందులో అనిల్ కపూర్, హర్షవర్ధన్ కపూర్, ఫాతిమా సనా షేక్ నటించారు. ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో, థార్ ఉత్తమ వెబ్ ఒరిజినల్ ఫిల్మ్, ఉత్తమ నటుడు, వెబ్ ఒరిజినల్ ఫిల్మ్‌లో ఉత్తమ నటితో సహా 5 నామినేషన్లను అందుకుంది. వెబ్ ఒరిజినల్ ఫిల్మ్‌లో ఉత్తమ సహాయ నటుడిగా గెలుచుకుంది. ఈ మూవీ ఓ టి టి ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

రాజస్థాన్లోని ఇండియా, పాకిస్తాన్ బోర్డర్ లో ఉండే ఒక గ్రామంలో, సురేఖ సింగ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తూ ఉంటాడు. ఆ ప్రాంతంలో రెండు హత్యలు జరుగుతాయి. ఈ కేసును సురేఖ సింగ్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. మరోవైపు భవిత అనే అమ్మాయి బాయ్ ఫ్రెండ్ తో ఏకాంతంగా గడుపుతూ ఉంటుంది. ఆమెకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు డబ్బులు కూడా సర్దుతూ ఉంటారు. ఇంతలోనే ఒక దొంగల ముఠా వీరి ఇంట్లోకి ప్రవేశించి, భవిత తల్లిదండ్రులను చంపి వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని వస్తువులను తీసుకెళ్తారు. వాటిలో మత్తు పదార్థాలు కూడా ఉంటాయి. సురేఖ సింగ్, భవితను ఎలా జరిగిందని అడుగుతాడు. వాళ్ళు ఎవరో తనకు తెలియదని, ఆ సమయంలో ఇంట్లో లేనని అబద్ధం చెప్తుంది. ఎందుకంటే ఆ సమయంలో ఆమె బాయ్ ఫ్రెండ్ తో ఉంటుంది కాబట్టి అబద్ధం చెప్తుంది. ఆ తర్వాత సిద్ధార్థ్ అనే వ్యక్తి ఫునా కోసం అతని ఇంటికి వస్తాడు. అతని భార్య చేతన మాత్రమే ఉంటుంది. తర్వాత రెండు రోజుల్లో తిరిగి వస్తాడని చెప్తుంది.

ఆ తర్వాత ఫునాతో, సిద్ధార్థ్ ఒక డీల్ చేసుకొని బయటికి వెళ్తారు. అయితే సిద్ధార్థ్ ఫునా ని ఒకచోట బంధిస్తాడు. ఆ తర్వాత అతని భార్యతో ఏకాంతంగా కూడా గడుపుతాడు. ఇంతకుముందు రెండు హత్యలు చేసింది సిద్ధార్థ. ఇప్పుడు ఫునా తో పాటు మరో ఇద్దరిని కూడా బంధించి చిత్రహింసలు పెడుతుంటాడు. మరోవైపు పోలీసులు దోపిడీ దొంగలను వెంబడించి చంపుతారు. సురేఖ సింగ్ పై మున్నా ఖాన్ అనే గ్యాంగ్ స్టర్ టార్గెట్ చేస్తూ ఉంటాడు. నిజానికి సిద్ధార్థ ఈ హత్యలను ఒక బలమైన కారణంతో చేస్తుంటాడు. ఆ ఊరిలో ఉన్న కొంతమంది దొంగతనానికి వచ్చి, సిద్ధార్థ భార్యపై అఘాయిత్యం చేసి చంపేస్తారు. దానికి రివేంజ్ గా సిద్ధార్థ ఈ హత్యలు చేస్తుంటాడు. చివరికి సిద్ధార్థ్ తన పగ తీర్చుకుంటాడా? రంజిత్ సింగ్ ఈ కేసులను ఎలా డీల్ చేస్తాడు? భవిత, చేతన స్టోరీలు ఏమవుతాయి? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని చూడాల్సిందే.

Related News

OTT Movie : అమ్మాయిల్ని చంపి చేపలకు ఆహారంగా వేసే సైకో… గ్రిప్పింగ్ స్టోరీ, థ్రిల్లింగ్ ట్విస్టులు

OTT Movie : ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్… పోలీసులకు అంతుచిక్కని వరుస మర్డర్స్ కేసు… కేక పెట్టించే మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : అర్దరాత్రి కార్లో ఏకాంతంగా లవర్స్… పోలీస్ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్… గుండె జారిపోయే రియల్ స్టోరీ

OTT Movie : నలుగురు అబ్బాయిలు ఒకే అమ్మాయితో… ఈ ఆడపులి రివేంజ్ కాటేరమ్మ జాతర మావా

OTT Movie : పెళ్ళైన మహిళ మరో వ్యక్తితో… మర్డర్స్ తో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్… ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్

OTT Movie : ట్రాన్స్ జెండర్ల బ్రూటల్ రివేంజ్… ఒక్కో ట్విస్టుకు గూస్ బంప్స్… పెద్దలకు మాత్రమే ఈ మూవీ

OTT Movie : షార్ట్ ఫిలిం పేరుతో బీచ్ కి తీసుకెళ్లి… టీనేజ్ అమ్మాయితో ఆ పని… మస్ట్ వాచ్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie :సిటీ జనాల్ని చితగ్గొట్టే డిమాన్స్… సూపర్ హీరోలనూ వదలకుండా దబిడి దిబిడే

Big Stories

×