BigTV English

RGV : ఆర్జీవికి మోహన్ బాబు అంటే ఎందుకంత కోపమో తెలుసా..?

RGV : ఆర్జీవికి మోహన్ బాబు అంటే ఎందుకంత కోపమో తెలుసా..?

RGV : తెలుగు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma ) గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు హిట్ సినిమాలతో బిజీగా ఉన్న వర్మ గారు ఇప్పుడు మాత్రం ఇండస్ట్రీలో వివాదాలకు కేరాఫ్ గా మారారు. సినిమాల గురించే కాదు రాజకీయాల గురించి కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఇక ముక్కు సూటితనంతో తాను అనుకున్నది అవతలి వాళ్లకు చెప్పేస్తాడు. అయితే ఇది కొంతమందికి నచ్చుతుంది. కానీ మరి కొంతమందికి కోపాన్ని తెప్పిస్తుంది.. ఎవరు ఎలా పోతే నాకెందుకు అని వర్మ తన తీరుని మార్చుకోడు.. తాజాగా ఆయన ఓ సినిమా ఈవెంట్ లో మాట్లాడిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇంతకీ ఆ వీడియోలో వర్మ ఎవరి గురించి మాట్లాడారో అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం..


తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు ఆర్జీబి పేరు వింటే వరుస హిట్స్ సినిమాలు టక్కున గుర్తొచ్చేవి.. ఎందుకంటే ఆయన తీసిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని అందుకున్నాయి. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు ఆయనతో సినిమాలు చేశారు. ఒక తెలుగులో మాత్రమే కాదు హిందీలో కూడా ఆయన పలు సినిమాలకు దర్శకత్వం వహించారు. అయితే వర్మ చేసిన సినిమాలు అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక వర్మ సినిమాల చేయడమే కాదు సినిమా ఈవెంట్లకు కూడా వెళ్తూ ఆ సినిమాపై ప్రశంసలు కురిపిస్తారు. ఒక్కొక్కసారి ఆయన కోపం వస్తే ఏమంటాడో తెలియకుండానే అనేస్తాడు. ఎన్నోసార్లు వివాదాలను కోరి మరి తెచ్చుకున్నారు ఆర్జీవి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి వైరల్ గా మారింది.

Also Read: అక్కినేని ఫ్యామిలీకి దిమ్మతిరిగే షాక్.. సూపర్ స్టార్ అంటే అంత పిచ్చేంటి గురూ..!


ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. మోహన్ బాబు, ( Mohan Babu ) దాసరి నారాయణరావు ( Dasari narayanarao ) , జయ సుధ ( Jayasudha ) వంటి స్టార్స్ ఆ ఈవెంట్లో కనిపిస్తున్నారు. వర్మ స్టేజ్ మీద మాట్లాడుతూ కనిపిస్తున్నాడు. ఆయన మాట్లాడుతూనే నాకు మోహన్ బాబు అంటే కోపం ద్వేషం అని అన్నాడు. ఎందుకంత కోపం అని అందరికీ డౌట్ రావచ్చు. నేను ఒకరోజు రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తుంటే గోడపై ఒక పోస్టర్ ని చూశాను. ఆ పోస్టర్లో అందమైన అమ్మాయి కనిపిస్తుంది. ఆమె ఎవరో కాదు హీరోయిన్ జయసుధ. ఆమె అందానికి ఫిదా అయిపోయి ఫ్యాన్ అయిపోయాను. అలాంటి అందమైన అమ్మాయిని మోహన్ బాబు ఏడిపించడం నాకు నచ్చలేదు అందుకే మోహన్ బాబు అంటే కోపం అని పబ్లిక్ గానే చెప్పేసాడు. అంతేకాదు అందుగల కారణాన్ని కూడా ఆర్జీవి చెప్పడంతో అందరూ పల్లున నవ్వారు. జయసుధ మోహన్ బాబు కాంబినేషన్లో శివరంజని అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో అందమైన జయసుధను మోహన్ బాబు ఏడిపిస్తాడు అది నాకు నచ్చలేదు అందుకే మోహన్ బాబు అంటే నాకు ద్వేషం అని చెప్పడంతో అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా నవ్వారు. ఆ వీడియోనే ప్రస్తుతం వైరల్ గా మారింది.. ఇక ఆర్జివి సినిమాల విషయానికొస్తే.. ఈమధ్య అన్ని వివాదాస్పద సినిమాలనే తెరకెక్కిస్తున్నారు.. ప్రస్తుతం శారీ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.. ఆ మూవీ త్వరలోనే విడుదల కాబోతుందని ప్రకటించారు కానీ ఇప్పుడు వాయిదా పడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి మరి దీనిపై వర్మ ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×