Telangana BJP: ఆషామాషీ సమావేశం కాదది…ఏకంగా ప్రధాని మోడీతో బ్రేక్ ఫస్ట్ మీటింగ్, అక్కడ జరిగిన అంతర్గత అంశాలు, చర్చలు… ఆలోచన లేకుండా లీకులు చేస్తున్నారా? బీజేపీలో నేతల మధ్య తగవులు, విభేదాల పంచాయితిలే ఇప్పటి వరకు మైనస్ అనుకుంటున్న ఆ పార్టీ అధినాయకత్వానికి.. తాజాగా లీకులు , లీకు వీరులుతో కొత్త తలనొప్పి మొదలైందంట.. లీకులు చేస్తే మార్కులు పడతాయనుకుని ఏపీ బీజేపీ ఎంపీలు భావిస్తున్నట్లు కనిపించారని… కానీ హై కమాండ్ దృష్టిలో మాత్రం లీకుల వీరులుగా మిగిలిపోయారన్న టాక్ నడుస్తోంది..? ఇంతకీ ా లీకులేంటీ..? లీకులు చేసిన ఇంటి దొంగలు ఎవరు..?
ఢిల్లీ వేదికగా తెలంగాణ బీజేపీ ఎంపీలతో ప్రధాని మోడీ ఇటీవల నిర్వహించిన బ్రేక్ ఫస్ట్ సమావేశం ఇప్పుడు పరివార్ పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది. రాష్ట్రంలో పార్టీ పనితీరుపై ప్రధాని పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం చేశారని, అసద్దుద్దీన్ లెక్క దిగజారుడు రాజకీయాలు చేస్తారా..? రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారా..? లేక అధికార పక్షంతో కలిసి తిరుగుతున్నారా..? అని మోడీ మండిపడ్డారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ బ్రేక్ ఫస్ట్ అంతర్గత సమావేశ వివరాలను గోప్యంగా ఉంచుకోవాల్సింది పోయి, వాటినీ మీడియాకు లీకులివ్వడంపై అటు ఢిల్లీ నాయకత్వం, ఇటు రాష్ట్ర నాయకత్వం అగ్గిమీద గుగ్గిలమవుతుందట.
రాష్ట్ర బీజేపీ నేతల పంచాయతీలపై అప్పటికే ఆ పార్టీ సంస్థగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ గట్టిగానే అక్షింతలు వేశారే టాక్ ఉంది. ఇక ఫైనల్ టచ్ బ్రేక్ ఫస్ట్ సమావేశంలో ఎంపీలను ఉద్దేశించి మోడీ ప్రధానంగా పలు అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో విఫలం అవుతోందని,. కేంద్ర పథకాలను, పార్టీ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందని, ఆ క్రమంలో తగవులకు ఫుల్‌స్టాప్ పెట్టి, సమన్వయంగా కదలాలని పీఎం ఎంపీలకు మొట్టికాయలు వేశారంట. అసద్దుద్దీన్ రాజకీయాలు చేయకండి, క్షేత్రస్థాయిలో చురుకుగా ముందుకు వెళ్లడంలో విఫలం అవుతున్నారంటూ ఎంపీలపై ప్రధాని తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారంట. . అంతర్గత సమావేశంలో జరిగిన ఆ అంశాలు బయటకు ఎలా లీక్ అయ్యాయన్నదే ఇప్పుడు అసలు పంచాయితీ.
అంతర్గత సమావేశం వివరాలు బయటకు ఎలా వచ్చాయి అన్నది అటుంచితే, ఈ లీక్ లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భగ్గుమన్నారంట. ఎప్పుడూ రానంత కోపం, ఆవేశం ఆయనలో కనిపించదని టాక్. ఎవరో కావాలనే లీక్ చేశారని, మోడీతో అంతర్గత సమావేశ అంశాలను లీక్ చేసి వారి పరువు వారే తీసుకున్నారని అసహనం వ్యక్తం చేశారంట. లీక్ వీరులు ఎవరో తెలిస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారంటున్నారు. పార్టీలోని నేతల మధ్య అంతర్గత వర్గపోరు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం, ప్రత్యర్థులను దెబ్బతీయడం కోసం నేతలు కావాలనే ఈ వివరాలను లీక్ చేశారనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. మొన్న బీఎల్ సంతోష్ ట్రీట్మెంట్, నిన్న ప్రధాని హెచ్చరికలు, ఇవాళ కిషన్ రెడ్డి ఆగ్రహం వెనుక, తెలంగాణ బీజేపీలో నడుస్తున్న పాత-కొత్త నేతల మధ్య ఆధిపత్య పోరే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. లీకులు చేసింది ఎవరన్న దానిపై పార్టీ అంతర్గత విచారణ మొదలైనట్లుగా తెలుస్తోంది. సీక్రెట్ గా ఉండాల్సిన అంశాలు బయటకు పొక్కడం… తెలంగాణ బీజేపీలో భవిష్యత్తులో మరో అంతర్గత యుద్ధానికి సంకేతంగా మారిందన్న టాక్ నడుస్తుంది.
తెలంగాణ ఎంపీలను అసడ్డుద్దీన్ రాజకీయంతో పోల్చి మోడీ క్లాస్ తీసుకున్నారా లేదా అన్నది అటుంచితే… ఎంపీలకు ప్రధాని మోడీ ఇచ్చిన ట్రీట్మెంట్ ఇప్పుడు ఆ పార్టీలో రచ్చ రేపుతోంది. అంతర్గతంగా, గోప్యంగా ఉండాల్సిన సమావేశ అంశాలు బయటకు ఎలా వచ్చాయి..? ఎవరు లీకులు చేశారు..? ఈ లీకుల వెనుక ఎవరున్నారు..? బీజేపీలో లీకుల పంచాయితీ ఏంటీ..? ఎక్కడ ఏం జరిగిన మూలాలు హైదరాబాద్ లో బయట పడుతాయి అన్నట్టుగా.. ఆ పార్టీలో ఎక్కడేం జరిగిన ఇక్కడ మంటలు పుట్టడం వెనక కారణాలేంటి..? మోడీ బ్రేక్ ఫస్ట్ మీటింగ్ పై లీకుల రాయుల్లెవరు..?దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎప్పుడూ లేనంత ఆగ్రహంతో అంత రియాక్ట్ ఎందుకు అయ్యారు..? లీకు వీరులు ఎవరో తెలిస్తే వారిపై యాక్షన్ ఉంటుందా..? అన్న చర్చ జరుగుతోంది
బీఎల్ సంతోష్ ట్రీట్మెంట్ సరిపోలేదా..? మోదీ అసంతృప్తి ఎంపీలకు మింగుడు పడలేదా.? కిషన్ రెడ్డి ఆగ్రహం వెనక అధిష్టాన పెద్దలున్నారా..? లీక్ వీరులను అధిష్టానం గుర్తిస్తుందా..? లీక్ వీరులపై అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, లీకు వీరులపై వేటు పడుతుందా.? లీక్ వీరులపై రాష్ట్ర నాయకత్వం ఎలా స్పందిస్తుంది. అన్నది సస్పెన్స్ గా మారింది.
Story by Marireddy, Big Tv