E-Paper
Advertisement

రైలు టికెట్ కన్ఫర్మ్ కావడం లేదా? పండుగ వేళ ఇలా బుక్ చేసుకోండి!

రైలు టికెట్ కన్ఫర్మ్ కావడం లేదా? పండుగ వేళ ఇలా బుక్ చేసుకోండి!
Advertisement

Festival Train Ticket Booking Tips: పండుగ సీజన్ మొదలైతే చాలు.. సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులతో రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతుంటాయి. దసరా, దీపావళి, ఛత్ పూజ లాంటి పండుగల సమయంలో రైలు ప్రయాణానికి డిమాండ్ భారీగా పెరుగుతుంది. దీంతో చివరి నిమిషంలో కన్ఫర్మ్ టికెట్ దొరకడం చాలా కష్టం అవుతుంది. అయితే, కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను ప్రయత్నిస్తే ప్రయాణం ఈజీ కానుంది.

రిజర్వేషన్ ఓపెన్ కాగానే బుక్ చేసుకోండి!   

పండుగ సమయంలో ప్రయాణం చేయాలనుకునేవారు వీలైనంత ముందుగానే టికెట్ బుక్ చేసుకోవడం మంచిది. రిజర్వేషన్ విండో ఓపెన్ అయిన వెంటనే బుక్ చేస్తే కన్ఫర్మ్ బెర్త్ దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆలస్యం చేస్తే వెయిటింగ్ లిస్ట్ పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పండుగకు ముందు, తర్వాత రోజుల్లో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ముందస్తు ప్లానింగ్ చాలా ఉపయోగపడుతుంది.

డైరెక్ట్ టికెట్ దొరకకపోతే ఎలా?

Advertisement

ఒకే రైలులో మీరు వెళ్లాల్సిన ప్రదేశానికి కన్ఫర్మ్ టికెట్ అందుబాటులో లేకపోతే దూరాన్ని బట్టి ప్రయాణాన్ని రెండుగా ప్రయత్నించండి. హైదరాబాద్ నుంచి విజయవాడకు నేరుగా టికెట్ దొరకడం కష్టంగా ఉంటే.. ముందుగా హైదరాబాద్ నుంచి నడికుడి ఒకరు ఒక రైలులో, అక్కడి నుంచి విజయవాడకు మరో రైలులో వెళ్లే అవకాశాన్ని ట్రై చేయండి. మధ్యలో ముఖ్యమైన స్టేషన్లను ఎంచుకుని వేర్వేరు రైళ్లలో సీట్ల అవైలబులిటీని చెక్ చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో ఖాళీ బెర్త్ దొరికే అవకాశం ఉంటుంది.

ఒక్క రైలుపైనే ఆధారపడకండి!

మీరు వెళ్లాల్సిన మార్గంలో ఒక రైలుకు వెయిటింగ్ లిస్ట్ ఎక్కువగా ఉంటే, అదే రూట్‌ లో నడిచే ఇతర రైళ్లను కూడా చెక్ చేయండి. బయలుదేరే సమయం, రైలు నంబర్, గమ్యస్థానం మధ్యలోని స్టేషన్లు మార్చి వెతికితే కొత్త ఆప్షన్లు కనిపిస్తాయి.  కొన్నిసార్లు ప్రయాణ సమయాన్ని కొద్దిగా మార్చుకోవడం వల్ల కూడా టికెట్లు దొరికే అవకాశం ఉంటుంది. అందుకే ఒకే రైలు, ఒకే సమయానికి పరిమితం కాకుండా అన్ని అవకాశాలను పరిశీలించడం మంచిది.

తత్కాల్ టికెట్ కూడా ఒక ఆప్షన్!

Advertisement

ముందస్తు రిజర్వేషన్‌ లో టికెట్ కన్ఫర్మ్ కాకపోతే తత్కాల్ బుకింగ్‌ ను కూడా ప్రయత్నించవచ్చు. అయితే, తత్కాల్ టికెట్లకు సాధారణ ఛార్జీల కంటే అదనపు చార్జీలు ఉంటాయి. అంతేకాకుండా సీట్లు పరిమితంగా ఉండటంతో బుకింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే అందుబాటులో ఉన్న బెర్త్‌ లు పూర్తయ్యే అవకాశం ఉంటుంది.

పండుగ స్పెషల్ రైళ్లను పరిశీలించండి!

పండుగల సమయంలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. సాధారణ రైళ్లలో టికెట్లు దొరకని సమయంలో వీటిని ట్రై చేయొచ్చు. అందుకే పండుగ ప్రయాణం ప్లాన్ చేసుకునేవారు ప్రత్యేక రైళ్లను గమనిస్తూ ఉండాలి. రైలు, తేదీ, సీట్ల లభ్యత లాంటి వివరాలను అధికారిక రైల్వే బుకింగ్ ఛానెళ్లలోనే చెక్ చేసి టికెట్ బుక్ చేసుకోవాలి. ముందుగానే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడం వల్ల పండుగ ప్రయాణంలో టికెట్ కోసం ఎదురయ్యే ఇబ్బందులను కొంతవరకు తగ్గించుకోవచ్చు.

Read Also: పండగకు ఊరెళ్లేవారికి సూపర్ న్యూస్.. చర్లపల్లి–శ్రీకాకుళం మధ్య 16 స్పెషల్ రైళ్లు!

Tags

Related News

గంటకు 350 కి.మీ.. భారత్ తయారు చేయనున్న కొత్త బుల్లెట్ రైలు ఇదే!

పండుగ వేళ ప్రయాణికులకు సూపర్ న్యూస్..1,000కు పైగా స్పెషల్ ట్రైన్లు వచ్చేస్తున్నాయ్!

భారత్‌లో పుట్టిన అద్భుత ఉక్కు.. వూట్జ్ స్టీల్ అసలు కథ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

ఫైరయిన పవర్ బ్యాంక్‌.. విమానంలో ఎగిసిపడిన మంటలు, అత్యవసరంగా ఆకాశం నుంచి మళ్లి

విమానంలో జ్యోతిర్లింగాల యాత్ర.. షిర్డీ, ఎల్లోరా కూడా!

ఒక రైల్ ఇంజిన్ ఎన్ని బోగీలను లాగగలదు.. రైల్వే బోగీల సంఖ్య ఎందుకు పెంచదు?

పండగకు ఊరెళ్లేవారికి సూపర్ న్యూస్.. చర్లపల్లి–శ్రీకాకుళం మధ్య 16 స్పెషల్ రైళ్లు!

Big Stories

Advertisement
×