Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ఈయన మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ బాబి (Bobby)దర్శకత్వంలో చిరంజీవి తన 158వ సినిమాగా “కాకా” (Kaaka)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా 2027 జనవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర నిర్మాతలు వెల్లడించారు.
ఈ విధంగా కాకా సినిమా విడుదల విషయంలో ఏ విధమైనటువంటి మార్పులు ఉండవనే విషయాన్ని నిర్మాతలు అధికారికంగా తెలియజేయడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఈ సినిమా షూటింగ్ పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాదులో ఒక షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుంది. ఇదిలా ఉండగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో భాగంగా కాకా సినిమాకు సంబంధించి కొన్ని లీక్స్ ఇచ్చారు. సాధారణంగా చిరంజీవి తన సినిమాలకు సంబంధించిన విషయాలను చిత్రబృందం అధికారకంగా ప్రకటించడాని కంటే ముందుగానే ఆయనే లీక్ చేస్తూ ఉంటారు.
ఇలా గతంలో కూడా చాలా సినిమాల విషయంలో చిరు లీక్స్ ద్వారా ఎన్నో విషయాలు తెలిసాయి. ఇప్పుడు తాజాగా కాకా సినిమా విషయంలో కూడా అదే కొనసాగుతూ వస్తోంది. ఈ కార్యక్రమానికి యాంకర్ గా స్రవంతి ఉన్నారు. అయితే చిరంజీవి స్రవంతితో మాట్లాడుతూ కాకా సినిమాలో నా క్యారెక్టర్ పేరు కూడా మీ ఊరి పేరే అంటూ తన పేరు “కదిరి కాళిదాస్”(Kadiri Kalidas) అని చిరంజీవి ఈ సందర్భంగా తెలియజేశారు. కాక సినిమాలో చిరంజీవి కదిరి కాళిదాస్ పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ విషయం లీక్ అవడంతో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది.
చిరు జోడిగా స్నేహ..
ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా స్నేహ నటించబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే యంగ్ బ్యూటీ అనస్వర రాజన్(Anaswara Rajan) కూడా ఈ సినిమాలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాబి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న రెండో సినిమా కావటం విశేషం. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో వాల్తేరు వీరయ్య సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. తాజాగా కాకా సినిమాని ప్రకటించడంతో ఈ సినిమాపై కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. మరి కాకా ద్వారా చిరంజీవి బాబి ఎలాంటి హిట్ అందుకోబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది.
Also Read: నాని ది ప్యారడైజ్ సినిమాకు సీక్వెల్..ఫుల్ క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!