BigTV English
Advertisement

Modi’s Operation South: మోదీ ఆపరేషన్ సౌత్..130 లోక్ సభ సీట్లే లక్ష్యం

Modi’s Operation South: మోదీ ఆపరేషన్ సౌత్..130 లోక్ సభ సీట్లే లక్ష్యం
Modi news today
Narendra Modi

Modi’s Operation South Plan: ఎలాగైనా దక్షిణ భారత్ లో సత్తా చాటాలి.. ఇదే లక్ష్యంతో బీజేపీ వ్యూహాల మీద వ్యూహాలు మారుస్తోంది. ఇప్పటికే వెలువడ్డ ప్రీ పోల్స్ లో సౌత్ లో కమలం పార్టీకి అంతగా అనుకూలత లేకపోవడంతో ఎన్నికల నాటికి ఆ ప్రతికూలతను తగ్గించుకుని మెజార్టీ సీట్లు సాధించే దిశగా ప్లాన్ చేస్తున్నారు. అయితే అనుకున్నంత ఈజీగా మాత్రం ఉంటుందని కమలం నేతలు అనుకోవడం లేదు. కానీ వారి దగ్గర మాస్టర్ స్ట్రాటజీ ఉందంటున్నారు.


ఎక్కడ కోల్పోయామో అక్కడే నెగ్గాలన్న టార్గెట్ తో బీజేపీ పని చేస్తోంది. అందుకే సౌత్ పై ఈసారి ప్రధాని మోదీ ఎక్కువ ఫోకస్ పెంచారు. గత రెండు నెలల్లో నాలుగుసార్లు దక్షిణ భారత్ పర్యటనకు వచ్చారు. ఆలయాల సందర్శనలు, పూజలు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. కమలం పార్టీకి సౌత్ ఇండియాకు మధ్య గ్యాప్ ను ఎన్నికల నాటికి వీలైనంత తగ్గించుకునే పనిలో ఉన్నారు. దక్షిణాదిన లోక్ సభ స్థానాల సంఖ్య చూస్తే ఏపీలో 25, తెలంగాణలో 17, తమిళనాడులో 39, కేరళలో 20, పుదుచ్చేరిలో 1, కర్ణాటకలో 28 లోక్ సభ స్థానాలతో కలిపితే మొత్తం 130. ఈ 130 స్థానాల్లో మెజార్టీ సీట్లు సాధించాలన్న టార్గెట్ తో కమలం నేతలు ప్లాన్ చేస్తున్నారు.

రాజకీయం, అధికారాల విషయంలో సౌత్, నార్త్ ప్రజల మధ్య భిన్నాభిప్రాయాలున్నట్లుగా పలు సర్వేల్లో వారు తెలిపిన అభిప్రాయాలు చూస్తే అర్థమవుతుంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు యాక్సిస్ మై ఇండియా నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో నెక్ట్స్ ప్రధానమంత్రి ఎవరు కావాలని కోరుకుంటున్నారన్న ప్రశ్నకు ప్రతిస్పందనగా ఒక్క దక్షిణాది మినహా దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలోనూ ఎక్కువ మంది రాహుల్ గాంధీ కంటే నరేంద్ర మోడీనే ఇష్టపడ్డారు.


Also Read: హర్యానాకు కొత్త సీఎం.. నాయబ్‌ సింగ్ సైనీ ప్రమాణస్వీకారం..

దక్షిణాది రాష్ట్రాల్లో 40 శాతం మంది రాహుల్ గాంధీ వైపు మొగ్గు చూపగా, అధికారంలో ఉన్న నరేంద్ర మోడీకి కేవలం 37 శాతం మంది మాత్రమే సపోర్ట్ ఇస్తున్నామని ప్రకటించారు. ఇప్పుడు ఇలాంటి సర్వే రిపోర్ట్ లు ఇంకా ఏవీ వెలువడలేదు గానీ.., రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దక్షిణ భారత్ లో చాలా ప్రభావమే చూపించింది. కాంగ్రెస్ గ్రాఫ్ పెరగడంలో ఈ యాత్ర ఉపయోగపడిందని సర్వేలు వెల్లడించాయి.

ఒకసారి 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఎక్కడెక్కడ సత్తా చాటిందో చూద్దాం. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో 2019 ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 185 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తే.. కాంగ్రెస్ మాత్రం కేవలం 5 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. అదే సమయంలో సౌత్ ఇండియాలో 130 లోక్ సభ స్థానాలు ఉంటే.. బీజేపీ కేవలం 29 ఎంపీ స్థానాలను మాత్రమే గెలుచుకుంది. అందులోనూ కర్ణాటకలోనే 25 ఎంపీ సీట్లు, మరో నాలుగు తెలంగాణలో గెలిచింది.

అంతే కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిలో కనీసం ఖాతా తెరవలేకపోయింది. అటు కర్ణాటకలో కాంగ్రెస్ గత ఎన్నికల్లో ఒక సీటు మాత్రమే గెలిచింది. కేరళలో 2019 ఎన్నికల్లో బీజేపీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకోలేకపోయింది. అయితే అనూహ్యంగా ఓట్ షేర్ ను మాత్రం 2.7 శాతం పెంచుకుంది. కమలం పార్టీ సైలెంట్ గా ఇక్కడ ఎదిగే ప్రయత్నాల్లో ఉంది. ఇటీవలే ప్రధాని మోదీ వరుస పర్యటనలు చేసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని వెళ్లారు. ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టారు.

Also Read: Amit Shah on CAA : సీఏఏను ఎప్పటికీ వెనక్కి తీసుకోం : హోం మంత్రి అమిత్ షా

సౌత్ లో ప్రస్తుతం బీజేపీ కంటే కాంగ్రెస్ కే ఎక్కువ సానుకూల వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే కర్ణాటక, తెలంగాణలో ఉన్నవి కాంగ్రెస్ ప్రభుత్వాలే. కర్ణాటకలో బీజేపీని, తెలంగాణలో బీఆర్ఎస్ ను ఓడించింది హస్తం పార్టీ. ఈ ప్రభుత్వాలు ఇటీవలే ఏర్పడ్డాయి. సో ఆ గెలుపు జోష్.. లోక్ సభ ఎన్నికల్లోనూ సహజంగానే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అటు కేరళలోనూ హస్తం పార్టీ చాలా బలంగా మారింది. పుదుచ్చేరిలోనూ స్ట్రాంగ్ గా ఉంది. మరోవైపు తమిళనాడులో డీఎంకేతో పొత్తులో రూలింగ్ లో ఉండడం కూడా కలిసి వచ్చే అంశంగా ఉంది. అయితే ఈ పరిస్థితిని ఎన్నికల నాటికి తమకు అనుకూలంగా మార్చుకోవాలని మోదీ, అమిత్ షా వ్యూహాలు పెంచుతున్నారు.

ఓట్లు సీట్లు పెంచుకోవాలని పార్టీలు అనుకోవడంలో తప్పు లేదు. కానీ నాయకులు మాట్లాడే మాటలు, వారి హామీలను జనం నమ్మితేనే సీట్లు వస్తాయి. ముఖ్యంగా తెలంగాణలో గత ఎన్నికల్లో అనూహ్యంగా 4 ఎంపీ స్థానాలు గెలిచిన బీజేపీ ఈసారి మరింత పాగా వేయాలనుకుంటోంది. ప్రస్తుతం ప్రీపోల్ సర్వేలు వెల్లడించిన ప్రకారం తెలంగాణలో హస్తం పార్టీకి పదికి పైగా ఎంపీ సీట్లు వస్తాయని తేలింది. దీంతో ఈ లెక్కలను తారుమారు చేయాలన్న టార్గెట్ తో బీజేపీ పని చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. కాళేశ్వరం బీఆర్ఎస్ కు ఏటీఎంలా మారిందని పదే పదే విమర్శించిన బీజేపీ పెద్దలు.. తాము తెలంగాణలో అధికారంలోకి వచ్చాక దర్యాప్తు చేస్తామని అప్పట్లో బహిరంగ వేదికల్లో ప్రకటించారు.

కేంద్రంలో అధికారంలో ఉన్నా.. ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారన్న ప్రశ్నలు జనంలో అలాగే ఉండిపోయాయి. ఇక తాజాగా ప్రధాని మోడీ ఆదిలాబాద్, సంగారెడ్డి పర్యటనల్లోనూ కాంగ్రెస్, బీఆర్ఎస్ టార్గెట్ గా విమర్శలు చేశారు. తెలంగాణను దోచుకోవడంలో ఇద్దరూ కలిసే ఉన్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో బీఆర్‌ఎస్‌ కోట్లాది రూపాయలను దోచుకుందని, అయితే కాంగ్రెస్‌ సర్కార్ ఏం చేస్తోందని మోదీ ప్రశ్నించి వెళ్లారు. బీఆర్‌ఎస్‌ అవినీతిపై విచారణ ఎందుకు చేయట్లేదన్నారు. ఫైళ్లు తవ్వి.. వాస్తవాలన్నీ దాస్తోందని, కాళేశ్వరం అవినీతిలో కాంగ్రెస్‌ పాత్ర ఉండటం వల్లే చర్యలు తీసుకోవడం లేదంటూ మాట్లాడారు.

Also Read: పౌరసత్వ సవరణ చట్టం-2019 అమలుకు చర్యలు.. నోటిఫికేషన్ జారీ

అయితే ప్రధాని మోడీ విమర్శలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు కౌంటర్లు కూడా వేశారు. అసలు మ్యాటర్ ను జనాలకు వివరిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటే అని అంటున్న కాంగ్రెస్… ఒకవేళ సీబీఐ ఎంక్వైరీ వేస్తే కాళేశ్వరంపై విచారణ మొదటికే వస్తుందన్న ఉద్దేశంతో ఉంది. ఇందులో అవినీతికి పాల్పడిన వారిని పకడ్బందీగా ఫిక్స్ చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ చిత్తశుద్ధితో ఉందని ఆ పార్టీ నేతలు వాదిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో కమిటీ వేయాలని కోరడం, కేంద్రం వేయడం, ఆ కమిటీ సభ్యులు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించడం జరిగిపోయాయి. ఇక రిపోర్ట్ వస్తే అందుకు తగ్గట్లుగా ఎలాంటి విచారణ చేయాలన్నది డిసైడ్ కానుంది. ఇవన్నీ వివరిస్తూ మోడీ ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు.

ఇక కర్ణాటకలో గత ఎన్నికల్లో 25 సీట్లు గెలిచిన బీజేపీ ఇప్పుడు ఆ సీట్లను కాపాడుకునే పనిలో ఉంది. ఒక దశలో దేవెగౌడ, కుమారస్వామివి వారసత్వ రాజకీయాలు అంటూ తీవ్రస్థాయిలో విమర్శించిన బీజేపీ పెద్దలు చివరకు ఆ పార్టీతోనే పొత్తులు కుదుర్చుకుని లోక్ సభ పోటీకి సిద్ధమయ్యారు. మరోవైపు బీజేపీలో కీలక నేతగా ఉన్న యడియూరప్ప, ఆయన కుమారులకు కీలక పదవులు ఇవ్వడం ద్వారా బలమైన లింగాయత్ లను ఆకర్షించే పనిలో ఉన్నారు. యడియూరప్పకు వయసు మీరినా కర్ణాటకలో ఆయననే మోదీ, అమిత్ షా నమ్ముకుంటున్నారు.

ఇక కేరళలో బీజేపీ గత సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదు. 12.9 శాతం ఓట్లను మాత్రం సాధించింది. కేరళ ప్రజల మనసులను గెలిచేందుకు ఇటీవలి కాలంలో ప్రధాని మోడీ చేయని ప్రయత్నమంటూ లేదు. ఆపరేషన్ ఆకర్ష్ పెద్ద ఎత్తున నడుస్తోందక్కడ. ఈసారి కేరళలో బీజేపీ 10కి పైగా సీట్లు గెలుస్తుందన్న ధీమాతో ప్రధాని మోడీ ఉన్నారు. కేరళలో లెఫ్ట్, కాంగ్రెస్ కొట్లాటలో తమ హవా పెంచుకోవాలన్న ఉద్దేశంతో కమలం పార్టీ ఉంది.

Also Read: Central Cabinet Decisions : కేబినెట్ మీటింగ్‌లో కేంద్రం కీలక నిర్ణయాలు.. ఢిల్లీ మెట్రో విస్తరణకు ఆమోదం

తమిళనాడులో ఎప్పటి నుంచో సత్తా చాటాలని భావిస్తూ వచ్చిన బీజేపీ అందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ సారి మాత్రం అభివృద్ధి మంత్రంతో తమిళ ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చాలా గట్టిగానే చేస్తోంది. పార్టీలతో సంబంధం లేకుండా తమిళ ప్రజలకు కేంద్రం అన్ని విధాల అండగా ఉంటుందని పదే పదే చెప్పడం ద్వారా తమిళ ప్రజల్లో స్థిరమైన చోటు సంపాదించుకునే ప్రయత్నాలను మోదీ ముమ్మరం చేశారు. మొత్తంగా ఆపరేషన్ సౌత్ ఈసారి బీజేపీకి కలిసి వస్తుందా లేదా అన్నది కీలకంగా మారింది.

కర్ణాటక కరుణిస్తే కాస్తయినా స్కోరు మిగులుతుంది. లేకపోతే గత ఎన్నికల్లో వచ్చిన సీట్లు కూడా రావడం కష్టమే అన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పటికే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సహా మంత్రుల బృందం ఢిల్లీలో ఇటీవలే నిరసనల్లో పాల్గొన్నది. కర్ణాటకకు నిధుల విషయంలో కేంద్రం పక్షపాత ధోరణి ప్రదర్శిస్తోందని, రావాల్సిన నిధులను రాకుండా అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ఈ లెక్కలు కూడా వచ్చే ఎన్నికల్లో కీలకంగా మారబోతున్నాయి. ఇవన్నీ ప్రతికూలతలను దాటుకుని సౌత్ లో కమలం ఎలా వికసిస్తుందో చూడాలి.

Related News

India VS Pakistan: పవర్‌ఫుల్‌గా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్! యుద్ధం ఖాయమేనా?

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

KCR Campaign: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ రానట్లేనా?

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌లో.. కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం

Donald Trump: ఎవరీ జొహ్రాన్‌ మమ్దానీ? న్యూయార్క్ మేయర్ బ్యాక్ గ్రౌండ్ ఇదే

Suicide Incidents: బతకండ్రా బాబూ! అన్నింటికీ ఆత్మహత్యే పరిష్కారమా?

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Jubilee Hills Bypoll: నవంబర్ సెంటిమెంట్.. బైపోల్స్‌లో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా!

Big Stories

×