BigTV English

Rashmika’s Second DeepFake Video: రష్మిక మందన్న మరో డీప్‌ఫేక్ వీడియో.. ఈ సారి మరింత దారుణంగా..!

Rashmika’s Second DeepFake Video: రష్మిక మందన్న మరో డీప్‌ఫేక్ వీడియో.. ఈ సారి మరింత దారుణంగా..!

Rashmika Deepfake Video news


Rashmika mandanna’s 2nd Time Deepfake Video Goes Viral in Social Media: ప్రస్తుతం ప్రపంచమంతా టెక్నాలజీని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని మరింత డెవలప్‌ చేసుకుంటున్నాయి. అయితే ఈ క్రమంలో ఆ టెక్నాలజీని ఉపయోగించే వారు ఎందరున్నారో.. అంతకంటే ఎక్కువ మంది ఆ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ టెక్నాలజీని ఉపయోగం లేని పనులకు కొందరు వాడుతున్నారు. అందులో డీప్‌ఫేక్ టెక్నాలజీ ఒకటి. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని ఉపయోగించి ఈ డీప్‌ఫేక్ వీడియోలు, ఫొటోలు క్రియేట్ చేస్తున్నారు. ఈ మధ్య ఈ వ్యవహారం బాగా ముదిరిపోయింది.


ఏఐ టెక్నాలజీని ఎంతో మంది మంచి పనుల కోసం వాడుతుంటే.. కొందరేమో తమ మందబుద్ది దోరణితో టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ డీప్‌ఫేక్ వీడియోలతో సెలబ్రెటీలను టార్గెట్ చేస్తున్నారు. వేరే వాళ్ల బాడీకి సెలబ్రెటీల ఫేస్‌ని యాడ్ చేసి ఎడిటింగ్ చేస్తున్నారు.

Also Read: Rashmika Mandanna : హాట్ ఫొటోలు లీక్.. సోషల్ మీడియాలో వైరల్.. రష్మిక రియాక్షన్ ..

ఇటీవల ఈ డీప్‌ఫేక్ వ్యవహారం విపరీతంగా పెరిగిపోయింది. వీటితో హీరోయిన్ల ఫొటోలు, వీడియోలను అసభ్యకరంగా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ డీప్‌ఫేక్ వీడియోలు హీరోయిన్స్‌కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఇప్పటికే ట్రోల్స్, విమర్శల రూపంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న సెలబ్రెటీలకు ఇదొక కొత్త తలనొప్పి వచ్చి పడింది.

అయితే అలా జరగకుండా ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఫలితం లేకుండా పోతోంది. అయితే ఇలాంటి డీప్‌ఫేక్ వీడియోతో ఇటీవల నేషనల్ క్రష్ రష్మిక ఎంతో ఆవేదనకు గురైంది. ఓ యువతి పొట్టి డ్రెస్‌లో లిఫ్ట్ ఎక్కిన వీడియో ఆ మధ్య వైరల్‌ అయి తీవ్ర దుమారానికి దారి తీసింది. అయితే అందులో ఉన్నది నిజంగా రష్మిక అనే అందరూ అనుకున్నారు.

కానీ అది డీప్‌ఫేక్ అని తెలిసి ఆశ్చర్యపోయారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. అలాగే ఆ డీప్‌ఫేక్ వీడియో చేసిన వ్యక్తిని కూడా పోలీసులు పట్టుకున్నారు. ఇక అది అక్కడతో ఆగిపోయింది అనుకున్న సమయంలో ఇప్పుడు మరో డీప్‌ఫేక్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారుతోంది. ?utm_source=ig_web_copy_link">

Also Read: Rashmika Mandanna’s Deep Fake Video: మరోసారి డీప్‌ఫేక్ వీడియోకు టార్గెట్ అయిన రష్మిక.. ఈ సారి మరీ దారుణంగా..

ఇక ఆ వీడియో కూడా రష్మికదే కావడం అందరినీ షాక్‌కు గురి చేసింది. అందులో ఓ యువతి బోల్డ్‌గా డ్యాన్స్ చేస్తూ కనిపించగా.. దానికి రష్మిక ముఖాన్ని ఎడిట్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై పలువురు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ‘రష్మిక డీప్‌ఫేక్ వీడియో చేయవద్దు’ అంటూ ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అంతేకాకుండా ఇలాంటివి మరోసారి రాకుండా పోలీసులను చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తున్నారు.

కాగా ఈ బ్యూటీ ప్రస్తుతం పుష్ప 2 మూవీతో బిజీ బిజీగా ఉంది. ఈ మూవీ ఈ ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కానుంది.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×