E-Paper
Advertisement

DCC President: నల్లొండ డీసీసీ అధ్యక్షుడి ఒంటరి పోరు..

DCC President: నల్లొండ డీసీసీ అధ్యక్షుడి ఒంటరి పోరు..
Advertisement

DCC President: అధికార కాంగ్రెస్ పార్టీకి నల్లగొండ జిల్లా ఎంతో కీలకమైనది. ఆ జిల్లాలో డీసీసీ అధ్యక్షుడి నియామకం ఇంకా మంటలు రేపుతూనే ఉంది. వర్గ పోరుకు పెట్టింది పేరైన ఆ జిల్లా కాంగ్రెస్ లో ఐక్యతారాగం లోపించింది. ఇన్నాళ్లూ పార్టీ కార్యక్రమాల్లో హడావుడి చేసిన సీనియర్ మంత్రి అనుచరుల సహాయ నిరాకరణతో డీసీసీ అధ్యక్షుడు ఒంటరిగానే పార్టీకార్యక్రమాలు చేపడుతున్నారంట దీంతో ఆ జిల్లాలో పార్టీ క్యాడర్ అయోమయానికి గురవుతోందంటున్నారు.

నల్లగొండ జిల్లాకు కంచుకోటగా కాంగ్రెస్

తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లాగా ఉన్న నల్లగొండ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. ఆది నుంచి రాష్ట్ర కాంగ్రెస్‌లో రాజకీయ దిగ్గజ నేతలంతా ఈ జిల్లావారే. రాజకీయ ఉద్దండులైన జానారెడ్డి, సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఫైర్ బ్రాండ్‌గా పేరు ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ లో కీలక నేతలుగా ఉన్నారు. హేమాహేమీలు ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి.

డీసీసీ అధ్యక్షపీఠం కోసం కీలక నేతల పోటీ

Advertisement

పార్టీలో కీలక నేతలున్న జిల్లా కావడంతో ఇక్కడి డీసీసీ అధ్యక్ష పీఠం కోసం కీలక నేతల అనుచరులు పోటీ పడుతుంటారు. ఈ సారి తన అనుచరుడు గుమ్ముల మోహన్ రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టడంకోసం సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. అయితే పార్టీ అధిష్టానం మాత్రం సీఎం రేవంత్ అనుచరుడిగా పేరున్న పున్నా కైలాష్‌నేతను డీసీసీ ప్రెసిడెంట్‌గా ఎంపిక చేసింది. డీసీసీ అధ్యక్షుడిగా కైలాష్ ఎంపికపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి లేఖ

గతంలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పున్నా కైలాష్‌నేతకు డీసీసీ ఎలా ఇచ్చారంటూ సీఎం రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి లేఖ రాసి.. తక్షణమే పున్న కైలాష్‌నేతను డీసీసీ అధ్యక్షుడిగా తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డినీ కలిసి గతంలో తాను చేసిన అనుచిత వ్యాఖ్యలకు పున్నా కైలాష్‌నేత క్షమాపణలు కోరారు. కానీ మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం మాత్రం చల్లారలేదు.

నల్లగొండలో కాంగ్రెస్ పార్టీ ఐక్యత లోపం

Advertisement

గతంలో పార్టీ కార్యక్రమాలను జిల్లా కేంద్రంలో అప్పటి డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్.. మంత్రి కోమటిరెడ్డి అనుచరులతో సమిష్టిగా నిర్వహించేవారు. కానీ ప్రస్తుతం పార్టీ పిలుపునిచ్చిన ఆందోళన కార్యక్రమాల్లో మంత్రి కోమటిరెడ్డి అనుచరులు కనిపించడం లేదట. దీంతో జిల్లా కేంద్రమైన నల్లగొండలో కాంగ్రెస్ పార్టీలో ఐక్యతారాగం లోపించిందట. మంత్రి అనుచరుల సహాయ నిరాకరణతో ఒంటరిగానే డీసీసీ అధ్యక్షుడు కైలాష్‌నేత కార్యక్రమాలను నిర్వహిస్తున్నారట. డీసీసీ అధ్యక్షుడిగా కైలాష్‌నేత ఎంపిక అయినప్పటి నుండి జిల్లా కేంద్రంలో పార్టీ కార్యక్రమాలు సమిష్టిగా జరగడం లేదట.

వేరువేరుగా వివాళులు అర్పించే కార్యక్రమాలు

డిసెంబర్ 6వ తేదీన అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని మంత్రి అనుచరులు, డీసీసీ అధ్యక్షుడు వేరువేరుగా నివాళులు అర్పించే కార్యక్రమాలను నిర్వహించారట. డిసెంబర్ 9న కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ బర్త్ డే వేడుకలను డీసీసీ అధ్యక్షుడు తన అనుచరులతో కలిసి నిర్వహించగా, మంత్రి కోమటిరెడ్డి అనుచరులు మంత్రి క్యాంపు కార్యాలయంలో సెపరేట్ గా నిర్వహించారట. ఓటు చోరీ అంశంపై జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో మంత్రి అనుచరులు పాల్గొనలేదట.

సోనియా గాంధీపై నేషనల్ హెరాల్డ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు

సోనియా గాంధీపై నేషనల్ హెరాల్డ్ కేసులో సుప్రీంకోర్టు బీజేపీ ప్రభుత్వాన్ని తప్పు పట్టిన అంశంపై బీజేపీ కార్యాలయాల ముట్టడి, జాతీయ గ్రామీణ ఉపాధి పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ గాంధీ విగ్రహాల వద్ద ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అయితే ఈ కార్యక్రమాలను కూడా డీసీసీ అధ్యక్షుడు కైలాష్‌నేత ఒంటరిగానే తన అనుచరులతో నిర్వహించారట. హైకమాండ్ పిలుపునిచ్చి ఆ ఆందోళన కార్యక్రమాలకు సైతం మంత్రి అనుచరులు హాజరు కాలేదట. ఇక కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని కూడా కైలాష్, కోమటిరెడ్డి అనుచరులు వేర్వేరుగా నిర్వహించడం క్యాడర్‌ను అయోమయానికి గురిచేస్తోందంట.

నల్గొండలో కాంగ్రెస్ హయాంలో తగాదాలు..

నల్గొండ నియోజకవర్గం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ప్రచారం చేసే పరిస్థితి లేకపోవడంతో కైలాష్ నేత దూరంగా ఉన్నారట. దీంతో అసలు నల్లగొండ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో తెలియక పార్టీ క్యాడర్ తీవ్ర ఆందోళనకు గురవుతోందట. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల వరకు గ్రూప్ తగాదాలు ఇలా ఉంటే పరిస్థితి ఏంటని కాంగ్రెస్ అభిమానులు మల్లగుల్లాలు పడుతున్నారంట.
నల్గొండ జిల్లా కేంద్రంలో సమష్టిగా పార్టీ కార్యక్రమాలను చేపట్టేలా పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోకపోతే గ్రూపు తగాదాలతో కొట్టుకునే పరిస్థితి తలెత్తినా ఆశ్చర్యం లేదంటున్నారు.

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×