E-Paper
Advertisement

Ambati Rayudu: న్యూజిలాండ్ మ్యాచ్ లో కోహ్లీ స్థానంలో ధోని ఉంటే, టీమిండియా గెలిచేది

Ambati Rayudu: న్యూజిలాండ్ మ్యాచ్ లో కోహ్లీ స్థానంలో ధోని ఉంటే, టీమిండియా గెలిచేది
Advertisement

Ambati  Rayudu: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఆదివారం రోజున మూడవ వన్డే జరిగిన సంగతి తెలిసిందే. ఈ వన్డేలో టీమిండియా 41 పరుగుల తేడాతో ఓడిపోయి సిరీస్ కోల్పోయింది. అయితే ఇందులో చివరి వరకు పోరాడిన విరాట్ కోహ్లీ, మ్యాచ్ మాత్రం గెలిపించలేకపోయాడు. ఆస్కింగ్ రేట్ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో విజయ తీరాలకు టీమిండియా జట్టును తీసుకు వెళ్లలేకపోయాడు విరాట్ కోహ్లీ. అయితే ఈ నేపథ్యంలోనే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు. మూడవ వన్డేలో విరాట్ కోహ్లీ స్థానంలో మహేంద్రసింగ్ ధోని ( MS Dhoni) ఉంటే.. టీమిండియా గెలిచేదని హాట్ కామెంట్స్ చేశారు అంబటి రాయుడు. దీంతో అంబటి రాయుడు చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి.

Also Read: Ranbir Kapoor-RCB: ఆ బాలీవుడ్ హీరో చేతిలోకి RCB..కేవ‌లం రూ.300 కోట్ల‌కే..కోహ్లీ టీమ్ కు ఘోర అవ‌మాన‌మే ?

కోహ్లీ స్థానంలో ధోని ఉంటే టీమిండియా గెలిచేది

Advertisement

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఇండోర్ వేదికగా నిన్న మూడవ వన్డే జరిగింది. ఈ మ్యాచ్ రెండు జట్లకు కూడా చాలా కీలకం. కానీ, టీమిండియా మాత్రం చివరి వరకు పోరాడి ఓడిపోయింది. 337 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో అట్టర్ ఫ్లాఫ్ అయింది టీమిండియా. టాపార్డర్ అలాగే మిడిల్ ఆర్డర్ దారుణంగా విఫలం కావడంతో ఈ పరిస్థితి నెలకొంది. అయితే ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం చేశాడు. సెంచరీ చేయడమే కాకుండా 124 పరుగులు సాధించిన తర్వాత వికెట్ ఇచ్చేశాడు. ఈ స్కోర్ సాధించడానికి మొత్తం 108 బంతులు ఎదుర్కొన్నాడు విరాట్ కోహ్లీ. అంటే దాదాపు 20 ఓవర్లు మింగేశాడు. కానీ భారీ స్కోర్ చేయలేకపోయాడు. 114 స్ట్రైక్ రేట్ మాత్రమే సాధించగలిగాడు. కోహ్లీ కంటే హర్షిత్ రానా , నితీష్ కుమార్ రెడ్డి రన్ రేట్ ఎక్కువగా ఉంది.

విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ సీరియ‌స్

చివర లో బౌండరీలు అలాగే సిక్సర్లు సాధించడంలో విరాట్ కోహ్లీ విఫలమయ్యాడు అన్నది మాత్రం వాస్తవం. ఇలాంటి నేపథ్యంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పై అంబటి రాయుడు హాట్ కామెంట్స్ చేశాడు. విరాట్ కోహ్లీ చెత్త బ్యాటింగ్ కారణంగా టీమిండియా ఓడిపోయిందని, సంచలన వ్యాఖ్యలు చేశాడు. సింగిల్స్ పైన ఫోకస్ చేసి.. బౌండరీలు కొట్టలేకపోయాడని చురకలు అంటించారు అంబటి రాయుడు. మూడో వన్డేలో విరాట్ కోహ్లీ స్థానంలో మహేంద్రసింగ్ ధోని ఉంటే కచ్చితంగా టీమిండియా గెలిచేదని అంచనా వేశారు. దీంతో అంబటి రాయుడు పై విరాట్ కోహ్లీ ( Virat Kohli) ఫ్యాన్స్ ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. ధోని కంటే విరాట్ కోహ్లీ గొప్ప అంటూ పోస్టులు కూడా పెడుతున్నారు. మహేంద్ర సింగ్ ధోని కంటే ఎక్కువ మ్యాచ్ లు గెలిపించింది విరాట్ కోహ్లీ అని కౌంటర్ ఇస్తున్నారు.

Advertisement

Also Read: Virat Kohli: న్యూజిలాండ్ ప్లేయ‌ర్ మెడ ప‌ట్టుకుని తోసేసిన‌ కోహ్లీ..బంతిని త‌న్ని మ‌రీ రెచ్చిపోయాడుగా

 

?igsh=eXZnNzZncTE3MnV6

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×