నెల్లూరు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ నెల్లూరు కార్పొరేషన్ జెండా ఎగురవేసేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో క్వీన్ స్వీప్ చేసిన కూటమి నెల్లూరు మేయర్ కుర్చీని దక్కించుకునేందుకు అదే స్థాయిలో పావులు కదుపుతోంది. నెల్లూరు నగర మేయర్ స్రవంతిపై రోజుల వ్యవధిలో అవిశ్వాస తీర్మానం పెట్టనున్న క్రమంలో అటు వైసీపీ, ఇటు టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. రసవత్తరంగా మారిన నెల్లూరు కార్పొరేషన్ లో రాజకీయం క్షణం క్షణం మారుతూ చెస్ గేమ్ లా తయారైంది. అధికార టీడీపీ అవిశ్వాసం వైపు పావులు కదుపుతున్న తరుణంలో.. వైసీపీ నేతలు కార్పొరేటర్లకు గాలం వేసి సీన్ మార్చేస్తున్నారు. ఆ క్రమంలో ఎవరెప్పుడు ఎవరితో ఉంటారో అర్థం కాని దిశగా నెల్లూరు రాజకీయ సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి..
సింహపురిలో మేయర్ కుర్చీ ఫైట్ పూర్తిగా రసవత్తరంగా మారింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోయారు. దాంతో రాజకీయాలు క్షణ క్షణం మారిపోతాయని మరోసారి రుజువైంది. ఆ క్రమంలో సింహపురి రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో అంతుపట్టకుండా తయారైంది. నిన్నటి వరకు మేయర్ సప్రంతికి ఏ పార్టీకి సంబంధం లేదని ప్రచారం జరిగింది. తమకు మేయరుకు ఎలాంటి సంబందం లేదని, తమ పార్టీ కాదని వైసీసీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్దన్ రెడ్డి మీడియా ముందు ప్రకటించారు. ఇటీవల మేయర్ భర్త జయవర్ధన్ కోటంరెడ్డి సోదరులు టార్గెట్‌గా మీడియా ముందుమాట్లాడారు.
జయవర్ధన్ వెనుక వైసిపి పెద్దలున్నారని ప్రచారం జరుగుతోంది.. వైసిపి కేంద్ర కార్యాలయం నుంచే జయవర్దన్కు సహకారం అందిందని తెలుస్తోంది. మేయర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కార్పొరేటర్లు జేసీకి నోటీసులు ఇచ్చారు. కలెక్టర్ వచ్చిన తరువాత ఈనెల 18న అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. తొలి నుంచి మేయరుకు మద్దతు ఇవ్వాలా వద్దా అనే చర్చ వైసిపిలో సాగుతోంది. స్రవంతి దిగిపోతే డిప్యూటీ మేయర్ రూపుమార్ యాదవ్ మేయర్ గా వచ్చే అవకాశముంది. మేయర్ ఎన్నికల జరగకుండా రూపుకుమార్ యాదవ్ ఇన్చార్జ్ మేయరుగా కొనసాగుతారనే ప్రచారం సాగింది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దీనికి ఒప్పుకోలేదని తెలుస్తుంది.
మేయర్ గా దేవరకొండ సుజాత ఉంటుందని కొద్ది రోజులు రూప్ కుమార్ మేయర్‌గా కొనసాగుతారని ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మేయర్ గా తన బాబాయ్ రూప్‌కుమార్ అవకాశం దక్కకూడదనే ఉద్దేశ్యంతో వ్యూవహరచన చేశారట. అందులో భాగంగా అవసరమైన ఐదుగురు కార్పొరేటర్లను జగన్మోహన్ రెడ్డి సమక్షంలో తిరిగి వైసీపీలోకి తీసుకువచ్చి పార్టీ కండువాను కప్పించారు. ఈ పరిణామం టీడీపీకి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. మరోవైపు మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో మరి కొంత మందిని కూడా ఉచ్చులో పడేయడానికి వైసీపీ రహస్యంగా ఆపరేషన్ మొదలు పెట్టిందంట.
18న మేయర్ స్రవంతిపై అవిశ్వాసం పెట్టాలని టీడీపీ సిద్ధమవుతుండగా ఈ మార్పులు చేర్పులు పూర్తి హీట్ క్రియేట్ చేస్తున్నాయి. వైసీపీ నాయకుల సమాచారం ప్రకారం అవసరం అయితే ఎన్ని కోట్లు ఖర్చైనా వెనకాడమని అవిశ్వాసంపై ఝలక్ ఇవ్వాలనే ఉద్దేశంతో గట్టి వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ మరో ట్విస్ట్ నెలకొంది జగన్ సమక్షంలో వైసీపీ గూటికి చేరిన ఐదుగురిలో ఇద్దరు కార్పొరేటర్లు మళ్లీ టిడిపి వైపు యూటర్న్ తీసుకున్నారు. దింతో కొత్త చర్చలకు తెర లేచింది
అవిశ్వాసం ముందు రాజకీయ సమీకరణలు మారిపోతుండటంతో టీడీపీ కూడా అప్రమత్తమైంది. సిటీ, రూరల్ టీడీపీ నేతలు క్యాంపు రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. 35 మందికి పైగా కార్పొరేటర్లు టెంపోల్లో గోవా వైపు పయనమయ్యారు. ఈ క్యాంపు ఏర్పాట్లను కోటంరెడ్డి బ్రదర్స్ స్వయంగా పర్యవేక్షించారు. ఈ నేపథ్యంలో 18న ఏం జరుగుతుందో..అవిశ్వాసంలో గుర్రం ఎగురుతుందా..? లేదా నిద్రపోతుందా..? అన్న దానిపై నెల్లూరు రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మెజార్టీ నెంబర్ లేకపోయినా టీడీపీకి టెన్షన్ పుట్టిస్తోంది వైసీపీ. అవిశ్వాస తీర్మానం ఎపిసోడ్ అంత ఈజీగా ముగియకూడదంటూ టీడీపీలో చేరిన వైసీపీ కార్పొరేటర్లను జగన్ సమక్షంలో తిరిగి సొంతగూటికి చేర్చుకుంది.
ఇది జరిగిన కొన్ని గంటల్లోనే ఇద్దరు కార్పొరేటర్ల పై కేసు నమోదు చేశామని వారిని అరెస్టు చేసినట్లు ప్రచారం ముమ్మరంగా జరిగింది. దీంతో అనిల్ కుమార్ యాదవ్, పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అర్ధరాత్రి నవాబుపేట పోలీస్ స్టేషన్‌కు చేరుకోవడంతో అక్కడ మూడు గంటలసేపు ఉద్రిక్తత నెలకొంది. అదే సమయంలో మాజీ మంత్రి అనిల్ స్వయంగా టీడీపీ నేతలు, పోలీసులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే ఫ్యాన్ పార్టీలో చేరి 24 గంటలు కాకముందే ఆ ఐదుగురిలో ఇద్దరు యూటర్న్ తీసుకొని టీడీపీ గూటికి వచ్చేశారు. దీంతో నెల్లూరు కార్పొరేషన్ రాజకీయం రసవత్తరంగా మారింది. మరోవైపు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో క్యాంపు రాజకీయాలకు తెరలేపింది టీడీపీ.
దీంతో నెల్లూరు మేయర్ అవిశ్వాసం ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందన్న ఉత్కంఠ కొనసాగుతోంది. సింహపురి రాజకీయం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. మేయర్ స్రవంతిపై ఈనెల 18న అవిశ్వాస తీర్మానం పెట్టనున్న క్రమంలో.. వైసీపీ గేమ్ స్టార్ట్ చేసింది. నిన్న మొన్నటి వరకు మేయర్ తమ పార్టీ కాదని.. అవిశ్వాస తీర్మానంతో తమకు సంబంధం లేదంటూ చెప్పిన వైసీపీ..ఇప్పుడు టీడీపీకి షాక్ ఇచ్చేలా అడుగులు వేస్తుంది.
54 మంది కార్పొరేటర్లు ఉన్న నెల్లూరు నగరపాలక సంస్థలో డిప్యూటీ మేయర్ గా ఉన్న ఖలీల్ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. దీంతో సభ్యుల సంఖ్య 53కు పడిపోయింది. ఇందులో 41 మంది టీడీపీ తరఫున ఉండగా..12 మంది వైసీపీలో ఉన్నారు.అయితే ఐదుగురు కార్పొరేటర్లు వైసీపీ గూటికి చేరి.. అందులో ఇద్దరు తిరిగి సైకిల్ ఎక్కిన తర్వాత..బలబలాలు మారిపోయాయి. ప్రస్తుతం టీడీపీకి 38 మంది సభ్యులు ఉండగా.. వైసీసీకి 15 మంది ఉన్నారు. మరింత మంది వైసీపీకి టచ్ లో ఉన్నారని.. అవిశ్వాస తీర్మానం వీగిపోయేలా వైసీపీ వ్యూహరచన చేస్తుందని ప్రచారం జరుగుతోంది.
వాస్తవానికి అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే టీడీపీకి మూడొంతుల్లో రెండు వంతుల మెజార్టీ ఉండాలి. అదే అవిశ్వాసం వీగిపోవాలంటే వైసీపీకి 1/3 ఉండాలి. ఈ క్రమంలో టీడీపీ నేతలు కోటంరెడ్డి బ్రదర్స్, మంత్రి నారాయణ, రూప్ కుమార్ యాదవులు కూడా అలర్ట్ అయ్యారు. రాత్రికి రాత్రి చక్రం తిప్పి వైసీపీలోకి వెళ్లినవారిలో ఇద్దరిని తిరిగి టీడీపీలోకి రప్పించగలిగారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో టీడీపీ పార్టీ క్యాంపు పాలిటిక్స్ కు తెరలేపింది. 35 మందికిపైగా సిటీ, రూరల్ కార్పొరేటర్లను క్యాంపులకు తరలించారు. అవిశ్వాసం ముందు రోజు వరకు వీళ్లంతా క్యాంపుల్లోనే ఉండేలా ప్లాన్ చేశారట. అటు వైసీపీ లీడర్లు.. కార్పొరేటర్లను ప్రలోభపెడుతున్నారని.. బెదిరిస్తున్నారంటూ టీడీపీ ఫిర్యాదులు చేస్తుంది.
దీంతో నెల్లూరు కార్పొరేషన్ రాజకీయం రంజుగా మారింది. కార్పొరేటర్ల కు మంచి డిమాండ్ పెరిగింది. ఇదే క్రమంలో కార్పోరేటర్లకు పెద్ద ఎత్తున ముట్టచెప్పేందకు ప్రయత్నాలు జరుగుతున్నాయిట. మరోవైపు వైసీపీ కూడా టిడిపికి గట్టిగానే కౌంటర్ ఇస్తుంది టిడిపి క్యాంపు రాజకీయాలకు తెరతీసినప్పుడే వైసిపి నైతికంగా గెలిచిందని అనిల్ కుమార్ యాదవ్ అంటున్నారు. మేయర్ దంపతులుకు వైసీపీ ఆహ్వానం పలకనున్నట్లు సమాచారం. మరి ఈ నెల 18న ఏం జరగబోతోందనేది వేచి చూడాలి.
Story by Ajay, Big Tv