BigTV English

India VS Pakistan War: ఇంకా మారని పాక్ బుద్ధి.. ఇంకా అవే డొల్ల మాటలు

India VS Pakistan War: ఇంకా మారని పాక్ బుద్ధి.. ఇంకా అవే డొల్ల మాటలు

India VS Pakistan War: పాకిస్తాన్‌కు ఇంకా బలుపు తగ్గలేదు. భారత్ చేతిలో చావుదెబ్బ తిన్నా.. పాక్ ఆర్మీ ఆఫీసర్లకు ఇంకా బుద్ధిరాలేదు. ఇక మీదట వస్తుందనే గ్యారంటీ కూడా ఏమీ లేదు. లేకపోతే.. ఆర్మీ అధికారులు.. ఉగ్రవాదుల భాష మాట్లాడమేంటి? పరిధి దాటి భారత్‌పై ద్వేషం వెళ్లగక్కడమేంటి? పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి మాట్లాడిన మాటలు వింటే.. ఆ దేశ సైన్యానికి, ఉగ్రవాదులకు మధ్య ఎలాంటి సంబంధాలున్నాయో ఇట్టే తెలిసిపోతుంది. ఇప్పుడు దీనిమీదే ఓ రేంజ్‌లో డిబేట్ నడుస్తోంది. టెర్రరిస్టులతో తమకు సంబంధం లేదని బుకాయించే పాక్.. ఇప్పుడు దీనికేం సమాధానం చెబుతుంది?
మీ దుంప తెగ.. ఏంట్రా ఈ కామెడీ!?


మీరు మాకు నీళ్లు ఆపేస్తే.. మేము మీ శ్వాస ఆపేస్తాం!

విన్నారుగా.. మీరు మాకు నీళ్లు ఆపేస్తే.. మేము మీ శ్వాస ఆపేస్తాం! ఇది.. పాకిస్తాన్ సైన్యం అధికార ప్రతినిధి మాట్లాడిన మాటలు. వీడు అసలు ఆర్మీ అధికారేనా? ఆర్మీ యూనిఫామ్‌లో ఉన్న ఉగ్రవాదా? అతని మాటలు విన్నాక.. చాలా మందికి వచ్చిన డౌట్ ఇదే! పాకిస్తాన్ సైన్యానికి.. ఆ దేశంలోని టెర్రరిస్ట్ నెట్‌వర్క్‌కు మధ్య ఉన్న సంబంధానికి.. ఈ వీడియోనే బిగ్ ఎగ్జాంపుల్. పాకిస్తాన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ప్రతినిధి.. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ మాటల్ని వాడి.. భారత్‍‌‌ని బెదిరించడమేంటి?


సింధూ జలాలపై ఓ ఆర్మీ ప్రతినిధి స్పందించడమేంటి?

పాకిస్తాన్‌లోని ఓ యూనివర్సిటీలో జరిగిన మీటింగ్‌లో.. ప్రస్తుతం ఆ దేశ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ 22వ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న.. పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్.. గ్లోబల్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ మాటల్ని రిపీట్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత.. భారత్ రద్దు చేసిన సింధూ జలాల ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ.. మీరు మా నీటిని ఆపేస్తే.. మేము మీ శ్వాసని ఆపేస్తాం! అనడమేంటి? అయినా.. సింధూ జలాల ఒప్పందం రద్దుపై.. ఓ ఆర్మీ అధికార ప్రతినిధి స్పందించడమేంటి? స్పందించినా.. ఓ గ్లోబల్ టెర్రరిస్ట్ భాషని, అతని మాటల్నే.. పబ్లిక్‌లో మాట్లాడటమేంటి? ఇదే.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కూడా గతంలో ఓ పబ్లిక్‌ మీటింగ్‌లో ఇదే మాట్లాడాడు. మీరు సింధూ జలాలను ఆపేస్తే.. మేము మీ శ్వాసని ఆపేస్తాం! ఆ తర్వాత.. ఈ నదుల్లో రక్తం పారుతుందని.. రెచ్చగొట్టేలా ప్రసంగించాడు. దీనికి సంబంధించి ఓ పాత వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిని బట్టి ఒక విషయం క్లియర్‌గా అర్థమవుతోంది.. పాకిస్తాన్ ఆర్మీ.. టెర్రరిస్టులతో స్క్రిప్ట్‌ని కూడా పంచుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. లేకపోతే.. ఉగ్రవాదుల భాష, ఆర్మీ అధికారుల భాష ఒకేలా ఉండటమేంటి? ఆర్మీ ఆఫీసర్లు కూడా టెర్రరిస్టుల్లానే మాట్లాడటమేంటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయ్.

హాఫీజ్ సయీద్.. మోస్ట్ వాంటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్

విన్నారుగా! అయినా.. హఫీజ్ సయాద్ అనేవాడు ఓ మోస్ట్ వాంటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్. లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు వాడు చీఫ్. వాడిలా మాట్లాడాడంటే.. భారత్‌పై తన ద్వేషాన్ని వెళ్లగక్కాడంటే.. ఏమో అనుకోవచ్చు. ఎందుకంటే.. భారత్, అమెరికాకు వ్యతిరేకంగా.. పాకిస్తాన్ ప్రజల్ని, టెర్రరిస్టుల్ని రెచ్చగొట్టడమే వాడి పని. వాడు అలాగే మాట్లాడతాడు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పాత వీడియోలో.. హఫీజ్ సయీద్ ఎంతలా జనాన్ని రెచ్చగొడతాడో క్లియర్‌గా తెలుస్తోంది. వాడి మాటల్నే.. మరోసారి పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి.. అహ్మద్ షరీఫ్ కూడా చెప్పడమేంటి? అనేది చర్చనీయాంశంగా మారింది. అయినా.. సింధూ జలాల ఒప్పందం గొడవ.. ఆర్మీ అధికార ప్రతినిధికి ఏం అవసరం? అతని పనేంటి? పరిధి ఏంటి? ఏమైనా ఉంటే.. భారత ప్రభుత్వం, పాక్ ప్రభుత్వం చూసుకుంటాయ్.?

సింధూ జలాలపై మాట్లాడే అర్హత ఆర్మీ అధికారికి ఉందా?

సింధూ జలాల విషయంలో.. దౌత్యపరంగా చర్చలు జరపాల్సింది, నిర్ణయాలు తీసుకోవాల్సింది రెండు దేశాల ప్రభుత్వాలు. అదంతా.. విదేశాంగ శాఖ పరిధిలోని అంశం. దౌత్యపరమైన వ్యవహారం. దీని గురించి.. మాట్లాడే అర్హత ఆర్మీ అధికారికి ఉందా? అసలు.. అహ్మద్ షరీఫ్ పనేంటి? పాక్ ఆర్మీ వ్యవహారాలకు సంబంధించి.. అధికారిక ప్రకటనలు చేయాలి! ఏదైనా మిలిటరీ ఆపరేషన్ చేపట్టినప్పుడు.. దానికి సంబంధించిన విషయాల్ని, అధికారిక సమాచారాన్ని ప్రజలకు తెలిసేలా చెప్పాలి. అంతకుమించి ఆర్మీ అధికార ప్రతినిధిగా.. అహ్మద్ షరీఫ్‌కు ప్రత్యేక అధికారాలు, వెసులుబాట్లు ఏమీ లేవు. అయినాసరే.. పరిధి దాటి మాట్లాడాడు.

పాక్ ఆర్మీ యూనిఫామ్‌లో ఉన్న ఉగ్రవాదా?

పాకిస్తాన్ సైన్యం అధికార ప్రతినిధి అహ్మద్ షరీఫ్.. ఆ దేశంలోని టెర్రరిస్టులు హఫీజ్ సయీద్, మసూద్ అజార్‌లా అడ్డగోలుగా మాట్లాడటంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయ్. అసలు ఇతను ఆర్మీ అధికారేనా? లేక ఆర్మీ యూనిఫామ్‌లో ఉన్న ఉగ్రవాదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్. ఇక్కడ ఇంట్రస్టింగ్ పాయింట్ మరొకటుంది. ఈ అడ్డగోలు మాటలు మాట్లాడిన అహ్మద్ షరీఫ్ తండ్రికి.. ఒసామా బిన్ లాడెన్‌తో ఉన్న సంబంధాలున్నాయ్. దాంతో.. ఆ వ్యవహారంలోనూ.. ఇతను విచారణ ఎదుర్కొంటున్నాడు. అంతేకాదు.. ప్రస్తుతం ఇతను ప్రపంచ ఉగ్రవాద నిఘా సంస్థల పరిశీలనలోనూ ఉన్నాడు. ఇలాంటి మూలాలున్నాయ్ కాబట్టే.. ఇలా ఉగ్రవాదిలా మాట్లాడాడు అనే చర్చ కూడా సాగుతోంది.

చిన్న దాడికే అల్లాడిపోయే పాక్ కు ఇలాంటి ప్రకటనలెందుకు?

అహ్మద్ షరీఫ్ మాటలు విన్నాక.. భారత ప్రజల్లో ఓ చర్చ మొదలైంది. సింధూ జలాలు ఆపేస్తే.. భారత్ శ్వాస ఆపేస్తారా? అసలు.. పాకిస్తాన్‌కు అంత సీన్ ఉందా? అని సెటైర్లు వేస్తున్నారు. ఆపరేషన్ సిందూర్‌లో.. ఆపకుండా 3 రోజులు దాడి చేస్తేనే.. పాకిస్తాన్ అల్లాడిపోయింది. భారత దళాల మిసైల్ స్ట్రైక్స్‌ని తట్టుకోలేక.. చావుదెబ్బతింది. ఉగ్ర స్థావరాలనే కాదు.. సైన్యం స్థావరాలను, ఎయిర్‌బేస్‌లను కూడా కోల్పోయింది. ఇండియా ఎటాక్స్ ఇలాగే కంటిన్యూ అయితే.. ఇక పాక్ మళ్లీ కోలుకునేందుకు వందేళ్లు పడుతుందనే అంచనాకు వచ్చారు. అందుకే.. వెంటనే వెళ్లి అమెరికా కాళ్లు పట్టుకొని.. భారత్‌ని సీజ్‌ఫైర్‌కి ఒప్పించేలా వేడుకున్నారు. ఇండియా కంటే ముందే.. కాళ్లబేరానికొచ్చి.. కాల్పులు, దాడులు ఆపాలని బతిమాలుకున్నారు. ఇండియా దాడులు ఆపితే గానీ.. ఊపిరి పీల్చుకోని పాకిస్తాన్ ఆర్మీకి.. ఇలాంటి ప్రకటనలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు ఇండియన్స్.

100 బ్రహ్మోస్, ఆకాశ్ మిసైల్లు వేస్తే పాక్ సైన్యం ఏమవుతుంది?

ఇప్పటికే.. ఇండియా కాస్త కాన్సట్రేట్ చేసి దాడి చేస్తే ఎలా ఉంటుందో చూసింది పాకిస్తాన్. డ్రోన్లు, మిసైళ్లతో దాడులకే.. దాయాది దేశం నిలువెల్లా వణికిపోయింది. అణువణువులో భయమంటే ఏమిటో చూసింది. అలాంటిది.. గట్టిగా ఓ వంద బ్రహ్మోస్, ఆకాశ్ మిసైళ్లు వేస్తే.. పాక్ సైన్యం ఏమైపోతుందో.. మాకంటే బాగా మీకే తెలుసు. అలాంటిది.. మీకెందుకు ఇలాంటి మేకపోతు గాంభీర్య ప్రకటనలు అంటూ.. సోషల్ మీడియాలో పాక్ ఆర్మీని, ఆ దేశ ప్రభుత్వాన్ని ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు. ఇప్పటికైనా.. ఈ తొడలు కొట్టడం, జబ్బలు చరచడం లాంటివి ఆపేయండి. ఇండియా సంగతి చూస్తాం.. తేలుస్తాం లాంటి జోకులు ఆపేయండి అని సూచిస్తున్నారు. లేకపోతే.. భవిష్యత్తులో మరిన్ని షాకులు తప్పవంటున్నారు ఇండియన్ పబ్లిక్.

పాకిస్థాన్‌ని మోసపూరిత దేశంగా చూపిన భారత్

ఆఫ్ట్రాల్.. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ప్రతినిధి.. భారత్‌ని బెదిరించడమా? అది.. కూడా ఓ ఉగ్రవాది భాషలో! ఇదంతా చూస్తుంటే.. సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేయడంతో.. ఇంకా పాక్ నుంచి ముప్పు పొంచే ఉందని సూచిస్తోంది. అయితే.. ఆపరేషన్ సిందూర్ కొట్టిన దెబ్బ రుచేంటో చూశాక కూడా.. పాక్ బుద్ధి మారట్లేదు. కానీ.. దాయాది విషయంలో ఇండియా మాత్రం ఫుల్ క్లారిటీతో ఉంది. ఏమాత్రం వేషాలేసినా.. ఇండియన్ ఆర్మీ ఊరుకునే పరిస్థితి లేదు. ఈసారి.. అంతకుమించి అనేలా ఉంటుంది ఎటాక్! ఆపరేషన్‌ సిందూర్‌తో.. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయ్ భారత దళాలు. తర్వాత.. ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా పాకిస్తాన్‌పై దౌత్యపరంగా మెరుపుదాడి మొదలుపెట్టింది. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్‌ని ఓ మోసపూరిత దేశంగా చూపించింది. ఇప్పుడు.. పాక్ ఆర్మీ అధికారిక ప్రతినిధి ఉగ్రవాదుల భాషలో మాట్లాడటం.. మరోసారి పాకిస్తాన్ ఎలాంటి దేశమో.. అక్కడి ఆర్మీ అధికారులు ఎలాంటి వారో అందరికీ ఓ క్లారిటీ వచ్చింది.

ఉగ్రదాడి జరిగిన గంటల్లోనే పాక్‌పై కఠిన చర్యల

పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగిన కొన్ని గంటల్లోనే.. భారత్ పాక్‌పై కఠిన చర్యలకు దిగింది. అందులో.. సింధూ జలాల ఒప్పందం నిలిపివేత కూడా ఒకటి. 1960లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వం ద్వారా ఈ ఒప్పందం కుదిరింది. ఇప్పుడు.. వరల్డ్ బ్యాంక్ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని చెప్పేసింది. ఇప్పటికే.. ప్రధాని మోడీ కూడా రక్తం, నీరు కలిసి పారవని తేల్చేశారు. పాకిస్తాన్‌తో చర్చలంటూ జరిగితే.. అది కేవలం పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు సంబంధించిన చర్చలే ఉంటాయ్ తప్ప.. మరొకటి కావని క్రిస్టల్ క్లియర్‌గా చెప్పేశారు. అంతకుమించి.. మరో విషయంలో పాక్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదన్నారు. విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా సింధూ జలాల ఒప్పందం రద్దయిపోయిందని స్పష్టం చేశారు. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని పూర్తిగా ఆపేసేంత వరకు ఇదిలాగే కొనసాగుతుందని చెప్పారు.

పాక్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ పంపిన మోడీ కామెంట్స్

పాక్‌తో చర్చలు జరపాల్సి వస్తే.. అది కేవలం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో చట్టవిరుద్ధంగా ఆక్రమించబడిన భారత భూభాగాన్ని ఖాళీ చేయడం గురించేనన్నారు. ఈ విషయంలో భారత్ చర్చలకు సిద్ధంగా ఉందన్నారు. ప్రధాని మోడీ కూడా పాక్ విషయంలో ఎంతో కఠినంగా ఉన్నారు. తన సిరల్లో పారుతోంది రక్తం కాదు సిందూరం అని చెప్పారు. సిందూరం భగ్గుమంటే ఫలితం ఎలా ఉంటుందో చూపించామని.. ఆపరేషన్ సిందూర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్‌లో ఏప్రిల్ 22న ఉగ్రదాడి చేస్తే.. అదే 22 నిమిషాల్లో గట్టి జవాబు ఇచ్చామన్నారు. పాక్ రహింయార్‌ఖాన్ ఎయిర్‌బేస్‌ని ఐసీయూకు పంపామన్నారు. మోడీ కామెంట్స్.. పాక్‌కు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్‌ని పంపాయ్.

100 మందికి పైగా ఉగ్రవాదుల్ని ఏరి పారేసిన భారత ఆర్మీ

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా.. సైనిక, రాజకీయ, భావోద్వేగపరమైన లక్ష్యాలతో భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాక్‌పై జరిపైన దాడులతో.. ఈ మూడూ నెరవేరాయ్. అంతేకాదు.. యూసుఫ్ అజార్, అబ్దుల్ మాలిక్ రౌఫ్, ముదాసిర్ అహ్మద్ లాంటి.. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులతో సహా.. 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని మన ఆర్మీ ఏరిపారేసేంది. ఇప్పుడు.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ 33 దేశాలతో.. దౌత్యపరమైన చర్యలను కూడా మొదలుపెట్టింది. ఉగ్రవాదాన్ని పూర్తిగా అణిచివేసేందుకు ఇండియా ఎంతో కృషి చేస్తోంది. ఈ విషయంలో.. భారత్‌కు అంతర్జాతీయంగా అద్భుతమైన మద్దతు లభిస్తోంది. ఎన్నో దేశాలు.. ఇండియాకు మద్దతు ప్రకటించాయ్. ఇలాంటి పరిస్థితుల్లో పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ మాట్లాడిన మాటలు.. పాక్‌కు చింత చచ్చినా.. ఇంకా పులుపు చావలేదనే విషయాన్ని రుజువు చేస్తున్నాయ్.

పాక్ ఆర్మీ అధికారులు తీరులో ఇంకా రాని మార్పు

ఇండియా దెబ్బకొడితే ఎలా ఉంటుందో.. పాకిస్తాన్‌కు బాగా తెలుసు. అయినాసరే.. అక్కడి ఆర్మీ అధికారుల తీరులో ఇంకా మార్పు రాలేదు. ఆ బలుపు మాటలు అస్సలు తగ్గలేదు. ఇప్పటికే.. పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు ఎక్కడ నక్కినా లేపేస్తామని.. ఆపరేషన్ సిందూర్ స్పష్టం చేసింది. ఎంతమంది ఉన్నా.. ఎలాంటి చోట దాక్కున్నా.. ఎంత సెక్యూరిటీ మధ్య ఉన్నా.. జనావాసాల్లో నక్కినా.. పాక్ పౌరులకు హాని కలగకుండా.. పక్కాగా లేపేస్తామనే విషయం బాగా అర్థమైంది. పాకిస్తాన్‌లో ఉన్న టెర్రరిస్టుల్ని ట్రాక్ చేయడం, టార్గెట్ సెట్ చేయడం, పక్కాగా దాడి చేయడం, ఉగ్ర మూలాల్ని, ఉగ్ర స్థావరాల్ని.. ఎంత సులువుగా, ఎంత కచ్చితంగా దాడి చేయగలమో.. పాక్‌కు బాగా అర్థమైంది. ఉగ్ర శిబిరాలైనా, లాంచ్‌ప్యాడ్‌లైనా, క్రాస్ బోర్డర్ టెర్రరిజమైనా.. పూర్తిగా అంతం చేసేవరకు భారత్ ఊరుకోదనే విషయం.. అక్కడున్న ఉగ్ర సంస్థలకే కాదు పాకిస్తాన్ ఆర్మీకి కూడా చాలా బాగా తెలుసు. ఇందుకు.. ఆపరేషన్ సిందూర్.. కేవలం ఓ ఎగ్జాంపుల్ మాత్రమే.

ఇకపై ఉగ్రదాడిని దేశంపై దాడిగానే భావిస్తామన్న భారత్

ఇకముందు ఇండియాపై మళ్లీ ఉగ్రదాడి చేయాలనే ఆలోచన వచ్చినా.. మరో ఉగ్రదాడి జరిగినా.. పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయనేది ఇప్పటికే.. భారత దళాలు ట్రైలర్ చూపించాయ్. మళ్లీ.. భారత్‌లో టెర్రరిస్ట్ ఎటాక్ జరిగితే.. దానిని దేశంపై దాడిగానే భావిస్తామని కూడా స్పష్టం చేసింది. ఈసారి పాక్ ఏమాత్రం తోకజాడించినా.. వార్ సినిమా చూపించడం ఖాయం. అందువల్ల.. ఉగ్రవాదులైనా.. పాకిస్తాన్ ఆర్మీలోని అధికారులైనా.. ఒళ్లు దగ్గరపెట్టుకొని వ్యవహరిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. లేకపోతే.. ఆ తర్వాత జరగబోయే పరిణామాలకు వాళ్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు.

ఆపరేషన్ సిందూర్ కొట్టిన దెబ్బ తాలూకూ నష్టం తెలుసు! భారత్‌తో పెట్టుకుంటే.. ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఇంకా బాగా తెలుసు! అయినాసరే.. అప్పుడప్పుడు ఇలాంటి కామెడీలు చేయడం పాకిస్తాన్‌‌కు అలవాటే. తమ దేశ ప్రజల్ని మభ్యపెట్టేందుకు.. ఏమైనా చెప్పుకోనీ ఫరవాలేదు. కానీ.. భారత్‌నే బెదిరించాలని చూసేలా చేసే స్టేట్‌మెంట్లు చూస్తుంటేనే.. అందరికీ నవ్వొస్తుంది. అందుకోసమే.. పాక్ ఆర్మీ అధికారులు కామెడీ ఆపాలంటున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు, ఇండియన్లు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×