Indian Railways Reservation Rules: భారతీయ రైల్వే ద్వారా నిత్యం కోట్లాది మంది ప్రయాణం చేస్తుంటారు. జనరల్/అన్‌రిజర్వ్డ్ కోచ్‌లు తప్ప మిగతా ప్రయాణీకులంతా ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఆయా రైల్వే స్టేషన్లలో టికెట్ రిజర్వేషన్ కార్యాలయం ఉంటుంది. అక్కడ టికెట్లను రిజర్వు చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రయాణానికి సంబంధించిన వివరాలు, వ్యక్తిగత వివరాలను నింపి రిజర్వేషన్ కౌంటర్ లో ఇస్తే, బెర్తుల లభ్యత ఆధారంగా టికెట్లను జారీ చేస్తారు. రిజర్వేషన్ కౌంటర్లు ఆదివారం మినహా మిగతా అన్ని రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పని చేస్తాయి. ఆదివారం నాడు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తెరిచి ఉంటాయి.
ఆన్ లైన్ లో టికెట్ల రిజర్వేషన్
ఆన్ లైన్ లో IRCTC వెబ్ సైట్ లేదంటే యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంటి దగ్గరి నుంచే ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. IRCTC రిజర్వేషన్ సేవలను ఉపయోగించడానికి రిజిస్టర్డ్ కస్టమర్ అయి ఉండాలి. ఈ సేవలు ప్రతి రాత్రి 11:45 నుంచి ఉదయం12:20 మనిహా రోజంతా అందుబాటులో ఉంటాయి.
తత్కాల్, ప్రీమియం తత్కాల్ టిక్కెట్ల రిజర్వేషన్
తత్కాల్ టికెట్స్ బుకింగ్ అనేది ప్రయాణ తేదీకి ఒక రోజు ముందు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రీమియం తత్కాల్ రిజర్వేషన్ కు డైనమిక్ ధరలు అందుబాటులో ఉంటాయి. తత్కాల్ టికెట్లు ఆన్ లైన్ తో పాటు PRS కౌంటర్లలో బుక్ చేసుకోవచ్చు. ప్రీమియం తత్కాల్ టికెట్లు ఆన్ లైన్ లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తత్కాల్ రిజర్వేషన్‌లు AC క్లాస్ లకు ఉదయం 10:00 గంటలకు, నాన్-AC క్లాస్ లకు ఉదయం 11:00 గంటలకు ప్రారంభమవుతాయి.
అడ్వాన్స్ డ్ రిజర్వేషన్ పీరియడ్
జనరల్ కోటా బుకింగ్ ప్రయాణ తేదీకి 60 రోజుల ముందు వరకు చేసుకునే అవకాశం ఉంటుంది. తత్కాల్, ప్రీమియం తత్కాల్ రిజర్వేషన్లు ప్రయాణ తేదీకి ఒక రోజు ముందు చేసుకునే అవకాశం ఉంటుంది. మౌంటెయిన్ రైళ్లు, ప్రత్యేక రైళ్లకు తక్కువ అడ్వాన్స్ డ్ రిజర్వేషన్ పీరియడ్ ఉంటుంది. విదేశీయులు, NRIలు ప్రయాణానికి 365 రోజుల ముందు వరకు విదేశీ టూరిస్ట్ కోటాలో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.
రైల్వే రిజర్వేషన్ కోటాలు
భారతీయ రైల్వే వేర్వేరు రిజర్వేషన్ కోటాలను కలిగి ఉంటుంది. కొన్ని అందరికీ అందుబాటులో ఉంటాయి. మరికొన్ని నిర్దిష్ట వ్యక్తులకు పరిమితం చేయబడ్డాయి. జనరల్ కోటాలో ఎవరైనా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. కానీ, సీనియర్లు, గర్భిణులు, 45+ ఏళ్ల మహిళలు మాత్రమే లోయర్ బెర్త్ కోటా కోసం టికెట్లు రిజర్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఆటో అప్ గ్రేడ్ విధానం
ఇప్పటికే పూర్తి ఛార్జీ చెల్లించి వెయిట్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణీకులు అదనపు ఛార్జీలు లేకుండా పై క్లాస్ లో ప్రయాణించేందుకు అనుమతించేలా ఆటో అప్ గ్రేడ్ పథకాన్ని ఇండియన్ రైల్వే అందుబాటులోకి తీసుకొచ్చింది. బుకింగ్ సమయంలో మాత్రమే ఆటో అప్‌గ్రేడేషన్ అందుబాటులో ఉంటుంది. మీ ప్రయాణ తరగతి కంటే పై క్లాస్ లో మాత్రమే ఆటో అప్‌గ్రేడ్ అనుమతి ఉంటుంది. మీకు వెయిట్ లిస్ట్‌లో స్లీపర్-క్లాస్ టికెట్ ఉంటే, మీరు 3ACకి అప్‌గ్రేడ్ చేయబడతారు. 3 AC, 2 ACలో వెయిట్‌లిస్ట్ చేయబడిన ప్రయాణీకులు 2 AC, 1 ACకి అప్ గ్రేడ్ చేయబడతారు.
రైల్వే టికెట్ రిజర్వేషన్ కోసం VIKALP పథకం
VIKALP అనేది టికెట్ రిజర్వేషన్ పథకం. ఇది వెయిట్‌లిస్ట్‌లోని ప్రయాణీకులు ఒకే తేదీన ఒకే మార్గంలో ప్రత్యామ్నాయ రైళ్లలో కన్ఫార్మ్ సీట్లను ఎంచుకోవడానికి అనుమతిస్తుంది. ఈ సర్వీసును ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. ఆయా రైళ్లలో సీట్ల లభ్యతకు లోబడి ఉంటుంది. టికెట్ బుక్ చేసుకునేటప్పుడు VIKALPని ఎంచుకుంటే, మీకు సరిపడే రైలు ఆప్షన్స్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు.
విదేశీయుల కోసం రిజర్వేషన్ విధానం
IRCTC వెబ్ సైట్ విదేశీయులు, NRIలు 2 AC, 1 AC, ఎగ్జిక్యూటివ్ ట్రావెల్ తరగతులకు టికెట్లను బుక్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. విదేశీయులు, NRIలు విదేశీ పర్యాటక కోటా కింద మాత్రమే బుక్ చేసుకోవచ్చు. భారతీయ పౌరులకు రిజర్వేషన్ ప్రక్రియ ఒకేలా ఉంటుంది.
రైల్వే టికెట్ రిజర్వేషన్ నియమాలు
⦿ జనరల్ కోటా రిజర్వేషన్ల కోసం ఒక్కో పీఎన్ఆర్ మీద 6 టికెట్లను బుక్ చేసుకోవచ్చు. తత్కాల్ రిజర్వేషన్లు ఒక్కో పీఎన్ఆర్ కింద నలుగురికి మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
⦿ IRCTC వినియోగదారులు నెలకు ఒకే PNR కోసం 6 టికెట్లు బుక్ చేసుకోవచ్చు. వారి ఆధార్ అకౌంట్ లింక్ చేస్తే నెలకు ప్రతి IDకి 12 టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
⦿ మొదటి చార్ట్ వరకు, సాధారణంగా రైలు బయలుదేరే నాలుగు గంటల ముందు రిజర్వేషన్లు అనుమతించబడతాయి.
⦿ మొదటి చార్ట్ సిద్ధం చేసిన తర్వాత కొన్ని రైళ్లకు సీట్లు రిజర్వ్ చేసుకోవచ్చు.
Read Also: ఆ రెండు రైల్వే స్టేషన్లు క్లోజ్, ఇండియన్ రైల్వే షాకింగ్ డెసిషన్, ఎందుకంటే?